ఆలయంలో అద్భుతం....సుబ్రహ్మణ్య స్వామి లీల...అరుల్మిగు సుబ్రమణ్యుడి మహిమ

నెమలి సందడి చేయడంపై ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ.. ‘నెమళ్లు తరచుగా ఈ ఆలయానికి వస్తుంటాయి. అయితే ఈ సారి నెమలి గర్భగుడిలోకి వెళ్లి సుబ్రమణ్య స్వామిని పూజించడం అందరినీ ఆశ్చర్యపరిచింది, ఈ సుందర దృశ్యాన్ని చూసిన భక్తులకు తమ జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగిల్చింది’ అని అన్నారు.Sri Media News

Jun 3, 2024 - 15:39
 0  11
ఆలయంలో అద్భుతం....సుబ్రహ్మణ్య స్వామి లీల...అరుల్మిగు సుబ్రమణ్యుడి మహిమ

అరుల్మిగు సుబ్రమణ్య స్వామి ఆలయంలో ఓ అద్భుత దృశ్యం

టెంపుల్‌ సిటీగా పిలవబడే తమిళనాడులో ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా సుబ్రమణ్యేశ్వరుడికి సంబంధించిన ఆరు ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు తమిళనాడులోనే ఉన్నాయి. వాటిలో ఓకటైన  అరుల్మిగు సుబ్రమణ్య స్వామి ఆలయంలో ఓ అద్భుత దృశ్యం చూసి భక్తులు ఇది దేవుడి మహత్యమే... ఆ సుబ్రమణ్యేశ్వరుని మహత్యమే అంటున్నారు. అరుల్మిగు సుబ్రమణ్యుడి గుడిలో జరిగిన అద్భుత దృశ్యం గురించి మీకు తెలిసిన ఆశ్చర్యపోవాల్సిందే...

వందలాది మంది భక్తులు చూస్తుండాగా, సుబ్రమణ్య స్వామికి హారతి ఇస్తున్న సమయంలో ఓ నెమలి గర్భగుడి ముందుకు వచ్చింది. వందల మంది భక్తులను చూసి కూడా... భయపడకుండా పూజ జరిగేంత వరకు అక్కడే ఉంది ఆ నేమలి... భక్తులంతా ఆ నేమలికి దండాలు పెడుతూ... ఇది సుబ్రమణ్యుని మహీమ అంటూ వింతగా చూశారు... పూజారులు... సుబ్రమణ్య స్వామి విగ్రహానికి హారతి ఇచ్చిన తర్వాత నెమలికి సైతం హారతి ఇచ్చారు.  తమిళనాడు తిరుప్పూర్‌ జిల్లాలోని అరుల్మిగు సుబ్రమణ్య స్వామి ఆలయంలో జరిగిన ఓ అద్భుత సంఘటన చూసినవారు. ఓ వీడియో తీసి వైరల్ చేయ్యడంతో... ఆ అద్భుత దృశ్యాన్ని చూసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇది అంతా ఆ దేవుడి లీల అంటు భక్తులు అంటున్నారు.

నెమలి గర్భగుడిలోకి వెళ్లి

నెమలి సందడి చేయడంపై ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ.. ‘నెమళ్లు తరచుగా ఈ ఆలయానికి వస్తుంటాయి. అయితే ఈ సారి నెమలి గర్భగుడిలోకి వెళ్లి సుబ్రమణ్య స్వామిని పూజించడం అందరినీ ఆశ్చర్యపరిచింది, ఈ సుందర దృశ్యాన్ని చూసిన భక్తులకు తమ జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగిల్చింది’ అని అన్నారు.

ఇదిలా ఉంటే హిందూ మత విశ్వాసాల ప్రకారం నెమలిని కుమార స్వామి వాహనంగా చెబుతుంటారు. అంతేకాకుండా నెమలి కన్నులు జ్ఞానానికి, అవగాహనకు, వివేకానికి ప్రతీకగా చెబుతుంటారు. ఈ అద్భుత దృశ్యాన్ని ఆలయానికి వచ్చిన భక్తులంతా సెల్‌ ఫోన్‌లో రికార్డ్‌ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow