ఐపీఎల్ ఫైనల్స్ కి చేరుకున్న SRH మరియు KKR, గెలుపెవరిది.? రెండు టీమ్స్ బలా, బలాలు ఏంటి.?
ఐపీఎల్ సీజన్ ఫైనల్ కు చేరుకుంది. ఫైనల్స్ ముంగిట కోల్ కథా, హైదరాబాద్ ఉన్నాయి. ఈ జట్లలో ఏ టీమ్ గెలుస్తుందంటే ముందు బలా, బలాలు చూద్దాం....SrimediaNews
ఐపీఎల్ సీజన్ ఫైనల్ కు చేరుకుంది. ఫైనల్స్ ముంగిట కోల్ కథా, హైదరాబాద్ ఉన్నాయి. ఈ జట్లలో ఏ టీమ్ గెలుస్తుందంటే ముందు బలా, బలాలు చూద్దాం. ఎందుకంటే రెండు టీమ్ లు దుర్భేధ్యంగా ఉన్నాయి. ముందు కెప్టెన్ ను చూసుకుంటే శ్రేయాస్ అయ్యర్ కంటే ప్యాట్ కమిన్స్ ది బెస్ట్ కెప్టెన్. ఫీల్డింగ్ నుంచి బౌలింగ్ వనరులను వాడుకోవడంలో ఎంతో అనుభవం ఉంది. పైగా ఛాంపియన్ కెప్టెన్. ఈ విషయంలో మాత్రం ప్యాట్ కమిన్స్ తన టీమ్ ను ఫైనల్ లో గెలిపించేందుకు ఖచ్చితంగా వెయ్యి రెట్లు ప్రయత్నిస్తాడు. అదే కోల్ కథా నైట్ రైడర్స్ కి కెప్టెన్ కంటే కోచ్ గంభీర్ చాలా పవర్ ఫుల్. మ్యాచ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. అలసత్వం అస్సలు సహించడు. ఏ బౌలర్ ఏ బ్యాట్స్ మన్ కు ఎలాంటి బంతులు వేయాలి, ఫీల్డింగ్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో ముందే చెబుతాడు. పక్కాగా ప్లానింగ్ తో కెప్టెన్ ని ఆటగాళ్లను పంపిస్తాడు. ఈ సీజన్ లో నైట్ రైడర్స్ సక్సెస్ కు కారణం కోచ్ గంభీర్. పైగా టీమ్ మొత్తం మీద షారూక్ ఖాన్ పూర్తి ఆదిపత్యాన్ని ఇచ్చాడు. ఎంతలా అంటే గెలుపు గురించి ఓటమి గురించి కూడా షారూక్ ఎవరితోనూ మాట్లాడడు. కేవలం హోటల్ మీటింగ్ లో పైపైన మాట్లాడుకుంటారంతే. ఎందుకంటే గెలుపు బాద్యతలను కోచ్ మీదే వదిలేస్తాడు షారూక్. అందుకే ఆ టీమ్ అంత జోష్ గా ఉంటుంది. ఈ రెండు తేడాల కంటే కూడా రెండు టీమ్స్ సమ ఉజ్జీగానే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అనుభవంతో పాటు కింది స్థాయి వరకు బ్యాటింగ్ చేయగల సత్తా మాత్రం నైట్ రైడర్స్ కి ఉంది. ఎందుకంటే అందరూ సీనియర్ లే. అదే సన్ రైజర్స్ కు వచ్చే సరికి యంగ్ బ్లడ్ ఉంది. అందుకే ప్రతి అనుభవం ఉన్న ఒక ప్లేయర్ తర్వాత ఒక యంగ్ స్టర్ వస్తుంటాడు. బ్యాటింగ్ ఆర్డర్ ను జాగ్రత్తగా గమనిస్తే భీకర ఫామ్ లో ఉన్నా కూడా క్లాసన్ ను కింద కు పంపించడం కారణమదే. అదే నైట్ రైడర్స్ చూసుకుంటే సునీల్ నరైన్ నుంచి శ్రేయాస్ అయ్యర్, రింకూ సింగ్, రస్సెల్, మిచెల్ స్టార్క్ ,వరుణ్, వెంకటేశ్ అయ్యర్ ఇలా ఉన్నారు. కానీ వీరందరి కంటే కూడా సన్ రైజర్స్ ది పై చేయి. ఎందుకంటే ఉన్న వనరులతో భీకరమైన అగ్రెసివ్ అప్రోచ్ తో బ్యాటింగ్ ను కొత్తగా దంచొచ్చు, శ్రుతి మెత్తగా కొట్టొచ్చని నిరూపించిన జట్టు సన్ రైజర్స్.
ఓపెనర్ లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లు కేవలం పవర్ ప్లే వరకు ఉంటే చాలు. దానమ్మ జీవితం స్కోర్ వంద దాటుతుంది. ఒక 12 ఓవర్లు ఉన్నారంటే 150 నుంచి 180 కొడతారు. వీణుల విందుగా దంచి కొడతారు. ఇలా ఆడటంలో కోల్ కథాకి నరైన్ ఉన్నాడు. కానీ అభిషేక్, ట్రావిస్ హెడ్ కు ఉన్నంత స్ట్రైక్ రేట్ లేదు. వీరిద్దరిదీ రెండు వందలకు పైగానే ఉంది. కాబట్టి ఓపెనింగ్ విషయంలో మాత్రం సన్ రైజర్స్ దే పై చేయి. ఇక స్పిన్ లో నిలబడి సిక్స్ లను బాదగలడు. ఇక షహబాజ్ దూకుడుగా ఆడగలడు, నెమ్మదిగా ఆడగలడు. కానీ వికెట్ పోతుందనే భయంలో ఉంటాడు. అందుకే బాధ్యతా యుతంగా ఆడుతాడు. ఇప్పుడు స్పిన్ తో కూడా తడాఖా చూపించాడు. చెన్నై పిచ్ మీద ఫైనల్ లో మరోసారి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గా అభిషేక్ తో కలిసి 8 ఓవర్లు పంచుకునే ఛాన్స్ ఉంది. అంటే సగం బౌలింగ్ వీరికే దక్కే చాన్స్ ఉంది. దీంతో బ్యాటింగ్ మీద హైదరాబాద్ చూసుకుంటే భీకరంగా ఉంది. ఓపెనర్లు పది ఓవర్లు ఉంటే మాత్రం ఒక మ్యాచ్ ని హైదరాబాద్ నుంచి లాక్కోవాలంటే మాత్రం బ్రహ్మదేవుడు దిగిరావాల్సిందే. వీరకొట్టుడు, నాటు కొట్టుడుతో మ్యాచ్ ని మార్చేయడమే కాదు కళ్లు మూసి తెరిచేలోపే ఖతం చేసేస్తారు. వీరిద్దరిని చూసే ఏ టీమ్ అయినా భయపడుతుంటుంది.
సూపర్. నైట్ రైడర్స్ కు మంచి స్పిన్ బలముంది. అందుకే దాదాపుగా పాతిక కోట్లు పెట్టి మిచెల్ స్టార్క్ ను కొన్నది. ఆ డబ్బులకు పైసా వసూల్ చేశాడు స్టార్క్. ఏకంగా తన టీమ్ ని ఫైనల్ కు తీసుకెళ్లేలా ట్రావిస్ హెడ్ ను అవుట్ చేశాడు. గతంలో అరడజను సార్లు అవే బంతులతో హెడ్ ను అవుట్ చేశాడు. అదే పద్దతిలో బాదుడుకు అలవాటు పడ్డ హెడ్ దొరికిపోయాడు. . కోల్ కథా తో జరిగిన మొదటి క్వాలిఫయర్ లో డకౌట్ కాగానే కళ్లలో నీళ్లు తిరుగుతుంటే అనుచుకుని తలవంచుకుని వెళ్లాడు. కాబట్టి స్టార్క్ వర్సెస్ హెడ్ పోటీ అదిరి పోతుంది. మిచెల్ స్టార్ట్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు కాబట్టి అంత సులువుగా సన్ రైజర్స్ ను వదిలిపెట్టడు. రస్సెల్ స్లో బంతులతో వికెట్ లు తీయడంలో దిట్ట. కానీ వీరికంటే కూడా నటరాజన్, భువనేశ్వర్, కమిన్స్ తో కూడిన పదునైన పేస్ బౌలింగ్ ఉంది. కానీ స్పిన్ లో మాత్రం నైట్ రైడర్స్ దే పై చేయి. సునీల్ నరైన్ స్పిన్ ను అర్దం చేసుకోవడం అంత సులువు కాదు. కానీ ఈ సారి నరైన్ ను భాగా ఆడిన టీమ్ ఉందంటే సన్ రైజర్సే. కాబట్టి అతనికి భయపడదు. అలా అని నరైన్ ఎప్పుడూ ఒకే ప్లాన్ తో వస్తాడనుకోవద్దు. పైగా చెపాక్ స్టేడియంలో స్పిన్ బౌలర్లదే బలం.
హైదరాబాద్ విషయానికి వస్తే నాణ్యమైన ఫుల్ టైమ్ స్పిన్నర్ లు లేరు. కానీ పిచ్ అనుకూలిస్తే బంతిని గింగిరాలు తిప్పుతామని షహబాజ్, అభిషేక్ లు నిరూపించారు. మారక్రమ్ వేయగలడు కానీ ప్రాక్టీస్ లేకపోవడంతో కాస్త బంతులు గతితప్పుతున్నాయి. దీంతో ఒక ఓవర్ తర్వాత ప్యాట్ కమిన్స్ రిస్క్ తీసుకోలేక మళ్లీ బంతిని ఇవ్వలేదు. బహుషా మళ్లీ ఫైనల్ కు మారక్రమ్ ఉంటే మాత్రం ఫుల్ టైమ్ ఉపయోగించుకునే ఛాన్స్ ఉంది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ ను వాడుకోవడంలో హైదరాబాద్ దే పై చేయి. రాజస్తాన్ తో మ్యాచ్ లో కోచ్ డేనియల్ వెటోరి చాలా వ్యూహాత్మకంగా షహబాజ్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా పంపించాడని ప్యాట్ కమిన్స్ చెప్పాడు అది వర్కవుట్ అయింది. 18 బంతుల్లో 18 పరుగులు చేయడమే కాదు ఏకంగా కీలకమైన మూడు వికెట్ లు తీసి మ్యాచ్ ను గెలుపు ముంగిట ఉంచాడు. అదే నైట్ రైడర్స్ విషయానికి వస్తే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అంకుల్ రాయ్ లేదా వైభవ్ అరోరా వచ్చే చాన్స్ ఉంది. కానీ వీళ్లను హైదరాబాద్ బ్యాట్స్ మన్ ఆడుకోగలరు.
అయితే మిచెల్ స్టార్క్, నరైన్, వరుణ్ చక్రవర్తి, రస్సెల్, నితిష్ రాణాలు ఇరగదీస్తున్నారు. ఈ సీజన్ మొత్తం భాగా ఆడుతున్నారు. అయితే ఫినిషర్స్ హైదరాబాద్ కు లేరు. కానీ కోల్ కథాకు మాత్రం చివరి వరకు ఆడగలరు. రింకూ సింగ్ కు పూనకం వస్తే అంతే సంగతులు. అదే హైదరాబాద్ విషయానికి వస్తే సమద్ సరిగ్గా నిరూపించుకోవాలి. ఒకే మ్యాచ్ లో భాగా ఆడాడు. దాంతో మంచి ఫినిషర్ లేక హైదరాబాద్ టీమ్ చివర్లో పరుగులు చేయలేక చతికల పడుతోంది. రాజస్తాన్ మ్యాచ్ తో అదే జరిగింది. క్లాసన్ అవుటయ్యాక మంచి దంచే ప్లేయర్ లేడు. కానీ కోల్ కథా బ్యాటింగ్ లైనప్ మాత్రం శత్రు దుర్భేద్యంగా కనిపిస్తుంది. నరైన్ ఇప్పటికే నాలుగువందల పరుగులకు పైగా చేశాడు. కానీ ఫిల్ సాల్ట్ లేకపోవడం వారికి దెబ్బే. తర్వాత వెంకటేశ్ అయ్యర్ వస్తాడు. మంచి బ్యాట్సమన్, వన్ డౌన్ లో నమ్మదగిని వ్యక్తి. శ్రేయాస్ అయ్యర్ బాధ్యతాయుతంగా ఆడుతాడు. తర్వాత నితిష్ రాణా వస్తాడు. అతన్ని అవుట్ చేసినా కూడా హైదరాబాద్ రెస్ట్ తీసుకునే ఛాన్స్ లేదు. ఎందుకంటే రస్సెల్స్ వస్తాడు. నిలబడ్డాడంటే బాదుడే బాదుడు. వీరద్దరిలో ఒకరు అవుటైనా కూడా బ్లాస్టర్ రింకూ సింగ్ వస్తాడు. బీభ్సతమైన ప్లేయర్. ఆడాడంటే ఉతుకుడే. కానీ ఈ సీజన్ లో పెద్దగా మెరుపులు లేవు. కానీ తనదైన టైమ్ వస్తే మాత్రం తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు కొట్టాల్సిన టైమ్ లో స్కోర్ ఎంతున్నా బాదేయగల సత్తా ఉంది. ఆ తర్వాత రమన్ దీప్ కూడా బ్యాటింగ్ లో చేయి వేయగల సత్తా ఉంది. ఏమైనా స్టార్క్, హర్షిత్, చక్రవర్తులు మాత్రమే బ్యాటింగ్ చేయరు. మిగతా 8 మంది బ్యాట్ ను జులించి భారీ స్కోర్ లు చేయగలరు.
అదే హైదరాబాద్ కు ఇంత పొడవు లైనప్ లేదు. ఉన్నా కూడా గుంటూరు కారం రేంజ్ లో ఘాటైన బ్యాటర్స్ ఉన్నారు. ఆడితే చిచ్చర పిడుగులే. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఆ తర్వాత త్రిపాటీ, మారక్రమ్. వీరు పోతే వాడి అమ్మ మొగుడన్నట్లు క్లాసన్ వస్తాడు. సమద్ నిలబడితే ఇక చుక్కలే. వీరందరి మధ్యలో నితిష్ కుమార్ రెడ్డి నిలబడినా కూడా స్కోర్ స్కైని తాకుతుంది. ఏది ఏమైనా ఫైనల్ లో హైదరాబాద్ గెలవాలంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లు రెచ్చిపోవాలి. కనీసం ఒక్కరైనా. అదే బ్యాటింగ్ లో నైట్ రైడర్స్ గెలవాలంటే నరైన్, వెంకటేశ్, శ్రేయాస్, రస్సెల్, రింకూలు రెచ్చిపోవాలి. వాల్లకు ఆప్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. వారికి ఏడు ఉంటే సన్ రైజర్స్ కి నమ్మకమైన ఐదుగురు బ్యాట్సమన్ ఉన్నారు. పది ఓవర్లను టాప్ త్రీ ఆడితే మిగతావి చూసుకునేందుకు హైదరాబాద్ కు మంచి ఆటగాళ్లున్నారు.
బౌలింగ్ లో ఇద్దరూ సమానమే. స్పిన్ లో నైట్ రైడర్స్ కాస్త పై చేయి గా ఉంది. బ్యాటింగ్ లో మాత్రం సన్ రైజర్స్ దే పైచేయి. వాళ్లు పది మంది ఉన్నా వారికి సరపడా నలుగురు భీకరమైన ప్లేయర్స్ హైదరాబాద్ లో ఉన్నారు. ఇక పిచ్ విషయానికి వస్తే స్పిన్ కు అనుకూలిస్తుంది. బౌన్స్ కూడా భాగానే ఉంది. రాజస్తాన్ తో ఆడిన అనుభవం హైదరాబాద్ కు ఉండటం కలిసొచ్చే అంశం. ఇంకా చెప్పాలంటే ప్యాట్ కమిన్స్ ఈ పిచ్ ను అంచనా వేసేందుకే క్వాలిఫయర్ వన్ ని లైట్ తీసుకున్నాడనే టాక్ కూడా ఉంది. ఎందుకంటే రెండవ సారి బ్యాటింగ్ చేసిన టీమ్ కు బంతి ఎక్కువగా టర్న్ అవుతోంది. కానీ అదే సమయంలో మంచు కూడా పొంచి ఉంది. అయితే ఫీల్డింగ్ లో నైట్ రైడర్స్ కంటే హైదరాబాద్ టీమ్ దే పై చేయి. కాబట్టి బలాలు చూసుకుంటే మాత్రం ఓవరాల్ టీమ్ గా మాత్రం నైట్ రైడర్స్ ఈ సారి కలిసికట్టుగా ఆడుతోంది. అదే హైదరాబాద్ టీమ్ ఎవరో ఒకరి మెరుపులతో నిలదొక్కుకుంది. కానీ రాజస్తాన్ తో క్వాలిఫయర్ లో మాత్రం ఉమ్మడిగా ఆడి ఆల్ రౌండ్ పర్ఫామెన్స్ చేసి ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. కాబట్టి రెండు టీమ్ లకు మధ్య పెద్ద తేడా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్. వీరిద్దరూ ఆడితే కోల్ కథా ఆశలు వదులుకోవాల్సిందే. మరి హైదరాబాద్ ఓపెనర్లు ఏ మేర ఇంపాక్ట్ చూపించి అదరగొడతారో చూడాలి. కప్ మాత్రం హైదరాబాద్ దే. ఎందుకంటే భీకరమైన బ్యాటింగ్ కు తోడు ప్యాట్ కమిన్స్ లీడర్ షిప్ స్కిల్స్ అన్నీటి కంటే కూడా గంభీర్ సేన కంటే పైన ఉంది.
What's Your Reaction?