కోహ్లీ లేడు, ధోనీ లేడు,రోహిత్ శర్మ అంతకన్న లేడు ....హైదరాబాద్ బ్రాండెడ్ క్రికెట్ ఆడింది..... చివరి అడుగు తప్పిందంతే

ఐపీఎల్ 2024 ఛాంపియన్ గా కోల్ కథా నైట్ రైడర్స్ నిలిచింది. ఫైనల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బోల్తా పడింది. ఆల్ రౌండ్ పర్ఫామెన్స్ తో సన్ రైజర్స్ ను చాలా సింపుల్ గా ఓడించింది....Sri Media News.

May 26, 2024 - 23:35
May 27, 2024 - 16:36
 0  43
కోహ్లీ లేడు, ధోనీ లేడు,రోహిత్ శర్మ అంతకన్న లేడు ....హైదరాబాద్ బ్రాండెడ్ క్రికెట్ ఆడింది..... చివరి అడుగు తప్పిందంతే

ఐపీఎల్ 2024 ఛాంపియన్ గా కోల్ కథా నైట్ రైడర్స్ నిలిచింది.  ఫైనల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బోల్తా పడింది. ఆల్ రౌండ్ పర్ఫామెన్స్ తో సన్ రైజర్స్ ను చాలా సింపుల్ గా ఓడించింది. అసలు పోరాటమే లేకుండా సన్ రైజర్స్ చేతులెత్తేసింది. కనీసం పోరాడి ఓడినా భాగుండేది. హైదరాబాద్  ఓపెనర్స్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లు తొందరగా వికెట్ లు కోల్పోవడం కొంపముంచింది. ఇద్దరిలో ఒక్కరు నిలుచున్నా కూడా మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదేమో.కానీ చాలా నిర్లక్ష్యంగా ఆడారు ఓపెనర్ లు. భీభత్సమైన ఆటకు మారు పేరైన అభిషేక్, ట్రావిస్ హెడ్ లు కొంప ముంచారు. ఆ తర్వాత వచ్చిన వారు కూడా కనీసం నిలదొక్కుకునేందుకు ప్రయత్నం చేయలేదు. 

వరుసగా గ్యాప్ లేకుండా వికెట్లను పోగొట్టుకుంది హైదరాబాద్. మారక్రమ్ సీజన్ మొత్తం ప్లాప్ అయినా కూడా అతనికి అవకాశాలు ఇవ్వడం ఆశ్చర్యపరిచింది.  మారక్రమ్, నితిష్, క్లాసన్ ల దగ్గరైనా మంచి స్కోర్ సాధిస్తారని ఫ్యాన్స్ ఆశించారు. కానీ వారు కూడా విఫలమయ్యారు. క్లాసన్ కూడా దురద్రుష్టవశాత్తు బంతి బ్యాట్ కు తాకి వికెట్లను గిరాటేయడంతో షాక్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన షెహబాజ్, సమద్ లు కూడా నిర్లక్ష్యంగా ఆడి అవుటయ్యారు. చివరకు ప్యాట్ కమిన్స్ ఎదురు దాడి చేయాలని ప్రయత్నించినా కూడా సరైన మద్దతు దొరకలేదు.

పిచ్ పూర్తిగా బ్యాటింగ్ కు అనుకూలమని మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. కానీ బ్యాటింగ్ లో పూర్తిగా విఫలమైంది మన హైదరాబాద్ టీమ్.  తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన కోల్ కథా ఫోర్ లు, సిక్స్ లను సింపుల్ గా కొట్టింది. అదే పిచ్ మీద హైదరాబాద్ బ్యాటర్ లు బంతిని టచ్ చేయడానికి భయపడ్డారు. కానీ వెంకటేశ్ అయ్యర్ భీకరమైన బ్యాటింగ్ తో మన టీమ్ లోని లోపాలను బయటపెట్టాడు. ఇక తక్కువ స్కోర్ ఉండటంతో మన వాళ్లు బౌలింగ్ తో పోరాడలేకపోయారు. చివరకు బ్యాడ్ లక్ కూడా సన్ రైజర్స్ ను ముంచింది. 


కానీ ఓడిపోయినా కూడా ఈ సారి ఐపిఎల్ ను పూర్తిగా మార్చేసింది హైదరాబాద్ టీమ్. మొత్తం అగ్రెసివ్ అప్రోజ్ తో మొత్తం సినారియోను మార్చింది. బ్యాటింగ్ అంటే ఇలా ఉండాలన్నట్లుగా అదరగొట్టింది. ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే రికార్డ్ లు నెలకొలిపింది హైదరాబాద్. హయ్యెస్ట్ రన్స్ సన్ రైజర్స్ టీమ్ పేరు మీదే ఉన్నాయి. పవర్ ప్లేలో హయ్యెస్ట్ రన్స్, హయ్యెస్ట్ టీమ్ సిక్స్ లు మాత్రమే కాదు ఇండివిడ్జువల్ రికార్డ్ కూడా హైదరాబాద్ దే. అత్యధిక ఓపెనర్ పార్టనర్ షిప్ కూడా అభిషేక్, హెడ్ పేరు మీదే ఉన్నాయి.
ఫాస్టెస్ట్ చేజింగ్ నుంచి ఫెయిర్ ప్లే అవార్డ్ వరకు అన్నీ హైదరాబాద్ పేరు మీదే ఉన్నాయి.

 మొత్తం ఐపీఎల్ బ్యాటింగ్ స్టైల్ నే మార్చేసింది టీమ్. ఫైనల్లో ఓడిపోయినా కూడా ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయేలా ఆటాడింది. అందుకే నెంబర్ టూ పొజిషన్ లో నిలిచింది. ధోనీ లేడు, కోహ్లీ లేడు, రోహిత్ శర్మ అంతకన్న లేడు. అయినా కూడా హైదరాబాద్ కు బ్రాండెడ్ ఫ్యాన్స్ఉన్నారు. ఎందుకంటే తమకు మాత్రమే సాధ్యమైన బ్రాండెడ్ క్రికెట్ ఆడింది హైదరాబాద్. అందుకే గత నాలుగేళ్లుగాదారుణ ప్రదర్శనతో వెనుకబడ్డ సన్ రైజర్స్ ఫైనల్ కు చేరింది. చివరి అడుగు తప్పిందంతే. ఏది ఏమైనా వచ్చే ఏడాది ఖచ్చితంగా కప్ గెలుచుకునేలా ఆడుతుందనడంలో సందేహం లేదు. ఆల్ ది బెస్ట్ సన్ రైజర్స్. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow