జూన్ నాలుగు వరకు గందరగోళమేనా ?

ఏపీ ఎన్నికల ఫలితాలపై జూన్ నాలుగు వరకు గందరగోళమే అని తేలిపోయింది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ కూడా వేర్వేరు ఫలితాలను ప్రకటించాయి. Sri Media News

Jun 1, 2024 - 21:47
Jun 3, 2024 - 13:51
 0  43
జూన్ నాలుగు వరకు గందరగోళమేనా ?

ఏపీ ఎన్నికల ఫలితాలపై జూన్ నాలుగు వరకు గందరగోళమే అని తేలిపోయింది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ కూడా వేర్వేరు ఫలితాలను ప్రకటించాయి. ఎంతలా అంటే పోలికే లేదు. వాస్తవానికి చాలా సర్వే సంస్థలు సరిగ్గా పోలింగ్ శాతాన్ని చెప్పడం లేదు. చెప్పనా పోలింగ్ పర్సెంటేజ్ ఎన్ని సీట్లకు కన్వర్ట్ అవుతుందనే దానిపై కూడా కన్ఫ్యూజన్ క్రీయేట్ చేసాయి. ఒక సారి ఏ సంస్థ ఏ ఫలితాలను ఇచ్చిందో ఒక సారి చూద్దాం. వీటిని బట్టి ఓటర్లుగా మీరే అంచనా వేసుకోండి.

ఇక ఆత్మసాక్షి సర్వేను తీసుకుందాం. ఈ సంస్థ వైసీపీకి 98 స్థానాల నుంచి 116 ఎమ్ ఎల్ ఏ సీట్లను గెలుచుకుంటుంది. అదే ఎన్డీయే కూటమికి 59 నుంచి 77 సీట్లు వస్తాయి. అంటే రెండవ సారి వైఎస్ జగన్ సీఎం అవుతారంటోంది. కానీ పయనీర్ పోల్ స్ట్రాటజీస్ అనే సంస్థ ఇదే వైసీపీకి కేవలం 31 స్థానాలు గెలుచుకుంటుందని చెబితే ఎన్డీఏ కూటమి 144 స్థానాలు గెలిచి చంద్రబాబు నాయుడు సీఎం అవుతారంటోంది. ఇక ఏపీలో చాలా మంది ఎదురుచూసిన ఆరా మస్తాన్ ఫలితాలు కూడా భిన్నంగానే ఉన్నాయి. తక్కువ సీట్లు వచ్చినా వైఎస్ జగన్ మరోసారి సీఎం అవుతారని ఆరా మస్తాన్ అంటున్నారు. వైసీపీకి ఈ సారి 94 నుంచి 104 సీట్లు వస్తాయి. ఎన్డీయే కూటమి 71 నుంచి 81 స్థానాలు వస్తాయని అంచనా వేశారాయన. అంటే వైసీకి కూడా మెజారిటీకి కొన్ని సీట్లు మాత్రమే గెలుచుకుని అధికారం చేపడుతుందని చెప్పారు. ఈలెక్కన వైసీపీ కి ఎన్డీయేకి మధ్య హోరాహోరి సాగింది. ఇక కేకే సర్వే మాత్రం ఏకపక్షంగా టీడీపీ ప్లస్ కూటమి బంపర్ మెజారిటీతో విజయం సాధిస్తుంది. 113 అసెంబ్లీ స్థానాల నుంచి 144 స్థానాలు గెలుచుకుని ఏకపక్షంగా విజయం సాధిస్తుందని ప్రకటించి కేకే సర్వేస్. వైసీపీకి కేవలం 14 నుంచి 24 స్థానాలు వస్తాయని ప్రకటించింది. ఈ నెంబర్స్ ని టీడీపీ కూటమి మాత్రమే కాదు వారి అభిమానులు కూడా బలంగా నమ్ముతున్నారు. ఇవే ఫలితాలు వస్తాయనే అంచనాతో ఉన్నారు.

పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం టీడీపీ అధికారంలోకి వస్తుంది. 111 నుంచి 135 స్థానాలు గెలుస్తాయనేది  ఆ సంస్థ వెల్లడించిన రిజల్ట్స్. కూటమికి ఏపీలో అధికారం ఖాయమనేది వారి మాట. ఇక అధికార వైసీపీ 45 నుంచి 60 సీట్లు మాత్రమే గెలుచుకుని అధికారానికి దూరమవుతుందని చెబుతోంది. ఇక చాణక్య డాట్ కామ్ ఫలితాలు వైసీపీ గెలుస్తుందని తేల్చింది. 110 నుంచి 120 సీట్లు గెలుచుకుని వైఎస్ జగన్ సీఎం అవుతారు. ఇక టీడీపీ ప్లస్ కూటమికి 55 నుంచి 65 స్థానాలు వస్తాయి. అంటే వైఎస్ జగన్ రెండవ సారి కూడా విజయం సాధిస్తారనేది చాణక్య సర్వే ఫలితం.

ఇక సీపీఎస్ అంచనాల ప్రకారం కూడా వైసీపీ గెలుస్తుంది. 97 సీట్ల నుంచి 108 స్థానాలు వైఎస్ జగన్ గెలుచుకుని ముఖ్యమంత్రి అవుతారు. బాబు ఆద్వర్యంలోని ఎన్డీఏ కూటమికి 66 నుంచి 78 స్తానాలు మాత్రమే వస్తాయి. అదే ప్రముఖ సర్వే సంస్థ అయిన ఛాణక్య స్ట్రాటజీస్ మాత్రం చంద్రబాబే సీఎం అవుతారంటోంది. 114 నుంచి 125 స్థానాలు వస్తాయి. కూటమిదే గెలుపు. అదే అధికారంలో ఉన్న వైసీపీకి కేవలం 39 నుంచి 49 స్థానాలు మాత్రమే వస్తాయని చెబుతున్నమాట.

పార్ధదాస్ సర్వే ప్రకారం కూడా వైసీపీనే అధికారంలోకి వస్తుంది. 50 శాతం ఓట్లు వైఎస్ జగన్ కు వస్తాయని చెబుతోంది ఈ సంస్థ. 110 నుంచి 120 సీట్లు వస్తాయని తేల్చింది. సీట్లు తగ్గినా చాలా సింపుల్ గా మేజిక్ ఫిగర్ ను చేరుకుని జగన్ మళ్లీ సీఎం అవుతారనేది వారి మాట. ఇక టీడీపీకి పార్ధదాస్ సర్వే 55 నుంచి 65 సీట్లు వస్తాయి. కేవలం 46 శాతం ఓట్లు మాత్రమే వస్తాయి. అంటే రెండు పార్టీల మధ్య దాదాపుగా 4 శాతం తేడా ఉంటుందనేది వారి మాట. అంటే చాలా గ్యాప్ ఉందని అర్ధం.

స్మార్ట్ పోల్స్ సర్వేను చూసుకుంటే మాత్రం వైసీపీ టీడీపీ మధ్య నెక్ టూ నెక్ ఉంది. అయినా కూడా ఓట్ల శాతంలో తేడా వల్ల ఖచ్చితంగా ఎనిమిది సీట్లు అటు ఇటుగా 93 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి రావచ్చు. అదే వైసీపీ 48.1 శాతం ఓట్లతో 82 సీట్లు గెలుచుకుంటుంది. మార్జిన్ 8 సీట్లు అటు ఇటు గా ఉంటాయి. అంటే టైట్ గా ఉన్నా కూడా ఏపీలో కూటమిదే గెలుపని చెబుతోంది స్మార్ట్ పోల్ సర్వే.

జన్ మత్ సర్వే చూద్దాం. దీని ప్రకారం వైసీపీ గెలుస్తుంది. అంటే 95 నుంచి 103 స్థానాలు వైసీపీకి వస్తే 67 నుంచి 75 ఎమ్మెల్యే సీట్లు టీడీపీ కూటమికి వస్తాయి. కాకపోతే ఓట్ల శాతంలో మాత్రం చాలా వ్యత్యాసం చూపించింది జన్ మత్. వైసీపీకి 51 శాతం ఓట్లు వచ్చినా సీట్లు భారీగా తగ్గుతాయి. అదే 45 శాతం ఓట్లు మాత్రమే వచ్చినా సీట్లు పెరుగుతాయని చెబుతోంది. ఇలా దేశంలోని ప్రముఖ సంస్థలన్నీ చెప్పిన సర్వేల వివరాలు. మొత్తంగా చెప్పేదేంటంటే ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు ఏక పక్షంగా లేవు. సగం సంస్థలు వైసీపీ గెలుస్తుందంటే మిగతావి టీడీపీ గెలుస్తాయని చెప్పాయి. అంటే నమ్మడానికి లేదు. మీకు ఎడ్జ్ కావాలంటే మాత్రం ఓట్ల శాతం అంచనాలు చూసుకుంటే మాత్రం కాస్త వైసీపీకి ఎగ్జిట్ పోల్స్ లో ఎడ్జ్ కనిపిస్తోంది. మరి రియల్ రిజల్ట్స్ కావాలంటే మాత్రం మరో రెండు రోజులు ఈ టెన్షన్ తప్పదు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow