వారసుడుగా ఎన్టీఆర్ సిద్ధమేనా ? రాజకీయాల్లోకి వస్తారా రారా? తండ్రి పెట్టిన పార్టీని పునరుద్దరిస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎప్పుడు వినిపించినా హాట్ టాపిక్‌గా ఉంటుంది. ఆ పేరుకు ఉన్న పవర్ అలాంటిది. ఈ ఎన్నికల్లో ఒక వేళ టీడీపీ ఓడిపోతే ఎన్టీయార్ ఎంట్రీ ఖాయమన్నట్లు ప్రచారం సాగుతోంది.Sri Media News

Jun 3, 2024 - 14:02
 0  8
వారసుడుగా ఎన్టీఆర్ సిద్ధమేనా ? రాజకీయాల్లోకి వస్తారా రారా? తండ్రి పెట్టిన పార్టీని పునరుద్దరిస్తారా?

రాజకీయా వారసుడుగా ఎన్టీఆర్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎప్పుడు వినిపించినా హాట్ టాపిక్‌గా ఉంటుంది. ఆ పేరుకు ఉన్న పవర్ అలాంటిది. ఈ ఎన్నికల్లో ఒక వేళ టీడీపీ ఓడిపోతే ఎన్టీయార్ ఎంట్రీ ఖాయమన్నట్లు ప్రచారం సాగుతోంది. మరి ఇందులో ఎంత నిజముంది..? జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా రారా? రాజకీయల్లో లేకుండా తెరవెనక నుంచే కథ నడిపిస్తారా? అన్నీ కలిసొస్తే పార్టీ పగ్గాలు అందుకునేందుకు తారక్‌ సుముఖమేనా..? ఇలా తెలుగు ప్రజలందరిలో అనేక ప్రశ్నలు ఉన్నాయి...

ఎన్టీ రామారావు మనవడిగా జూనియర్ ఎన్టీఆర్‌


తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు మనవడిగా జూనియర్ ఎన్టీఆర్‌కు గుర్తింపు ఉంది. అంతకుమించి- చలన చిత్ర పరిశ్రమలో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. 2009 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ కోసం ఎన్టీఆర్ ప్రచారం చేశారు. అయితే ఎన్నికలకు మరికొద్ది రోజులు ఉండగా జూనియర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కొద్దిరోజులపాటు ఆస్పత్రిలో బెడ్‌కే ఆయన పరిమితం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు ఎన్టీఆర్. ఆయనను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అభిమానులు అడగ్గా... ఎన్టీఆర్ కూడా పార్టీకి అవసరం ఉన్నప్పుడు మీరు ఒక్క పిలుపు పిలిస్తేచాలు వచ్చేస్తానని అభిమానులకు హామీ ఇచ్చాడు ఎన్టీఆర్.

ఎన్టీఆర్‌ని దూరం,లోకేష్‌ని ముఖ్యమంత్రి


చంద్రబాబుకు మాత్రం ఎన్టీఆర్ రాజకీయల్లోకి రావడం ఇష్టం లేదని.. ఓ పక్క జూనియర్‌ ఎన్టీఆర్‌ని దూరం పెట్టడం, లోకేష్‌ని ముఖ్యమంత్రిని చేయటం కోసమేనని వార్తలు వచ్చాయి. మెున్నటికి మెున్న సీనియర్‌ ఎన్టీఆర్‌ వర్థంతి రోజు జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలను బాలయ్యబాబు తొలగించమని చెప్పటం ఎంత వైరల్‌ అయ్యిందో చెప్పనవసరం లేదు.. దీంతో నందమూరి ఫ్యామిలీలో గొడవలు మెుదలయ్యాయా అని అనుమానాలు మెుదలయ్యాయి.. గతంలో సైతం హరికృష్ణ సైతం చంద్రబాబుకి వ్యతిరేకంగా పార్టీ పెట్టి.. చర్చల అనంతరం మళ్లీ టీడీపీలోకి రావటం అందరికీ తెలిసిందే.. ఇప్పుడు తాజాగా జూనియర్‌ ఎన్టీఆర్‌ని మళ్లీ టీడీపీ దూరం పెట్టడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

అయితే ఏపీలో టీడీపీ నేతల నుంచి ఎన్టీఆర్ అభిమానుల వరకు ఎన్టీఆర్ మాత్రమే... పార్టీకి సరైన నాయకుడని, ఎన్టీఆర్ రాజకీయ వారసుడు కావాలని, పార్టీ పగ్గాలు చేపట్టాలని కొందరు కోరుకున్నారు. టీడీపీ నాయకుల్లో కూడా చాలా మంది జూనియర్‌ని పార్టీలోకి తీసుకోవాలని, ఆయన సేవలను ఉపయోగించుకోవాలని భావించారు. బాహ్యంగా వ్యక్తీకరించడం సాధ్యం కాదు కాబట్టి, ఈ కోరిక అంతర్గతంగా నెరవేరాలని కోరుకుంటారు.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదు?....

జూనియర్ ఎన్టీఆర్ తెగించేసాడాని టీడీపీతో సంబందాలు పెట్టుకోనే ఆలోచన ఎన్టీఆర్ కి లేదు అని కూడా చాల మంది అంటున్నారు. దానికి కారణం లేకపోలేదు.... స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదు?.... దీనిపై అనేక విమర్శలు కూడా ఎదుర్కొన్నారు ఎన్టీఆర్... అయితే ఆ విమర్శలకు ఎన్టీఆర్ అభిమానులు గట్టిగా బదులు ఇచ్చారు... గతంలో ఎన్టీఆర్  తన చివరి రక్తపు బొట్టు వరకు తెలుగు దేశం పార్టీతోనే ఉంటానని ప్రకటించారు. అయితే 2009 ఎన్నికల్లో ఎన్టీఆర్‌ను వాడుకొని.. ఆ తర్వాత తన కుమారుడు లోకేష్‌కు ఎక్కడ అడ్డు వస్తాడనే భయంతో చంద్రబాబు ఎన్టీఆర్‌ను పక్కన పెట్టేసారని దీంతో ఎన్టీఆర్ కూడా మామ చంద్రబాబుని పక్కన పెట్టేశారని... ఎన్టీఆర్‌‌కు సొంత బాబాయి అయిన బాలయ్య కూడా తన సొంత అల్లుడు లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు ఎక్కడ అడ్డు వస్తాడో  అని ఎన్టీఆర్‌‌ను తెలుగు దేశం పార్టీకి దూరం పెట్టారని.... దీంతో ఈ రాజకీయాలు మనకు సరికాదు అనుకున్న ఎన్టీఆర్ తన దృష్టిని పూర్తిగా సినిమాలపైనే కేంద్రీకరించాడని ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు.


రాజకీయల్లోకి ఎప్పుడు వస్తారు అని జూనియర్ ఎన్టీఆర్‌‌ని ఎవరు అడిగినా చాల హుందాగా సమధానం ఇస్తున్నారు. ఇప్పుడప్పుడే రాజకీయల్లోకి వచ్చే ఆలోచన లేదు అని ఓ సారి చెప్పారు కూడా...రావాల్సి వస్తే తప్పకా వస్తాను అని కూడా ప్రకటించారు. అయితే టీడీపీ నేతలు, అభిమానులు మాత్రం....చంద్ర బాబుకు ప్రస్తుతం వయసు అయిపోతోందని, ఈ సారి ఎన్నికల్లో గెలిస్తేనే వచ్చే ఐదేళ్లు ఆయన టీడీపీ అధినేతగా ఉంటారని, లేని పక్షంలో టీడీపీ నిర్వాహక బాధ్యతలను నందమూరి కుటుంబా నికి అప్పగించాల్సిందేనని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే టీడీపీ పార్టీ పగ్గాలు  అందుకునే అర్హత ఎన్టీఆర్‌‌కే ఉందని అంటున్నారు.

 జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరి కృష్ణ ఒకానొక దశలో చంద్రబాబు నాయుడి నాయకత్వాన్ని సవాల్ చేస్తూ... 1999 జనవరి 26న అన్నా టీడీపీని ఏర్పాటు చేశారు. ఆ సందర్భంలో చంద్రబాబు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. కమ్యూనిస్టు పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో హరికృష్ణ చంద్రబాబును దెబ్బతీస్తారనే అందరూ భావించారు. కానీ ఎన్నికల ఫలితాలు అందుకు విరుద్ధంగా వచ్చాయి.

అన్నా టీడీపీ 191 స్థానాల్లో పోటీ చేయగా.. ఒక్క సీటు కూడా గెలవలేదు. 1.12 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. దీంతో ఆయన క్రమంగా రాజకీయాలకు దూరంగా వెళ్లిపోయారు. తర్వాత 2008 నాటికి మళ్లీ చంద్రబాబుతో ఆయన సంబంధాలు మెరుగయ్యాయి. దీంతో ఆయన టీడీపీలో చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. దీంతో హరికృష్ణ సూచన మేరకు జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.   రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా తెలుగు దేశం పార్టీ లేఖ ఇవ్వగా.. విభజనను వ్యతిరేకిస్తూ హరికృష్ణ ఎంపీ పదవికి రాజీనామా చేసి పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించారు.
 
ప్రస్తుతం జూనియార్ ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీకి, చంద్రబాబు కుటుంబానికి దూరంగా ఉండటం, గతంలో మాజీ మంత్రి కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం పక్కా అని... రాబోయే రోజుల్లో పరిస్థితులను బట్టి ఎన్టీఆర్ రాజకీయ ఆరంగ్రేటం ఉంటుందని అనటం ఆయన ఫ్యాన్స్‌లో జోష్‌ నింపింది.. అయితే, తెలుగు దేశం పార్టీ పగ్గాలు చేపట్టి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా? తండ్రి పార్టీని పునరుద్దరిస్తారా? అనే ప్రశ్న అందరిలో మొదలైంది.
 

తండ్రి హరికృష్ణ పెట్టిన అన్నా టీడీపీ పార్టీని

ఈ సమయంలో ఎన్టీఆర్ తన తండ్రి హరికృష్ణ పెట్టిన అన్నా టీడీపీ పార్టీని పునరుద్దరిస్తారని, పార్టీ అద్యక్షునిగా పార్టీని ముందుకు నడిపించేందుకు సన్నాహాలు చేస్తున్నారని వీలైనంత త్వరలో పార్టీ గురించి ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై ఎన్టీఆర్ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటనా రాలేదు. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారన్న విషయం ఆయన అంతర్గత వ్యవహారం. ఈ విషయంలో అభిమానులు చెప్పినా.. వైసీపీ నేతలు చెప్పినా… ఎన్టీఆర్ మనసులో ఏముందన్నది అన్నదానిపై ఎవరికి క్లారిటీ రావడం లేదు. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow