రోజా అరెస్ట్ తప్పదా?

దాదాపు రూ.100 కోట్లు స్కాం జరిగిందని.. రోజా, శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డిలు అక్రమాలకు పాల్పడ్డారని విమర్శిస్తున్నారు. ఈ మేరకు సీఐడీకి ఆత్యా - పాత్యా సంఘం, కబడ్డీ అసోసియేషన్, ఇతర క్రీడా సంఘాల నేతలు ప్రెస్ మీట్ పెట్టి మరి సంచలన ఆరోపణలు చేశారు.Sri Media News

Jun 22, 2024 - 09:55
 0  4
రోజా అరెస్ట్ తప్పదా?

మాజీ మంత్రి ఆర్కే రోజా చిక్కుల్లో పడ్డారు. జగన్ కేబినెట్‌లో ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఆడుదాం - ఆంధ్ర, సీఎం కప్‌ల పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దాదాపు రూ.100 కోట్లు స్కాం జరిగిందని.. రోజా, శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డిలు అక్రమాలకు పాల్పడ్డారని విమర్శిస్తున్నారు. ఈ మేరకు సీఐడీకి ఆత్యా - పాత్యా సంఘం, కబడ్డీ అసోసియేషన్, ఇతర క్రీడా సంఘాల నేతలు ప్రెస్ మీట్ పెట్టి మరి సంచలన ఆరోపణలు చేశారు. ఈ స్కాంపై సీఐడీకి సైతం ఫిర్యాదు చేసింది టీడీపీ ప్రభుత్వం

'ఆడుదాం ఆంధ్రా' పేరుతో రూ.100 కోట్ల అవినీతి జరిగిందంటూ వార్తలపై ప్రస్తుత స్పోర్ట్స్ మినిష్టర్ రాంప్రసాద్ రెడ్డి అంటున్నారు.  అంతేకాదు... ఈ ఘటన పై ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం దోషులను గుర్తించి వాటిని రికవరీ చేయడంతోపాటు అక్రమాలకు పాల్పడినవారిని అరెస్ట్ చేస్తామని ఆయన ప్రకటించారు. అయితే రాంప్రసాద్ రెడ్డి ఇంకా భాధ్యతలు చెపట్టాలేదు... ఆయన ఈ నెల 23న బాధ్యతలు చెపట్టిన వెంటనే చర్యలు తీసుకుంటాను అని... కమిటీని వేస్తామని ప్రకటించారు.
 రోజా మా ప్రభుత్వం 2014-19 కాలంలో రాజధాని అమరావతిలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ రోజా ఆరోపణలు చేసింది... వాటిని వాటిని నిరూపించాలంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. రోజా చేసిన వంద కోట్ల రూపాయల అవినీతిని తాను నిరూపిస్తామన్నారు.

అయితే తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడిన రోజా తనపై వస్తున్న విమర్శలను ఖండించారు. 'ఆడుదాం ఆంధ్ర'కు అయిన ఖర్చు రూ.100 కోట్లు అయితే స్కామ్ కూడా రూ.100 కోట్లు జరుగుతుందా? అంటూ ఎద్దేవా చేశారు. స్కామ్ అంటే ఇలా కూడా చేస్తారా? అని ప్రశ్నించారు. టెండర్లు కూడా తమ క్రీడా శాఖ నిర్వహించలేదని, అలాంటిది తాను, బైరెడ్డి సిద్దార్థరెడ్డి అవినీతికి పాల్పడ్డామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత వైసీపీ శ్రేణులపై దాడులు చేస్తున్నారని, ఇది సరికాదని, దాడులు ఆపి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని కౌంటర్ ఇచ్చింది రోజా

అయితే 2019- 2024లో వైసీపీ ప్రభుత్వంలో కీలక నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడ్డారని టీడీపీ భూ కబ్జాలు, ఇసుక అక్రమ తవ్వకాలు, మైనింగ్, మద్యం, రేషన్ బియ్యం, డ్రగ్స్ రవాణా ఇలా అన్ని రంగాల్లో వైసీపీ నేతలు కోట్లాది రూపాయలు సంపాదించారని వారు విమర్శించారు. దీంతో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటుంది, దీంతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ లిస్ట్‌లో ఫస్ట్ పేరు రోజాదేననే టాక్ వినిపిస్తోంది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow