జోరు మీద ఉన్న రేవంత్‌ సర్కార్‌ !ఆ పనితో రైతులు ఖుష్‌...

తెలంగాణాలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్‌.. అధికారం చేపట్టినప్పటి నుంచి మంచి జోరు మీద ఉంది. తాజాగా జరిగిన ఎంపీ ఎలక్షన్స్‌లో సైతం మంచి మెజార్టీతో గెలవటంతో.. ఇచ్చిన హామీలపై దృష్టి సారించింది. ముఖ్యంగా సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక… ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు.Sri Media News

Jul 5, 2024 - 15:41
 0  6
జోరు మీద ఉన్న రేవంత్‌ సర్కార్‌ !ఆ పనితో రైతులు ఖుష్‌...
 ఇచ్చిన మాట ప్రకారం మెుదటిగా మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి.. తెలంగాణాలోని ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించారు. 
తాజాగా రైతులకు మరో శుభవార్త చెప్పింది రేవంత్‌ సర్కారు. ఆగస్టు 15 నాటి 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ అమలు పూర్తి చేస్తామని ప్రకటించింది. సామాన్యులతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కూడా రేవంత్‌ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం సర్కార్‌ కొలువు చేస్తున్న వారికి శుభవార్త చెప్పింది. వారు ఏళ్లుగా ఎదురు చూస్తోన్న సమస్య పరిష్కారానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 
ఐదేళ్ల తర్వాత బదిలీలపై నిషేదాన్ని ఎత్తివేస్తూ.. ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకే చోట నాలుగేళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని ఈ ఉత్తర్వుల్లో వెల్లడించారు. ఈ మేరకు ఈ నెల 5 నుంచి జులై 20 వరకు బదిలీలకు షెడ్యూల్ ప్రకటించారు. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా.. ఎంతో పారదర్శకంగా ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ద్వారా ఉద్యోగులను బదిలీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మెుత్తం ఏడు అంశాల ఆధారంగా ఉద్యోగుల బదిలీ ప్రక్రియ చేపట్టనున్నారు.
ఈ ట్రాన్సఫర్లలలో స్పౌజ్, 2025 జూన్ 30 లోగా రిటైర్డ్ అయ్యేవారు, వితంతువులు, కొన్ని కేటగిరీల అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి.. సీఎం ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ జీవో 80 విడుదల చేసింది. ఈ ఏడాది జూన్ 30 నాటికి ఒకే చోట నాలుగేళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని నిర్ణయింయించడమే కాక అందుకు సంబంధించిన గైడ్‌లైన్స్‌ కూడా ప్రకటించింది.
ఈ గైడ్‌లైన్స్‌ ప్రకారం వచ్చే ఏడాది అంటే 2025, జూన్ 30లోగా ఉద్యోగ విరమణ చేసే వారు స్వచ్ఛందంగా కోరుకుంటే తప్ప బదిలీలు ఉండవు.అలానే 2025 జూన్‌ 30లోగా రిటైరయ్యే ఉద్యోగులు.. ఒకేచోట నాలుగేళ్ల సర్వీసు పూర్తిచేసినా బదిలీ చేయకూడదు. సర్వీసులో చేరి రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాని ఉద్యోగులను బదిలీ చేయరాదు. ఒకే కేడర్లో 40 శాతానికి మించి ఉద్యోగులను బదిలీ చేయరాదు. ప్రతి ఉద్యోగి ఎక్కడికి బదిలీ కోరుకుంటున్నారో తెలుపుతూ ఐదు ప్రాంతాల పేర్లను వరస క్రమంలో డిపార్ట్‌మెంట్ హెడ్‌కు పంపాలి. ప్రస్తుతం అప్రాధాన్య పోస్టుల్లో ఉన్న ఉద్యోగులను ప్రాధాన్యత స్థానాల్లోకి బదిలీ చేయాలి. స్పౌజ్, వితంతువు, ఏడాది లోపు రిటైర్ అయ్యే వారు, 70 శాతానికి మించి దివ్యాంగులు, మానసిక వ్యాధులతో బాధపడుతున్న పిల్లలు ఉన్న వారు, క్యాన్సర్, లివర్ ట్రాన్స్ ప్లాంట్, ఓపెన్ హార్ట్ సర్జరీ, న్యూరో సర్జరీ, కిడ్నీ, ఎముకల టీబీ ఉన్న ఉద్యోగులకు బదిలీల్లో మినాహాయింపు లేదంటే వారు కోరుకున్న ప్రాంతాలకు బదిలీ చేసే అశంలో అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఉద్యోగుల వద్ద నుంచి ఆప్షన్లను స్వీకరించి, బదిలీ ప్రక్రియ చేపట్టనున్నట్లు ప్రభుత్వం వివరించింది. ఈక్రమంలో అధికారులు.. జులై 5-8 వరకు ఉద్యోగ సంఘాలతో చర్చించి ఖాళీలు, కచ్చితంగా బదిలీ చేయాల్సిన ఉద్యోగుల వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. జులై 9-12 వరకు ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకుని.. జులై 13-18 వరకు ట్రాన్స్‌ఫర్ అఫ్లికేషన్లు పరిశీలించనున్నారు. జులై 19, 20వ తేదీల్లో బదిలీల ఉత్తర్వులను జారీ చేస్తారు. అనంతరం జులై 21 నుంచి ఉద్యోగుల సాధారణ బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుంది.
తాజాగా తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయంతో.. తెలంగాణలోని సర్కారీ కొలువు ఉద్యోగులు ఎగిరి గంతేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ట్రాన్సఫర్ల కోసం ఎదురు చూస్తున్న వారి ఆనందాలకు అవధుల్లేకుండా పోయింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుండటంతో.. రేవంత్ రెడ్డిపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపిన రేవంత్.. ఇకపై రాష్ట్రంలో ఇంకెన్ని సంక్షేమాలను తీసుకు వస్తారో అని ఎదురు చూస్తున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow