హార్దిక్ పని అయిపోయిందా..? నటాషా తో నిజం గానే విడాకులు తీసుకోబోతున్నాడా.... హార్థిక్ అసలు నిజాలు...

స్టార్ క్రికెటర్ హార్ధిక్ పాండ్య ఈ సారి మీడియాలో సెన్సేషన్ అయ్యాడు. హార్ధిక్ ను వరల్డ్ కప్ కు ఎంపికచేయరనే రూమర్స్ వినిపించాయి.Sri Media News

Jun 1, 2024 - 12:45
 0  7
హార్దిక్ పని అయిపోయిందా..? నటాషా తో నిజం గానే విడాకులు తీసుకోబోతున్నాడా.... హార్థిక్ అసలు నిజాలు...

ఆయన్ను కుక్కతో పోల్చారు...

స్టార్ క్రికెటర్ హార్ధిక్ పాండ్య ఈ సారి మీడియాలో సెన్సేషన్ అయ్యాడు. సోషల్ మీడియాలో అయితే ఇక చెప్పక్కర్లేదు. మొదటిది గుజరాత్ కెప్టెన్ గా ఉన్న హార్ధిక్ పాండ్యా సడెన్ గా ముంబై కెప్టెన్ గా ఎంపికయ్యాడు. అది కూడా రోహిత్ శర్మ లాంటి లెజెండరీ క్రికెటర్ ఉండగా. దాంతో ఐపీఎల్ లో ఏకపక్షంగా ముంబై ఇండియన్స్ మేనేజ్ మెంట్ గుజరాతీ లాబీయింగ్ కారణంగా రోహిత్ శర్మ ఇక ఐపీఎల్ టీమ్ ను ముందుకుతీసుకెళ్లలేదు. గుజరాత్ ను చాంపియన్ టీమ్ గా తయారు చేసిన పాండ్యా కావాలని తెచ్చుకుంది. అయినా రోహిత్ శర్మ సరేనని పాండ్య కింద ఆడేందుకు రెడీ అయ్యాడు. కానీ హార్ధిక్ పాండ్యాను సొంత గుజరాత్ ఫ్యాన్స్ హేళన చేశారు. ఆయన్ను కుక్కతో పోల్చారు. స్టేడియంలోకి కుక్క వస్తే హార్ధిక్ హార్దిక్ అని గేలి చేశారు. ఇటు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కూడా హార్ధిక్ ను గేలి చేశారు. టాస్ వేసే దగ్గర్నుంచి బ్యాటింగ్ కు వెళ్లే వరకు ప్రతి నిమిషం వెంటాడారు. ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పక్కర్లేదు. ఇటు వరుసగా ముంబై టీమ్ మ్యాచ్ లను ఓడిపోయింది. రోహిత్ శర్మ ను పొగుడుతూ హార్ధిక్ ను ఆడుకున్నారు. ఎంతలా అంటే ముంబై ఇండియన్స్ టీమ్ ఓడిపోయినా సంబరాలు చేసుకున్నారు. నీకు రోహిత్ కంటే ఎక్కువ తెలుసా? అతని కంటే గొప్ప కెప్టెన్ వా? ఐదు సార్లు చాంపియన్ గా నిలిపిన లెజెండరీ క్రికెటర్ కంటే ఎక్కువా అని ఆడుకున్నారు. చివరకు ముంబై ఇండియన్స్ దారుణంగా ఐపీఎల్ సీజన్ ను ముగించింది. ఇక వరుస ఓటముల తర్వాత ముంబై టీమ్ వెంబడి చివరకు నీతా అంబానీ కూడా రాలేదు. ఇక హార్ధిక్ ట్రోలింగ్ ను భరించలేక ముంబై స్టేడియంలో మ్యాచ్ కు స్కూల్ పిల్లలకు ఉచితంగా టికెట్ లు ఇచ్చి మరీ రప్పించారు. సాధారణ ప్రేక్షకులు డబ్బులు పెట్టి వచ్చినా హార్ధిక్ ను టీమ్ ను ఆడుకుంటారని. అంతలా వ్యతిరేకతను మూటకట్టుకున్నాడు. అంతే కాదు గ్రౌండ్ లో హార్ధిక్ ప్రవర్తన కూడాదారుణంగా ఉంది.

హార్దిక్ పని అయిపోయిందా..? 

మరోవైపు దారుణంగా ఫెయిలైన హార్ధిక్ ను వరల్డ్ కప్ కు ఎంపికచేయరనే రూమర్స్ వినిపించాయి. కానీ గుజరాతీ లాబీ బలంగా పని చేసింది. బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జే షా పట్టుబట్టి మరీ రోహిత్ కు సెలక్టర్ అగార్కర్ కు ఇష్టం లేకపోయినా ఎంపిక చేయాలని కోరడంతో చాన్స్ దక్కింది. దాంతో అమెరికాకు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడేందుకు వెళ్లాడు రోహిత్. కానీ దేశంలో మాత్రం అతని భార్య నటాషాతో విడాకులు కన్ఫమ్ అయ్యాయనే వార్తలు మాత్రం వైరల్ గా మారుతూనే ఉన్నాయి. నటాషా స్టాంకోవిక్ కు తన ఆస్తిలో 70 శాతం ఇచ్చేసి విడాకులు తీసుకుంటున్నాడనే వార్తలు నేషనల్ మీడియాలో కూడా వస్తున్నాయి.

హార్థిక్ అసలు నిజాలు... 

హార్దిక్ పాండ్య ఏమీ పుట్టుకతో ధనవంతుడు కాదు. అతని తండ్రి మొదట సూరత్ లో చిన్న కార్ ఫైనాన్స్ కంపెనీ నడిపాడు. తర్వాత నష్టాలు రావడంతో మూసేసి తర్వాత ఫైనాన్స్ లోన్ ఏజెంట్ గా మారాడు. హార్దిక్ పాండ్రాతో పాటు క్రునాల్ పాండ్య లను క్రికెట్ అకాడమిలో చేర్పించేందుకు చాలా కష్టపడ్డారాయన. ఆస్తులను అమ్మేసి సెకండ్ హ్యాండ్ కారు కొనిపెట్టారు. దానిలోనే హార్దిక్ పాండ్య, క్రునాల్ పాండ్యలు క్రికెట్ గ్రౌండ్ కు వెళ్లేవారు. అయితే జూనియర్ క్రికెటర్ లో హార్దిక్ కంటే క్రునాల్ పాండ్యా భాగా ఆడేవాడు. ఒంటి చేత్తో మ్యాచ్ లు గెలిపించేవాడు. కానీ ఆ తర్వాత రంజీ క్రికెట్ కు వచ్చే సరికి ఆల్ రౌండర్ గా ఎదిగాడు హార్దిక్ పాండ్య. అది కూడా పేస్ బౌలింగ్ తో వికెట్లు తీసి బీసీసీఐ సెలక్టర్ ల ద్రుష్టిలో పడ్డాడు. భోజనాలకు డబ్బులు లేకపోతే పస్తులుండి మరీ నీళ్లు తాగి క్రికెట్ ప్రాక్టీస్ చేశాడు హార్దిక్ పాండ్య. కానీ నేషనల్ టీమ్ లో చేరిన తర్వాత బీసీసీఐ కాంట్రాక్ట్ తో పాటు, మ్యాచ్ ఫీజులు, ఐపీఎల్ డబ్బు వచ్చి పడింది. ఆ తర్వాత యాడ్స్ తో కూడా భారీగానే సంపాదించాడు. దాంతో తన మధ్యతరగతి జీవితాన్ని వదిలేసి సూపర్ రిచ్ లైఫ్ కు అలవాటు పడ్డాడు. దాంతో నటాషా ను ముందే ప్రియురాలిగా పరిచయం చేశాడు. విదేశాలు తిరుగుతూ ఏకంగా పెళ్లికి ముందే గర్భవతిని చేశాడు హార్దిక్ పాండ్య. దాదాపు మూడేళ్లు ప్రేమించుకున్న తర్వాత 2020, జనవరి ఒకటిని తాము ఎంగేజ్మెంట్ చేసుకున్నామని ఫోటో పెట్టాడు. 

నటాషా తో నిజం గానే విడాకులు తీసుకోబోతున్నాడా.... 

నటాషా గర్భం దాల్చడంతో ఆ విషయాన్ని ఎనౌన్స్ చేశాడు. అతి కొద్ది మంది సిన్నిహితుల సమక్షంలో కరోనా పీక్స్ లో ఉన్నప్పుడే చిన్న సెరమని చేసుకుని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత హార్దిక్ కు కొడుకు పుట్టాడు. అతనికి అగస్త్య పాండ్య అని పేరు పెట్టుకున్నారు. కానీ వారి జీవితం సాఫీగా ఉన్న సమయంలోనే నటాషా పెద్ద హ్యాండ్ ఇచ్చిందట. సెర్బియాకు చెందిన జిమ్ ట్రెయినర్ అలెగ్జాండర్ కు దగ్గరైంది. అంతకు ముందే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో వేరు వేరుగా ఉంటున్నారు. కానీ బయటి ప్రపంచానికి తెలియనివ్వలేదు. కానీ నటాషా మాత్రం బహిరంగంగా తన దేశానికే చెందిన జిమ్ ట్రెయినర్ తో దగ్గరైంది. ఈ అలెగ్జాండర్ చాలా మంది సెలబ్రిటీలకు ఫిట్ నెస్ ట్రెయినర్. మొన్నటి వరకు బాలీవుడ్ హీరోయిన్ దిశా పఠాని బోయ్ ఫ్రెండ్ కూడా. ఆమె తో దాదాపు మూడేళ్లు డేటింగ్ చేశాడు. ఆ తర్వాత విడిపోయారు. ఇప్పుడు హార్దిక్ పాండ్య భార్య పైగా తన దేశానికే చెందిన నటాషా కు దగ్గరయ్యాడు. అయితే విడాకుల కోసం భారీగాడిమాండ్ చేసిందట. కొడుకు బాధ్యత తనదే కాబట్టి ఆస్తిలో వాటా అడిగిందట. దాదాపు 70 శాతం ఆస్తిని కొడుకు పేరు మీద రాసిచ్చి విడాకులకు సిద్దమయ్యాడని టాక్. అయితే ఇంకా లీగల్ గా వారిద్దరూ విడిపోలేదు. అయితే ఇక్కడో విషయం చెప్పుకోవాలి. ఐపీఎల్ లో ముంబై టీమ్ కు కెప్టెన్ గా వచ్చినా కూడా హార్దిక్ పాండ్య ఆట తీరు భార్య వల్లే దెబ్బతిన్నదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మరి తన ఆస్తి....

కొడుకు పుట్టిన తర్వాత 2023 ఫిబ్రవరిలో పెళ్లి తాలూకు పార్టీ చేసుకున్నాడు హార్దిక్. కానీ పెళ్లి పార్టీ జరిగి ఏడాది కాకముందే విడిపోవడం విశేషం.  సెర్బియా దేశానికి చెందిన మహిళను చేసుకుంటే ఆమె ఇక్కడ ఇమడలేదు. చివరకు విడాకుల మీద రూమర్స్ వస్తున్నాయి. అది నిజమే అన్నట్లు సెర్బియా ఫ్రెండ్ తో డేటింగ్ కు బహిరంగంగా వెళ్తోంది నటాషా. మరి తన ఆస్తిలో 70 శాతం ఇచ్చాడా? అది నిజమేనా? విడాకుల వ్యవహారం ఏంటనేది మున్ముందు తెలుస్తుందనడంలో సందేహం లేదు. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow