గుడికి దగ్గర్లో ఆ పని చేసి వీడియో షేర్‌ చేశారు...తిక్క కుదురింది.. పిలిపించి మరీ అరెస్ట్‌ చేసిన పోలీసులు

ల్స్ వీడియోలు తీయడం కోసం యువత డేంజరస్ స్టంట్‌లతో ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్నారు. మొన్న మహారాష్ట్రలోని ఔరంగబాద్ లో ఓ యువతి రీల్స్ కోసం కారును రివర్స్ చేస్తూ లోయలో పడి చనిపోయిన ఘటన జరగగా.. Sri Media News

Jun 28, 2024 - 14:35
 0  4
గుడికి దగ్గర్లో ఆ పని చేసి వీడియో షేర్‌ చేశారు...తిక్క కుదురింది.. పిలిపించి మరీ అరెస్ట్‌ చేసిన పోలీసులు

రీల్స్ వీడియోలు తీయడం కోసం యువత డేంజరస్ స్టంట్‌లతో ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్నారు. మొన్న మహారాష్ట్రలోని ఔరంగబాద్ లో ఓ యువతి రీల్స్ కోసం కారును రివర్స్ చేస్తూ లోయలో పడి చనిపోయిన ఘటన జరగగా.. తాజాగా అదే రాష్ట్రంలోని పుణేలో మరో యువతి పెద్ద బిల్డింగ్‌పై నుంచి ఓ యువకుడి చేయి పట్టుకుని వేలాడిన వీడియో బయటకు వచ్చింది.


ఆ యువతి స్పైడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సినిమాలోని ఓ సీన్  రీక్రియేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి, వీడియో షూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకొని, సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. దాదాపు 100 ఫీట్లు ఉన్న ఓ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నుంచి వేలాడుతూ రీల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. మరో యువకుడు పై నుంచి ఆమె చేతిని పట్టుకోగా, ఆ యువతి కిందికి వేలాడటం వీడియోలో కనిపించింది. మరో ముగ్గురు యువకులు బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చివరి నుంచి, కింద నుంచి వీడియోలు తీశారు. ఈ స్టంట్ లో ఏ మాత్రం పట్టుతప్పినా యువతి ప్రాణాలు గాల్లో కలిసేవి. ఈ ఘటన పుణెలోని స్వామి నారాయణ్ టెంపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దగ్గర్లో జరిగింది. అయితే, దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.. అంతేగాకుండా.. ఇటువంటి వారిని అరెస్ట్‌ చేయాలంటూ పోలీసులకు ఈ వీడియోను ట్యాగ్‌ చేసి కామెంట్స్‌ చేయటంతో.. స్టంట్స్‌ చేసిన వారి గురించి పోలీసులు సెర్చింగ్‌ మెుదలు పెట్టారు.


ఈ రీల్‌ చేసింది మిహిర్ గాంధీ, అతని స్నేహితురాలు మినాక్షి సలుంఖేగా గుర్తించగా.. వీడియో తీసిన మూడో వ్యక్తి పరారీలో ఉన్నాడు. వీరిద్దరినీ భారతీ విద్యాపీఠ్‌ పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి అరెస్టు చేసినట్లు ఇన్స్పెక్టర్‌ దశరత్‌ పాటిల్‌ చెప్పారు. ఫేమస్‌ అవ్వాలన్న పిచ్చిలో ఏదోదే చేస్తూ.. ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దనీ ఈ సందర్భంగా ఆయన యూత్‌కి సూచించారు. ప్రస్తుతం యువతలో చాలా మంది.. రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోయేందుకు తహతహలాడుతున్నారు. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోవటంతో.. ఆ క్రేజ్‌ను ఉపయోగించుకుని ఓవర్ నైట్ స్టార్ కావాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్ని చేస్తున్నారు. కొందరు డీసెంట్‌గా యూట్యూబ్ వీడియోలు చేస్తూ.. అటు వాళ్ల ట్యాలెంట్‌ను ప్రదర్శించుకుంటూనే.. మరోవైపు డబ్బు కూడా సంపాదించుకుంటున్నారు. మరికొందరు మాత్రం.. వెంటనే వైరల్ అయిపోయి ఫేమస్‌ అయిపోదామని.. యూట్యూబ్ షార్ట్స్, ఇన్ స్టాలో రీల్స్ కోసం రిస్కులు చేస్తూ.. ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. మహారాష్ట్రలో ఓ యువతి.. రీల్స్ పిచ్చితో కారుతో సహా కొండపై నుంచి లోయలో పడి చనిపోయన ఘటన ఇంకా మర్చిపోక ముందే వీరి ప్రమాదకర స్టంట్‌ వీడియో తెగ వైరల్‌ అయ్యింది.


ఇటువంటి వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోతే.. ఫేమస్‌ అవ్వటం కోసం ఇటువంటి స్టంట్‌లు చేస్తూనే ఉంటారని పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. అయినా ఈ రీల్స్‌, ఫేమస్‌ అవ్వాలన్న పిచ్చిలో బంగారం లాంటి భవిష్యత్తుని పాడు చేసుకుంటుంది యువత. కొందరు విచిత్ర వేషధారణతో వీడియోలు చేస్తే.. మరికొందరు.. మగవారు ఆడవారిని ఇమిటేట్‌ చేస్తూ వీడియోస్‌ చేయటం ఎక్కువైపోయింది.. మరికొందరు అయితే బైకులు, కార్లపై ప్రమాదకర స్టంట్లు చేసి.. ప్రాణాలో కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ఇటువంటి ఘటనలు చూసైనా సరే యువతలో మార్పు రాకపోవటం బాధాకరం.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow