బ్రహ్మంగారు చెప్పినట్టే జరిగింది..... వేపచెట్టుకు మామిడికాయలు....శాస్త్రవేత్తలు ఏం అంటున్నారు.?
మనుషులు చేసే పాపాల ఫలితంగా ప్రకృతి వైపరీత్యాలు ప్రజలు చూస్తారని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు. ఆయన రాసినట్టే... ప్రకృతి మనిషి మీద పగబట్టినట్టుగా ప్రవర్తిస్తోంది.2024 లో కూడా బ్రహ్మంగారు చెప్పినట్టే.. వేపచెట్టుకు మామిడికాయలు కాసాయి.Sri Media News
ఇది ఎప్పుడో బ్రహ్మం గారు చెప్పారు
ప్రపంచంలో ఏ వింత జరిగినా.. ఇది ఎప్పుడో బ్రహ్మం గారు చెప్పారు.. ఇదిగో ఇది తాళపత్రాలలో రాసి పెట్టారు అని అంటారు.. ఏ ఉపద్రవం ముంచుకు వచ్చినా.. దాని గురించి కూడా కాలజ్ఞానంలో రాసి ఉంది వార్తలు వస్తూనే ఉంటాయి.. ప్రపంచాన్ని వణికించిన కరోనా గురించి కూడా ఇయన ముందుగానే చెప్పారు.. మనుషులు చేసే పాపాల ఫలితంగా ప్రకృతి వైపరీత్యాలు ప్రజలు చూస్తారని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు. ఆయన రాసినట్టే... ప్రకృతి మనిషి మీద పగబట్టినట్టుగా ప్రవర్తిస్తోంది.2024 లో కూడా బ్రహ్మంగారు చెప్పినట్టే.. వేపచెట్టుకు మామిడికాయలు కాసాయి. దీంతో మరోసారి బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి వైరల్ అవుతుంది.
వేపచెట్టుకు గుత్తులు గుత్తులుగా వేలాడుతున్న మామిడి కాయలు
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో వేప చెట్టుకు మామిడికాయలు కాసాయి. వేపచెట్టుకు గుత్తులు గుత్తులుగా వేలాడుతున్న మామిడి కాయలను చూడడానికి ప్రజలు ఎగబడ్డారు. ఈ వింత ఘటనతో ప్రజలు ఇదంతా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ముందే చెప్పారు అని కొందరు వాదిస్తుంటే కొందరు సైన్స్‌తో మూడి పెట్టి చూపిస్తున్నారు.
అయితే ఈ వింత ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ నివాసంలో జరిగింది. ఆయన ఇంటి వద్ద ఉన్న వేపచెట్టుకు మామిడి కాయలు కాసిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయ్యడంతో... వైరల్‌గా మారింది... ఈ వింతను చూసి తాను ఆశ్చర్యపోయినట్లు మంత్రి ప్రహ్లాద్ సింగ్ ఎక్స్ ఖాతాలో తెలిపారు. వేపచెట్టుకు మామిడికాయలు చూసి తన మనసు పులకరించిపోయింది అని రాసుకొచ్చారు. అంతే కాకుండా ఎంతో ప్రతిభ గల తోటమాలి ఈ ప్రయోగం చేసి ఉంటాడని, నిజంగా ఇది గొప్ప అద్భుతం అని పోస్టు చేశారు. అంతే కాదు... మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఈ సమాచారాన్ని వ్యవసాయ శాస్త్రవేత్తలకు తెలియజేశారు.
వేపకొమ్మపై మామిడి పూత పడడం
అధికారులు ఆ చెట్టును పరిశీలించారు. వేపచెట్టుకు సుమారు 20 నుంచి 25 ఏళ్లు ఉంటాయని, వేప కొమ్మలో మామిడి కొమ్మ కూడా ఉందని చెప్పారు. అయితే వేపకొమ్మపై మామిడి పూత పడడం వలన ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని వృక్షశాస్త్రవేత్తలు తెలిపారు. అంతేకాదు... చాలా సంవత్సరాల క్రితం వేప చెట్టుకు మామిడి కొమ్మను అంటు వేసి ఉంటారని, అందుకే వేప చెట్టుపై మామిడి కొమ్మ పెరిగి ఇప్పుడు అది ఫలాలను ఇస్తోందని చెప్పారు. చెట్లకు జన్యుపరమైన సమస్యలు ఉండవని.. అందుకే మామిడి కొమ్మ తప్పనిసరిగా వేప చెట్టుకు సరిపోతుందని చెప్పారు. చెట్లు, మొక్కలలో ఇది సాధ్యమేనని అన్నారు.
కొందరు మాత్రం ఇది కలియుగ వైపరిత్యమే అని అంటున్నారు. ఇది ఎప్పుడో బ్రహ్మం గారు చెప్పారు.. ఇప్పుడు జరిగిందని అంటున్నారు.
What's Your Reaction?