ఈరోజుల్లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ మోజులో పడి కొందరు చిత్ర విచిత్రమైన పనులకు పాల్పడుతున్నారు. తమ రీల్స్ వైరల్ అవ్వాలని.. లక్షల్లో వ్యూస్, లైక్స్ రావాలన్న ఉద్దేశంతో హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. వింత వింతగా వీడియోలు చేస్తున్నారు. తాజాగా యువకుడు కూడా అలాంటి తప్పే చేయడంతో, భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో ఫేమ్ కోసం ప్రాణాలను పొగొట్టుకున్నాడు
తనే జీవితంగా బ్రతుకుతున్న తల్లిదండ్రలకు తన రీల్స్ పిచ్చితో గుండెకోత మిగిల్చాడు. ఈ ఘటన రీల్స్ పిచ్చి ఉచ్చితో సాహసం చేసే వారికి ఓ వార్నింగ్.
నర్సంపేటకు చెందిన కందకట్ల అజయ్‌కి 23 సంవత్సరాలు ఓ హోటల్స్‌లో పనిచేస్తూ ఉంటాడు. విపరీతమైన రీల్స్ పిచ్చి ఉండేది. ఇన్‌స్టాగ్రాంలో తరచూ రీల్స్ చేస్తుండేవాడు. సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని అనుకునేవాడు... అందుకు తగ్గట్టుగానే...ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆలోచించి రీల్స్ చేసేవాడు కూడా.. అయితే తనకు వస్తున్న లైక్స్, వ్యూస్ పెంచుకోని ఓవర్ నైట్ స్టార్ అవ్వాలని అనుకున్నాడు.. కానీ... తనకు తెలియాదు... తను ఎంతో ఇష్టంతో తీసున్న రీల్స్ కారణంగా తను చనిపోతాడాని... కానీసం ఉహించి కూడా ఉండాడు.
జూన్ 19 మంగళవారం రాత్రి హోటల్‌లో పని ముగించుకొని, మల్లంపల్లి రోడ్‌లోని తన చిన్న అక్క ఇంటికి ఎప్పుడు వచ్చినట్టే వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో.. బోర్ కొట్టి ఓ రీల్ చెద్దాం అనుకున్నాడు... అర్ధరాత్రి సమయంలో ఇంట్లోని ఫ్రిజ్‌పై సెల్ ఫోన్ పెట్టి ఉరి వేసుకుంటున్నట్లు రీల్ చేయాలనుకున్నాడు. ఆ వీడియో రికార్డ్ అయ్యేలా ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత ఇంట్లో దులానికి చున్నీ కట్టి, గొంతుకు వేసుకున్నాడు.
ప్రమాదవశాత్తు ఆ చున్నీ అజయ్ మెడకు బిగుసుకుపోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత కుమార్తె ఇంటికి వచ్చిన అజయ్ తల్లి దేవమ్మ.. కొడుకు ఉరివేసుకొని ఉండటం చూసి కన్నీరుమున్నీరు అయింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని అజయ్ సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, తన కొడుకు మృతిపై అనుమానం ఉందని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.