ఏడువారాలు స్వామి ఆదాయం అదుర్స్‌.....శనివారం స్వామిని దర్శించాలంటే పెట్టిపుట్టాలి

నాసిక్ నుంచి కోనసీమకు వచ్చిన వెంకన్న..దిన దిన అభివృద్ధి చెందుతున్న ఆలయం.Sri Media News

Jun 2, 2024 - 21:29
 0  17
ఏడువారాలు స్వామి ఆదాయం అదుర్స్‌.....శనివారం స్వామిని దర్శించాలంటే పెట్టిపుట్టాలి

తిరుపతి క్షేత్రం తర్వాత అంతటి వైభవం వాడపల్లి వెంకటేశ్వర స్వామికే చెల్లిందనడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పుకోవచ్చు. నిత్యం వేలాదిగా భక్తులు ముఖ్యంగా శనివారం ఈ స్వామిని దర్శించాలంటే పెట్టిపుట్టాలి అనే విధంగా అత్యధిక భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చి మాడవీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేసి ఏడువారాలు స్వామిని దర్శించి స్వామివారి సేవలో కొనియాడుతూ ఉంటారు.

ఒక అగ్నికులక్షత్రియుడు స్వామివారిని ఒక కోరిక కోరగా స్వామి ఆ కోరిక తీర్చడంతో ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారట. నాటి నుంచి ఏడు వారాల వెంకటేశ్వర స్వామిగా వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి కొలువు తీరారని కోరిన కోరికలు తీరుస్తూ కొంగుబంగారంగా దిన దిన అభివృద్ధి స్వామివారి ఆలయం చెందుతుంది. నిత్యం వేలాదిగా భక్తులతో ఈ దేవాలయం నిండిపోతుంది. ముఖ్యంగా శనివారం రోజున ఈ స్వామిని దర్శించాలంటే పెట్టిపుట్టాలి అని అంటారు. స్వామివారి దర్శనానికి వచ్చి భక్తులు మాడవీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేసి ఏడువారాలు స్వామిని దర్శించి స్వామివారి సేవలో కొనియాడుతూ ఉంటారు. నిత్యం భక్తులతో నిండిపోయో ఈ వెంకన్న హూండి ఆదాయం కూడా అదే స్థాయిలో ఉంటుంది.

శుక్రవారం స్వామి వారి హుండీ లెక్కింపులు జరగ్గా...31 రోజులకు గాను ఆలయ ప్రధాన హుండీల నుండి నగదు రూ.67.40 లక్షలు, అన్నప్రసాదం హుండీల నుండి రూ.23.04 లక్షల రాగ మొత్తం వెరసి రూ.90.45 లక్షలు ఆదాయం వచ్చింది. అలాగే బంగారం 14 గ్రాములు వెండి 710 గ్రాములు వచ్చింది. కోనసీమ జిల్లాకు ఇంతటి అదాయన్ని తీసుకువస్తున్న వేంకటేశ్వరుడు ఇక్కడ కొలువై ఉండటం  వెనుక ఓ పెద్ద చరిత్రే ఉంది.

కలియుగంలో దాదాపు కొన్నివందల సంవత్సరాల కిందట నాసిక్ ప్రాంతంలో ఋషులు నారద మహర్షి వంటి ఎర్రచందన రూపుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కొలిచి అనంతరం స్వామివారిని ప్రత్యేక పెట్టిలో పెట్టి ఆగోదావరిలో నిమజ్జనం చేశారట. దాదాపు 1300 కిలోమీటర్లు నీటిలో కొట్టుకుని వచ్చిన స్వామి కోనసీమ జిల్లా వాడపల్లి ప్రాంతంలో ఉందని ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడికి కలలో కనిపించి స్వామి చెప్పారట. దీంతో మేలతాళాలతో స్వామివారి ఉన్న ప్రాంతానికి వెళ్లినప్పటికీ తొలిరోజు స్వామివారి విగ్రహం దొరకలేదని రెండవరోజు స్వామివారి విగ్రహం దొరకడంతో దాదాపు 500 సంవత్సరాల కిందట ఈ స్వామివారికి పూజల ప్రారంభించారంట.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow