ఫేస్‌‌బుక్ పరిచయం.. ప్రేమ పెళ్లి! చివరకు ఏం జరిగిందంటే..?

ప్రేమ అనేది ఎన్నో మధురానుభూతులను ఇస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో ప్రేమ అనేది ప్రాణాలు పోవడానికి తీయడానికి కేరాఫ్ అడ్రస్‌‌గా మారిపోయింది. ఈ మధ్యకాలంలో ప్రేమించుకుంటున్న ఎన్నో జంటలు చిన్నచిన్న కారణాలకే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. Sri Media News

Jul 20, 2024 - 13:56
 0  17
ఫేస్‌‌బుక్ పరిచయం.. ప్రేమ పెళ్లి! చివరకు ఏం జరిగిందంటే..?
ఇప్పుడు మనం చూసే ఈ స్టోరిలో కూడా.. ఇద్దరూ ఇష్టపడ్డారు.  ఫేస్ బుక్ ద్వారా జరిగిన పరిచయం ప్రేమగా మారి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. అంతా హ్యాపీగా సాగిపోతున్న కాపురంలో భర్తకు వరకట్నం పై ఆశ కలిగింది. ఇంట్లో గొడవలు మొదలైయ్యాయి.. చివరకు ముగ్గురు ప్రాణాలు పోయాయి.
కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది.  వరకట్నం పై దూరశతో ఉన్న ఓ భర్త ఉన్మాదిగా మారి భార్య, అత్త, ఓ వ్యక్తిని రాడ్డుతో కొట్టి చంపాడు. యాదగిరిలోని మునగల్ గ్రామానికి చెందిన నవీన్, అన్నపూర్ణలకు ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది.. అలా ప్రేమ ముదరడంతో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఓ బిడ్డ కూడా జన్మించాడు. ఈ క్రమంలో నవీన్ లో వరకట్న దురాశ మొదలైంది. అన్నపూర్ణనను పుట్టింటికి వెళ్లి కట్నం తీసుకురావాలని బలవంతం చేయడం మొదలు పెట్టాడు. తమ తల్లిదండ్రులు ఇప్పటికే ఎంతో సాయం చేశారని.. ఇప్పుడు కట్నం తీసుకురమ్మని అడగలేనని అన్నపూర్ణ చెప్పింది. ఇలా కొద్దిరోజులగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.
ప్రేమించిన ప్రియుడు రక్షసుడిగా మారడం భరించలేదని అన్నపూర్ణ బాబును తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. ఏడాది నుంచి పుట్టింటిలోనే ఉంటుంది. భర్త చాల సార్లు భార్యను కాపురానికి పిలిచిన రాలేదు. దీంతో నవీన్ తన భర్య కుటుంబం వారే తన భార్యను తనకు దూరం చేస్తున్నారని అత్త కుటుంబంపై కక్ష్య పెంచుకున్నాడు. వారిపై పగతో రగిలిపోయాడు. ఓ రోజు అత్తింటికి వెళ్లాడు నవీన్.. సమయం చూసి రాడ్డుతో భార్య అన్నపూర్ణ,ను అత్త కవితను ఇంట్లో ఉన్న బసవరాజప్ప అనే వ్యక్తిని అతి దారుణంగా హ్యతచేసి చంపాడు. ఎవరికి అనుమానం రాకుండా మృతదేహాలను జోలదాగి గ్రామ సమీపంలో పడేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్షణికావేశంలో భర్త చేసిన పనికి తల్లికి దూరమైన చిన్నారిని చూసి గ్రామస్థులు కంటతడి పెట్టుకున్నారు. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow