హాయ్ జగన్.. హాయ్ రఘురామ..అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం!
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రతి రోజు విమర్శలు ప్రతి విమర్శలతో రెచ్చిపోయో... మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్, టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కలిసి నవ్వుతూ మాట్లాడుకోవడమే.. అయితే ఈ ఇద్దరు నేతలు ఏం మాట్లాడుకున్నారన్న అంశంపై ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఉన్నారు.Sri Media News
కాగా.. సభ ప్రారంభానికి ముందు జగన్ తో మాట్లాడేందుకు రఘురాజు ఆయన వద్దకు వెళ్లారు. జగన్, రఘురాజు ఇద్దరూ పక్కపక్క సీట్లలో కూర్చోవడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. జగన్, రఘురాజు మధ్య కొన్ని నిమిషాల పాటు చర్చ కూడా జరిగింది. జగన్ చెవిలో రఘురాజు ఏదో చెప్పగా... ఆ వెంటనే జగన్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. అయితే, జగన్ తో ఆర్ఆర్ఆర్ ఏం మాట్లాడారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే అందిన సమాచారం మేరకు... సమావేశాలు జరిగినన్ని రోజులు సభకు రావాలని వైఎస్ జగన్ జగన్‌ను రఘురామ కోరినట్టు తెలుస్తుంది.. దీనికి సమావేశాలకు హాజరవుతానని జగన్ బదులిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో తనకు జగన్ పక్కనే సీట్ వేయించాలని శాసనసభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌ను రఘురామ కోరాగా.. తప్పని సరిగా అంటూ కేశవ్ నవ్వకుంటూ వెళ్లిపోయారట. అలాగే రఘురామను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలకరించారట.
కాగా గతంలో రఘురామ వైసీపీలో ఉన్నారు.. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున నరసాపురం నుంచి పోటీచేసి ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత కొంతకాలానికి రఘురామ అప్పటి వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అప్పటి ప్రభుత్వం, జగన్ తీరుపై విమర్శలు చేశారు. దీంతో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. కాగా సీఐడీ ఆఫీసుతో తనను కొట్టారంటూ రఘురామ అప్పట్లో కొర్టులో ఆరోపించారు. ఆ పార్టీకి దూరమయ్యాయి. అయితే 2024 ఎన్నికలకు ముందు రఘురామ టీడీపీలో చేరగా.. ఉండి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ఇదిలా ఉంటే కొద్ది రోజుల ముందు 2021 మే 14న తనపై కస్టోడియల్ టార్చర్ జరిగిందని... ఘటనలో జగన్ ఒత్తిడితో తనను అక్రమంగా అరెస్ట్ చేసి కస్టడీలో తనను హింసించారని... ఐదుగురు ఆగంతుకులతో దారుణంగా హింసించి వీడియో తీసి అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డికి చూపించారని.. తప్పుడు రిపోర్టు కోసం డాక్టర్లను కూడా మార్చేశారని... దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు తన వద్ద ఉన్నాయని... తనకు బైపాస్ సర్జరీ జరిగిందని చెప్పినప్పటికీ, ఛాతీపై కూర్చొని చంపడానికి యత్నించారని.. తనను ఫోన్ పాస్ వర్డ్ చెప్పాలని ఇష్టం వచ్చినట్టు కొట్టారని.. జగన్ ను విమర్శిస్తే చంపుతామని సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్ బెదిరించారని... జగన్, సునీల్ ఇద్దరూ కలిసి తనపై కుట్ర పన్నారని రఘురామకృష్ణరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే తనపై జరిగిన దాడి గురించి కూడా రఘురామ కృష్ణరాజును అప్పట్లో కొర్టులో చెప్పుకొచ్చారు అసలు రఘురామ ఏం చెప్పారో ఈ వీడియోలో తెలుసుకుందాం... ‘‘ఆరోజు రాత్రి శుక్రవారం రాత్రి 11 గంటలు దాటిన తరువాత సీఐడీ కార్యాలయంలో నేను నిద్రపోవడానికి సిద్ధమవుతుండగా... హఠాత్తుగా ఐదుగురు వ్యక్తులు నేను ఉన్న గదిలోకి వచ్చారు. వాళ్లంతా ముఖాలకు కర్చీఫలు కట్టుకున్నారు. వచ్చీ రాగానే నా రెండు కాళ్లను తాడుతో కట్టారు. ఒకవ్యక్తి కర్రతో కొడుతుంటే... మరొక వ్యక్తి... ఫైబర్ లాఠీతో నా రెండు అరికాళ్లపై కొట్టాడు. అప్పటికి వారి కసి తీరలేదు.. నన్ను గదిలో అటూ ఇటూ నడవమన్నారు. నేను నడిచాను. ఆ తర్వాత మళ్లీ అరికాళ్లపై నాలుగైదుసార్లు గట్టిగా కొట్టారు. తరువాత మళ్లీ నడవమన్నారు. ఈసారి నడవలేకపోయాను. దీంతో వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంటూ రఘురామ కోర్టుకు తెలిపారు. దీంతో రఘురామ శరీరంపై కనిపిస్తున్న గాయాలపై కోర్టు నివేదిక కోరింది. గుంటూరు జీజీహెచ్, రమేశ్ ఆస్పత్రుల్లో మెడికల్ ఎగ్జామినేషన్‌కు ఆదేశాలు జారీ చేసింది. అప్పట్లో ఈ కేసు రాష్ట్రంలో ఓ హట్ టాపిక్. రాజకీయ సంచలనం కూడా.
What's Your Reaction?