డబ్బులు పడ్డాయోచ్‌.....రేవంత్‌ సర్కార్‌ నిర్ణయంతో రైతుల పండుగ!

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఛార్జ్‌ తీసుకున్నప్పటి నుంచి.. ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలపై ఫోకస్‌ పెట్టారు. ఇప్పటికే పలు పథకాలను సక్సెస్‌ఫుల్‌గా ప్రారంభించి, అమలు చేస్తున్నారు. అయితే కొందరు సంక్షేమ పథకాలకు అర్హులైనా.. వివిధ కారణాలతో వాటిని అందుకోలేకపోతున్నారు. Sri Media News

Jul 5, 2024 - 15:11
 0  3
డబ్బులు  పడ్డాయోచ్‌.....రేవంత్‌ సర్కార్‌ నిర్ణయంతో రైతుల పండుగ!
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఛార్జ్‌ తీసుకున్నప్పటి నుంచి.. ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలపై ఫోకస్‌ పెట్టారు. ఇప్పటికే పలు పథకాలను సక్సెస్‌ఫుల్‌గా ప్రారంభించి, అమలు చేస్తున్నారు. అయితే కొందరు సంక్షేమ పథకాలకు అర్హులైనా.. వివిధ కారణాలతో వాటిని అందుకోలేకపోతున్నారు. అటుువంటి వారి కోసమే.. ‘ప్రజా పాలన’ దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమాన్ని స్టార్ట్‌ చేసి.. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. ఇప్పుడు తాజాగా అన్నదాతలకు శుభవార్త చెప్పింది రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం.
రైతుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేసినట్లు కీలక ప్రకటన చేసింది సర్కార్.ఈ నిర్ణయంతో ఎంతోమంది అన్నదాతలకు ప్రయోజనం చేకూరనుంది. రాష్ట్రంలో రబీ సీజన్ ధాన్యం సేకరణ ప్రక్రియ జూన్ 30 తో ముగిసింది. ఈ విషయాన్ని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకు 8.99 లక్షల మంది రైతుల నుంచి 48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ధాన్యం కొనుగోలు చేసిన మూడు రోజుల్లోనే రైతుల బ్యాంక్ ఖాతాలకు డబ్బులు జమ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
మోదీ ప్రభుత్వం ఇప్పటికే 17 వాయిదాలకు రైతుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ చేయగా, 18వ విడత డబ్బులు జమచేయాల్సి ఉంది. కాగా, ప్రభుత్వం నుంచి రైతులు డబ్బులు పొందాలంటే కచ్చితంగా ఈకేవైసీ తప్పని సరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉందని అంటున్నారు అధికారులు. అందుకే పీఎం కిసాన్ రైతులు తప్పని సరిగా కేవైసీ పూర్తి చేసుకోవాలని చెబుతున్నారు. మీకు తెలిసిన వారు ఎవరైనా ఇంకా కేవైసీ చేయకపోతే.. ఈ విషయం చెప్పండి. కేవైసీ కోసం పెద్దగా కష్టపడనవసరం లేదు. మీ సమీపంలోని ఈ సేవా కేంద్రాల్లో ఈ పని పూర్తి చేస్తారు. మీకు కావాలసిందల్లా ఆధార్ తో లింక్ చేయబడిన ఫోన్ నెంబర్ ఉంటే చాలు.. ప్రాసెస్‌ వారే చేసి పెడతారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow