కళ్లు మూసుకుంటే ఆ దేవుడు కనిపిస్తాడు. కాపాడు స్వామి అనుకుంటాం. ఇదే దేవుడు విగ్రహంగా ఎంతో మంది ప్రాణాలకు కాపాడుతున్నాడు.

దేవుడు కనిపించగానే దండం పెట్టకుండా ముందు కెళ్లలేము. కనీసం మనసులోనైనా తలుచుకుంటాం. కొంత మంది వాహనాలను పక్కకు ఆపి మరీ దిగి దండం పెట్టుకుని వెళ్తుంటారు.Sri Media News

Jun 2, 2024 - 17:06
Jun 2, 2024 - 17:05
 0  10
కళ్లు మూసుకుంటే ఆ దేవుడు కనిపిస్తాడు. కాపాడు స్వామి అనుకుంటాం. ఇదే దేవుడు విగ్రహంగా ఎంతో మంది ప్రాణాలకు కాపాడుతున్నాడు.
God-is-saving-many-lives-as-an-idol-hanuman

గాజువాక నుంచి విశాఖ వెళ్లే హైవే

దేవుడంటే మనందరికీ నమ్మకం, బలం. పూజలు చేయకపోయినా, ప్రతి వారం కొబ్బరి కాయ కొట్టకపోయినా సరే కొత్త పని మొదలు పెట్టినప్పుడు దేవన్ని తలుచుకుంటాం. దేవుడి కోసం ప్రతి రోజు గుడికి వెళ్లే సమయం మనకు లేదు. అందుకే నచ్చిన దేవుడికి మనసులోనే గుడికట్టుకుంటాం. ఆలోచనల్లోనే పూజలు చేస్తాం. కళ్లు మూసుకుంటే ఆ దేవుడు కనిపిస్తాడు. కాపాడు స్వామి అనుకుంటాం. ఇదే దేవుడు విగ్రహంగా ఎంతో మంది ప్రాణాలకు కాపాడుతున్నాడు. ఏంటి మీకు నమ్మడానికి ఆశ్చర్యంగా ఉందా? కానీ నిజం. వినడానికి, చెప్పడానికి ఇది చాలా చిన్న విషయం కావచ్చు. నిజంగా కాస్త డీప్ గా ఆలోచిస్తే మనకు నిజమే కదా అనిపిస్తుంది. మనకు నేల మహిమ, గాలి మహిమ అనుకుంటాం. అలాంటి ప్రాంతమే గాజువాక నుంచి విశాఖ వెళ్లే హైవే. ఈ దారిలో హెవీ వెహికిల్స్ ఎక్కువగా తిరుగుతుంటాయి.

1990 నుంచి 95 కాలంలో ఈ హైవే పై విపరీతంగా ప్రమాదాలు జరిగేవి. ఏడాది పొడవును సరా సరి 30 ప్రమాదాలు ఇక్కడ జరిగేవి. మరీ ముఖ్యంగా పెద్ద వాహనాలు యాక్సిడెంట్ లకు గురికావడంతో చిన్న వాహనదారులు చనిపోయేవారు. దీంతో స్థానికులు రోడ్ మీదకు రావాలంటేనే భయపడేవారు. పోలీసులు నెమ్మదిగా వెళ్లాలని బోర్డులు పెట్టారు. యాక్సిడెంట ప్రోన్ ఏరియా అని రహదారి వెంబడి అడుగుకు ఒకటి ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది. హైవే పక్కన నివసించేవారికి రోడ్ మీదకు రావాలంటేనే వణుకు. రోజు రోజుకు ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గడం లేదు. ఆ సమయంలోనే ఒక స్వామిజీ ఒక వేడుకకు వచ్చారు. ఈ ప్రాంతంలో ప్రమాదాల గురించి ఏం చేయమంటారో సలహా ఇవ్వాలని స్థానికులు కోరారు. వారి ఆందోళనను గమనించిన స్వామి ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టండి. అది కూడా భారీగా స్వామి వారి విగ్రహం పెట్టమని ప్రత్యేక విగ్రహ నమూనాను సూచించారు.

స్వామి వారు ప్రత్యేకంగా కనిపిస్తారు

స్వామిజీ సలహా మేరకు భారీగా విరాళాలు వేసుకుని ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నెలకొలిపారు. ఈ దారిలో ప్రయాణించే వారికి స్వామి వారు ప్రత్యేకంగా కనిపిస్తారు. చాలా దూరం నుంచే స్వామి వారే మనకు స్వాగతం పలుకుతున్నట్లుగా కనిపిస్తుంటుంది. నిజంగానే ఈ విగ్రహం పెట్టిన నాటి నుంచి ప్రమాదాలు తగ్గాయి. అది స్వామి వారి మహిమ అని జనం నమ్మడం మొదలు పెట్టారు. కానీ దాని వెనుకున్న పరమార్ధాన్ని మనం అర్ధం చేసుకుంటే దేవుడంటే మనకు ఉన్న నమ్మకమే ఈ ప్రమాదాలు తగ్గడానికి కారణం. తోక ఎత్తి చేతులత నమస్కరిస్తున్న ఆంజనేయ స్వామి కనిపిస్తారు. ఎక్కడి నుంచి చూసినా చల్లని చూపులో మన వైపే చూస్తున్నట్లు అనిపిస్తుంటుంది. వెంటనే వాహనాలను స్లో చేసుకుని, స్వామి కి దండం పెట్టి మెల్లిగా వెళ్తుంటాం. వాహనాల వేగం తగ్గడంతో ప్రమాదాలు పూర్తిగా తగ్గాయి. ఇక వాహనాల పై ప్రయాణించే వారికి మొదట కనిపించే దైవం హనుమాన్. కొత్త వాహనం కొన్నా హనుమాన్ టెంపుల్ లోనే పూజలు చేయిస్తాం.

లోక రక్షకుడు

హనుమంతుడు అంటే ప్రమాదాలు జరగకుండా మనల్ని హాయిగా చూస్తాడని భావించడమే ఈ ప్రమాదాలు తగ్గడానికి కారణం. దేవుడు కనిపించగానే దండం పెట్టకుండా ముందు కెళ్లలేము. కనీసం మనసులోనైనా తలుచుకుంటాం. కొంత మంది వాహనాలను పక్కకు ఆపి మరీ దిగి దండం పెట్టుకుని వెళ్తుంటారు. అందుకే దేవుడే ఇక్కడ రక్షకుడిగా మారాడు. స్థానికులైతే ఏదో ప్రేతాత్మ శక్తి మనుషుల ప్రాణాలు తీసేది. స్వామి వారి విగ్రహం వచ్చినప్పటి నుంచి ఈ ప్రాంతమంతా హాయిగా, భద్రంగా ఉందని చెబుతారు. అలా స్వామి వారు అందరినీ కాపాడుతున్నారు. హైవేల పై కూడా మనకు ఆంజనేయ స్వామి గుడులు కనిపిస్తుంటాయి. ఎంతైనా లోక రక్షకుడు కదా. ఆపదలో ఉన్న తన దేవుడైన రాముడికే సాయం చేశాడు. మనుషులమైన మనకు చేయడా? జై హనుమాన్.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow