హీరో సందీప్ కిషన్ రెస్టారెంట్‌లో రైడ్స్!

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్‌ కిషన్‌ అటు సినిమాలతో ఇటు'వివాహ భోజనంబు' రెస్టారెంట్ బిజినెస్‌లో బిజీగా ఉంటున్నాడు. సందీప్‌ కిషన్‌, స్నేహితుడు రవి కలిసి ఈ రెస్టారెంట్ బిజీనెస్ రన్ చేస్తున్నారు. ఈ రెస్టారెంట్స్ లో ఒకేసారి 240 మంది కూర్చొని భోజనం చేయొచ్చు.Sri Media News

Jul 11, 2024 - 18:45
 0  5
హీరో  సందీప్ కిషన్ రెస్టారెంట్‌లో రైడ్స్!

 సో ఈ రెస్టారెంట్లు తక్కువ కాలంలోనే ప్రజల్లో మంచి సంపాదించాయి. కాగా రిసెంట్ గా... హైదరాబాద్‌లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులపై ఆహార భద్రతా అధికారులు దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో   సికింద్రాబాద్‌లో గల వివాహ భోజనంబు రెస్టారెంట్‌ లో  అధికారులు తనిఖీలు చేపట్టారు.

ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన 25 కేజీల చిట్టిముత్యాల బియ్యం... వండిన ఆహార పదార్థాలు నిల్వ చేసి ఫ్రీజ్‌లో పెట్టడం.. సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపిన కొబ్బరిని గుర్తించారు. దీంతోపాటు ఫుడ్ ప్రిపేర్ చేసే వారి హెల్త్‌కు సంబంధించి మెడికల్ రిపోర్ట్స్ లేవని తెలిపారు. వంట పాత్రలు క్లీన్ చేసిన నీరు అక్కడే నిల్వ ఉండడం చూసి నిర్వాహకులను అడిగారు.  ఆహారం తయారు చేసేందుకు వాడుతున్న నీటిని కూడా చెక్ చేసి...  భారత ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ అధికారులు వివాహ భోజనంబు రెస్టారెంట్‌కు నోటీసులు ఇచ్చారు. వివాహ భోజనంబు రెస్టారెంట్ వివరాలు, అక్కడ ఉపయోగించే ఆహార వివరాలను సోషల్ మీడియా ఎక్స్‌లో జీహెచ్ఎంసీ అధికారులు పోస్ట్ చేశారు.

ఇక్కడి వరకు అంతా బాగుంది... అసలు సమస్య ఎక్కడ వచ్చిందటే... జులై 8న ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా  టాస్క్‌ఫోర్స్ అధికారులు సందీప్ కిషన్ హోటల్‌లో తనిఖీలు చేసిన తరువాత.. ఈ రెస్టారెంట్ ఫోటోలు అంటు కొన్ని ఫేక్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఈ రెస్టారెంట్ ఇమేజ్ పోయే విధంగా ఉన్నాయి.  అయితే అందులో నిజం లేదని, ఆ ఫొటోలు తమ రెస్టారెంట్ కు చెందినవి కావని క్లారిఫికేషన్ ఇచ్చారు  ‘వివాహ భోజనంబు’ టీమ్.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow