8 ఏళ్ళ ప్రేమ 14 పేజీల లేఖ... వెంటాడి ప్రేమించి మోసం..

ప్రేమ...ఇదో బ్రహ్మపదార్ధం. ఎవరి జీవితం ఎలా కంపు కొడుతుందో తెలియదు. అన్ని ప్రేమలు మూడు ముళ్ల తీరానికి చేరవు.Sri Media News

May 31, 2024 - 15:00
Jun 1, 2024 - 13:08
 0  13
8 ఏళ్ళ ప్రేమ 14 పేజీల లేఖ...  వెంటాడి ప్రేమించి మోసం..
Akhila and Akhil Love Story?

ప్రేమ...ఇదో బ్రహ్మపదార్ధం

ఎవరి జీవితం ఎలా కంపు కొడుతుందో తెలియదు. అన్ని ప్రేమలు మూడు ముళ్ల తీరానికి చేరవు. యవ్వనపు పొంగులోని శృంగారపు వేడితో జతకలుస్తారు. కొద్ది రోజులు శారీరకంగా కలిసిన తర్వాత ప్రేమ మంచులా కరిగిపోతుంది. సినిమా లో ఉన్నంతగా ప్రేమ అందంగా కనిపిస్తుంది. మైకంలో తిరుగుతుంటే నిజ జీవితం తెలియదు. ఇద్దరిలో ఒకరు పనికిమాలిన వాళ్లైతే అంతే సంగతులు. మిగతావారి జీవితం నాశనమవుతుంది. ఇలాంటి ప్రేమ కథల్లో ఓ వెధవను ప్రేమించిన యువతి చివరకు తన 8 ఏళ్ల ప్రేమ ని 14 పేజీల సూసైడ్ లెటర్ లో రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన యావత్ తెలుగు ప్రజలను షాక్ కు గురిచేసింది. ఎంతో భవిషత్య ఉన్న అందమైన యువతి ఓ పనికిమాలిన వాడు ప్రేమంటూ వెంటపడితే మొదట ఒప్పుకోలేదు. కానీ చిన్న వయసులోనే వెంటపడ్డాడు. నువ్వే జీవితమన్నాడు. తెలిసి తెలియని వయసులో అతని ప్రేమకు ఓకే చెప్పింది ఆయువతి. 

అసలు ప్రేమ ఎలా మొదలయింది..

ఆమె పేరు అఖిల. వయసు 22 ఏళ్లు. జీడిమెట్లలోని ఉండే బాలబోయిన అఖిల షాపూర్ నగర్ కు చెందిన అఖిల్ సాయిగౌడ్ అనే యువకుడు ప్రేమిస్తున్నానని వెంట పడ్డాడు. కానీ ఆమె మొదట ఒప్పుకోలేదు. చిన్న వయసులో ప్రేమలను వారింట్లో ఒప్పుకోరని తెలుసు. పైగా ఆమెకు ఏడుగురు బాబాయ్ లు ఉన్నారు. వారందరిలో కూడా ఏకైక కూతురు అఖిల. అందరూ ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అందరూ ఆమెను గారాభం చేసేవారు. కానీ సాయి వదిలిపెట్టలేదు. అందంగా ఉందని వెంటపడ్డాడు. చివరకు నువ్వే ప్రాణమన్నాడు. నువ్వు లేకుండాబతకలేనని చెప్పాడు. నీ కోసం ప్రాణం ఇస్తానని సినిమా కబుర్లు చెప్పాడు. చివరకు ప్రేమను ఒప్పుకుంది. చాలా ఏళ్ల పాటు అఖిల తన ప్రేమను రహస్యంగానే ఉంచింది.సాయి నిన్నే పెళ్లి చేసుకుంటానని ప్రతి రోజు చెప్పేవాడు. 

ఛాతి మీద పచ్చబొట్టు వేసుకుని మరి...

నువ్వు లేకుండా బతకలేనని ఏకంగా చేతి మీద ఛాతి మీద అఖిల పేరును పచ్చబొట్టు వేయించుకున్నాడు. దీంతో నువ్వే నా ప్రాణమని నమ్మింది అఖిల. అలా వారి జీవితం 8 ఏళ్లు గడిచిపోయింది. మరోవైపు అఖిలకు ఇంట్లో పెళ్లి చేయాలనుకున్నారు. ఒక కంపెనీలో పని చేస్తున్న అఖిల తన ప్రేమ విషయాన్ని తల్లికి చెప్పింది. కానీ ఆమె మొదట ఒప్పుకోలేదు. మరోవైపు తండ్రికి ఏమీ తెలియదు. పెళ్లైన ఏడేళ్ల తర్వాత పుట్టిన అఖిల అంటే తండ్రికి ప్రాణం. తనకు ఉన్నంతలో గొప్పగా చూసుకున్నాడు. ప్రాణానికి ప్రాణంగా కూతురును పెంచుకున్నాడు. ఇలాంటి ప్రేమ పెళ్లిల్ల మీద నాకు నమ్మకం లేదు. నాకు నచ్చిన, నేను నమ్మిన వాడికే ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు తండ్రి. మరోవైపు సాయి గౌడ్ తల్లిదండ్రులు కూడా ఒప్పుకోలేదు. వారిది ధనవంతుల కుటుంబం. వారికి కట్నం కావాలి. కానీ సాయి ఒప్పించాడు.  అయితే సాయి తో ప్రేమ విషయంతెలియడంతో వద్దని చెప్పాడు తండ్రి. కానీ అఖిల, ఆమె తల్లి కలిసి తండ్రిని ఒప్పించారు. తను ఇష్టపడుతుంది. 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారట అని చెప్పారు. దాంతో తండ్రి ఒప్పుకున్నాడు. ఇటు ప్రేమ పెళ్లికి ఒప్పుకున్నందుకు ఇటు అఖిల, అటు సాయి గౌడ్ లో ఖుషీ అయ్యారు. నాటి నుంచి వారి ప్రేమ హాయిగానే సాగింది. ఎవరి పనిలో వారున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే సాయి సోదరి మ్యారేజ్ తర్వాత వారి పెళ్లి చేస్తామని చెప్పారట తల్లిదండ్రులు. 

అంత ప్రేమించి ఎందుకు మారిపోయాడు...

ఎలాగూ తాను ఇష్టపడ్డ వాడితో పెళ్లి జరగబోతుందని అఖిల సంతోషంగా గడిపింది. కానీ సాయి గౌడ్ ఇక్కడి నుంచి మారిపోయాడు. తన బంధువుల పిల్లలకు లక్షల్లో కట్నం రావడంతో తల్లిదండ్రుల ఒత్తిడో మరొకటో కానీ మారిపోయాడు. ఇక తన సోదరికి కూడా 80 లక్షల కట్నం ఇచ్చేందుకు సంబంధాలు చూస్తున్నారట. దాంతో అఖిలను వదిలించుకునేందుకు డ్రామాలు ఆడటం మొదలు పెట్టాడు. ప్రేమకు పాతరేశాడు. అఖిలను వదిలించుకుంటే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎక్కువ కట్నం వస్తుందని అనుకున్నాడు. నాటి నుంచి వేధించడం మొదలు పెట్టాడు. చివరకు బజారులో కూడా తాను ప్రాణంగా ప్రేమిస్తున్నానని వెంట తిరిగిన సాయి ఆమె పై చేయి చేసుకున్నాడు. మొత్తం మీద అఖిల ను వదిలించుకునేందుకు సైకోలా మారాడు. ఈ మధ్య ఎన్నికలు రావడంతో అఖిల, సాయి మధ్య గ్యాప్ పెరిగింది. అతను ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడం మొదలు పెట్టారు. దీంతో అఖిలకు తల్లి సర్ది చెప్పింది. అతనికి ఇష్టం లేదనుకుంటాను. నువ్వు వదిలేయ్. అతనికి డబ్బుందని అనుకుంటున్నాడేమో. నేను మీ నాన్నను పెళ్లి చేసుకుని హాయిగా బతుకుతున్నాను. నీకు మంచి సంబంధం తీసుకొస్తానని చెప్పింది. దాంతో అఖిలకు ఏమీ అర్ధం కాలేదు. చివరకు తాను కూడా సాయి గురించి ఏం చేయాలో నిర్ణయించుకోలేకపోయింది. కానీ మళ్లీ సాయి ఫోన్ లు చేయడం మొదలు పెట్టాడు. నువ్వు లేకుంటే నేను బతకలేనని చెప్పాడు. చివరకు అఖిల తల్లికి ఫోన్ చేశాడు సాయి. ఆంటీ మీరు అఖిల మనసు మార్చొద్దు. నేను పెళ్లి చేసుకుంటాను. కావాలంటే నాకు ఆమె మీద ప్రేమ ఎంత ఉందో చూడమని ఏకంగా టాటూలను ఆమె ఫోన్ కు పంపించాడు. కానీ అది మూన్నాళ్ల ముచ్చటే అయింది. సాయి గౌడ్ ప్రియురాలిని వదిలించుకునేందుకు సైకోలా మారాడు. కొన్ని సార్లు నువ్వే కావాలంటాడు. చస్తానని బెదిరిస్తాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు భయబ్రాంతులకు గురయ్యారు. రోడ్డు మీద కొట్టడం నుంచి దారుణంగా వేదించడం మొదలు పెట్టాడు సాయి. 

ఆ 14 పేజీల లేఖ లో ఏముందంటే...

 అయితే ఇన్నాళ్లు తన తండ్రికి ఈ విషయం చెప్పుకోలేదు. ఎంత వేధించినా కూడా నాకు నచ్చినవాడే కదా అనుకుంది. పెళ్లైతే మారుతాడనుకుంది. కానీ అసలు పెళ్లే వద్దని, ఆమెకు ఆమెగా వెళ్లిపోయేందుకు ఇలా డ్రామాలు ఆడుతున్నాడని ఆమె తెలియదు. సాయి మోసాన్ని ఏకంగా 14 పేజీల్లో చనిపోయే ముందు రాసింది అఖిల. అమ్మా, నాన్న నన్ను క్షమించండి. మీరు వద్దన్నా నేను సాయిని ప్రేమించాను. నేను ఒప్పుకోకపోయినా వెంటపడ్డాడు. మధ్యలోవదిలేసినా మళ్లీ జీవితంలోకి వచ్చాడు. మంచివాడనుకున్నాను. కానీ ఇక నన్ను పెళ్లి చేసుకోనని చెప్పాడు. నేను ఈ బాదనుతట్టుకోలేను. మిమ్మల్ని బాదపెట్టలేను. నేను వెళ్లిపోతున్నాను. తమ్ముడిని భాగా చూసుకోండి. నా మీద ప్రేమ పంచిన బాబాయ్ లు అందరికీ థ్యాంక్స్. నేను మిమ్మల్ని వదిలివెళ్లిపోతున్నాను క్షమించండి. సాయి చేసిన మోసం నేను తట్టుకోలేను. 8 ఏళ్లుగా ప్రేమించి ఇప్పుడు పెళ్లి చేసుకోనంటున్నాడు. నన్ను ఎన్నో సార్లు కొట్టాడు, వేధించాడు. అయినా మీకు చెప్పుకోలేదు. ఇక పెళ్లే చేసుకోనంటున్నాడు. నేను వెళ్లిపోతున్నానని లేఖ రాసింది అఖిల. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. ఆ లేఖను చూసిన తండ్రి కుప్పకూలిపోయాడు. నేను నా బిడ్డ కోసం కష్టపడ్డాను. ఒకరి చేతిలో పెట్టి సంతోషంగా ఉంటే చూడాలనుకున్నాను. అతని గురించి నాకు తెలియదు. నాకు ఏమీ చెప్పేది కాదు. ఏదైనా అవసరముంటే నాన్న నాకు అది కావాలి, ఇది కావాలని మాత్రమే అడిగేది. వాళ్ల అమ్మకే చెప్పేది. చివరి సారి కూడా సరిగ్గా నా బిడ్డతో మాట్లాడలేకపోయానని తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు. మరోవైపు నిందితుడు సాయి పరారీలో ఉన్నాడని, అతన్ని పట్టుకునేందుకు స్పెషల్ టీమ్ లు ఏర్పాటు చేశామని జీడిమెట్ల ఎస్సై ముంత ఆంజనేయులు మీడియాకు తెలిపారు. ప్రేమించి మోసం చేయడంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. మ్రుతదేహాన్ని పోస్టుమార్టం చేయించి అప్పగించాం. నిందితుడిని పట్టుకుని కోర్టులో ప్రవేశపెడతామన్నారు ఎస్సై. మరోవైపు నిందితుడైన సాయికి కఠిన శిక్ష పడేలా చూడాలని తల్లిదండ్రులు బంధువులు డిమాండ్ చేస్తున్నారు. పెళ్లైన ఏడేళ్లకు పుట్టిన అఖిలను ప్రాణంగా పెంచుకున్నారు తల్లిదండ్రులు. కానీ ప్రేమ కారణంగా ఇప్పుడు వారి సంతోషం కూడా మిగల్లేదు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow