సాక్షాత్తు నాగ సర్పమే కాపాలాగా ఉండే శివాలయం ఇది గుప్త నిధుల కోసం అలా చేసేశారు... శివుడి మెడలో ఉండే పాము పేరు తెలుసా?

భారతదేశంలో పాములకు ప్రత్యేక స్థానం ఉంది. చాలా మంది పాములను దేవత స్వరూపాలుగా చూస్తారు.

Jun 2, 2024 - 00:14
Jun 2, 2024 - 21:39
 0  14
సాక్షాత్తు నాగ సర్పమే కాపాలాగా ఉండే శివాలయం ఇది గుప్త నిధుల కోసం అలా చేసేశారు... శివుడి మెడలో ఉండే పాము పేరు తెలుసా?

పాముని పూజించే దేశాల్లో.. భారతదేశం మెుదటి వరుసలో ఉంటుంది.. పాముకి.. శివుడికి విడదీయరాని బంధం ఉంటుంది.. శివయ్యను తలచుకుంటే.. మెడలో ఉండే పామే గుర్తుకు వస్తుంది.. అసలు శివుడు పాముని కంఠాభరణంగా ఎందుకు చేసుకున్నాడో తెలుసా? ఓ శివాలయానికి స్వయంగా నాగ సర్పం కాపలా ఉంటుందని మీకు తెలుసా? ఇంతకీ ఆ గుడి ఎక్కడ ఉంది? ఏ పరిస్థితుల్లో ఉంది తెలుసుకుందాం రండి.

భరత దేశంలో పాములకు ప్రత్యేక స్థానం ఉంది. చాలా మంది పాములను దేవత స్వరూపాలుగా చూస్తారు. పాములు మన నాగరికతలోనే కాదు... ప్రపంచలోని దాదాపు అన్ని దేశాల్లో దైవ శక్తులుగా చూస్తారు.. అయితే కొన్ని దేశాల్లో పాములను దుష్టశక్తులు భావిస్తారు. మన దేశం విషయం వచ్చేసరికి.. పాముని కూడా దైవంగా పూజలు చేస్తారు.. పాము శరీరం, మనిషి తలకాయ, పైన కిరీటంతో ఉన్న నాగదేవతల రూపాలను మన గుడి గోడలపై చెక్కి ఉండటం మీరు చూసే ఉంటారు.. దేవాది దేవుడుగా పిలవబడే మహా విష్ణువు శయనించేది ఆదిశేషుని పైనే. క్షీరసాగర మథనంలో మేరు పర్వతానికి కవ్వపుతాడుగా పనికి వచ్చినది వాసుకి అనే పామే. వాసుకి చెల్లెలు మానసాదేవి నాగదేవతగా అందరి పూజలూ అందుకుంటుంది.

యోగా సాధనలో కుండలినీ శక్తిని సాధించాలంటే వెన్నెముక కింది భాగంలో చుట్టలు చుట్టుకుని ఉన్న పాము మూల ధార చక్రం నుంచి సహస్ర చక్రం వరకు చేరుకుంటేనే శక్తి వస్తుందని చెబుతారు. ధ్యానం ద్వారా కుండాలి శక్తిని మేల్కొలిపినపుడు అది పైపైకి వెన్నెముక ద్వారా పాకుతూ వచ్చి కపాలంలోని సహస్ర చక్ర శక్తిని జాగృతం చేస్తుందంటారు. నాగ దేవతలను శృంగారానికి, సంతానానికి చిహ్నంగా భావిస్తారు. పిల్లలు పుట్టాలంటే పాము పుట్టకు ప్రదక్షిణాలు చేస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మొక్కుకుంటారు.

 శివుడు మెడలో కూడా పాము ఉంటుంది కదా ఆ పామును వాసుకి అంటారు. వాసుకి శివ భక్తుడు. పురాణాల ప్రకారం, సముద్ర మథనం సమయంలో, వాసుకిని సముద్రాన్ని మథనం చేయడానికి ఉపయోగించారు. దీంతో వాసుకికి రక్తస్రావమై  చనిపోతుంది. దీంతో వాసుకి భక్తికి ముగ్ధుడైన శివుడు వాసుకిని నాగలోకానికి రాజుగా చేసి, శివుడు మెడలో ఆభరణంగా ఉండే వరం ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి.

అంతేకాదు... పురాణ ఇతిహాసాలలో నాగ బంధానికి విశిష్ట స్థానం ఉంది. నాగబంధనమ్  తాంత్రికులు మాత్రమే వేస్తారు. మంత్రం తంత్రం యంత్రం క్రియ ముద్ర జ్ఞానం అనే ఈ ఆరింటితో నాగ బంధం వేస్తారు. గోల్కొండ నవాబుల హయాంలో కూడా నిధి నిక్షేపాలు ఉన్న గుళ్లకు నాగ  బంధం వేసే వారట. హైదరాబాద్ శాలి బండ సమీపంలోని గాజి బండాలో వెలిసిన కంచి కామాక్షి దేవాలయానికి నాగ బంధం వేశారని తెగ వార్తలు హల్‌చల్‌ చేశాయి. ఈ క్రమంలోనే గర్భ గుడి గడపలో నాగ బంధం ఉన్నట్లు దేవాలయం వారసులు ఇటీవలి కాలంలో గుర్తించారు. గడపకు పసుపు కుంకుమ రాసే సమయంలో నాగ బంధం ముద్రలు గుర్తించారు. వెంటనే వాటి మీద  రెడ్ పెయింట్ వేసి స్పష్టంగా కనపడేటట్లు చేసారు. 

 ఈ విధంగానే నలగొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాముల గ్రామంలో శివాలయంకు సాక్షాత్తు నాగ సర్పం కాపలా ఉంటుంది. కాకతీయుల కాలం నాటి శివాలయం ఇది. ఎన్నో మహిమలు గల ఆలయంగా ఇక్కడి భక్తులు నమ్ముతారు. ఎందుకంటే ఈ శివాలయానికి నాగ సర్పం కాపలాగా ఉండేదట. అంతే కాదు ఈ ఆలయం చుట్టూ ఆ నాగ సర్పం తిరుగుతున్నప్పుడు చాలమంది చూశారంట కూడా. ఈ ఆలయంపై కాళికామాత శివునిపై కాలు పెట్టినటువంటి విగ్రహాలు, నందీశ్వరుడు విగ్రహం .. ఇలా ఎన్నో విగ్రహాలు ఉన్నాయి. అయితే నైజాం కాలంలో ఇక్కడి నందీశ్వరుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఆలయ అర్చకులు తెలిపారు. అంతేకాదు ఇక్కడ గుప్త నిధుల కోసం దుండగులు గతంలో పలు రాతి శిల్పాలను ధ్వంసం చేశారట. అప్పటి నుండి ఎటువంటి పూజా కార్యక్రమాలకు నోచుకోకుండా .. ఈ ఆలయం ఉంది. ఇంతటి పురాణ చరిత్ర కలిగి ఉన్న ఈ ఆలయాన్ని శిథిలావస్థలో వదిలేయకుండా.. పునర్వైభవం వచ్చేలా అభివృద్ధి చేయాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow