జూన్ 9న జగన్ ప్రమాణస్వీకారం సీఎం జగన్‌ కొత్త మంత్రులు వీరే.. ఎవరెవరు ఉన్నారంటే....?

సీఎం జగన్ ఈ ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తాం అని ప్రకటించిన రోజు నుంచి... టీడీపీ-జనసేన వర్గాలు జగన్ ఆత్మవిశ్వాసన్ని చూసి వణికిపోతున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ 151కి పైగా అసెంబ్లీ, 22 లోక్‌సభ నియోజకవర్గాల్లో జెండా ఎగురవేస్తామని జగన్ చెప్పడం జగన్‌‌కి తన పై తన పార్టీ చేసిన సంక్షేమలపై ఎంత నమ్మకం ఉందో చెప్పవచ్చు. Sri Media News

Jun 1, 2024 - 22:50
 0  6
జూన్ 9న జగన్  ప్రమాణస్వీకారం సీఎం జగన్‌  కొత్త మంత్రులు వీరే.. ఎవరెవరు ఉన్నారంటే....?

ఏపీలో ఎన్నికల ఘట్టం ముగిసింది. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఈ నెల 13వ తేదీన పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం అందరి దృష్టీ ఓట్ల లెక్కింపు జరిగే జూన్ 4వ తేదీపైనే ఉంది. ఈ ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారనేది ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. ఏపీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా భారీ ఓటింగ్ నమోదు కావడంతో... ఈ భారీ పోలింగ్ వైసీపీకిని గెలిపిస్తూందని పోలిటికల్ సర్వేలు అన్ని కోడై కూస్తున్నాయి.

 సీఎం జగన్ ఈ ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తాం అని ప్రకటించిన రోజు నుంచి... టీడీపీ-జనసేన వర్గాలు జగన్ ఆత్మవిశ్వాసన్ని చూసి వణికిపోతున్నాయి. ఈ ఎన్నికల్లో  వైసీపీ 151కి పైగా అసెంబ్లీ, 22 లోక్‌సభ నియోజకవర్గాల్లో జెండా ఎగురవేస్తామని జగన్ చెప్పడం జగన్‌‌కి తన పై తన పార్టీ చేసిన సంక్షేమలపై ఎంత నమ్మకం ఉందో చెప్పవచ్చు. అంతేకాదు... వైసీపీకి గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ గట్టిగా జరిగింది. మరోవైపు మహిళలు, వృద్ధులు ఓటింగ్‌‌ వైసీపీకి పడింది. వైసీపీ ప్రభుత్వం వస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని గ్రామీణ ప్రజలు జగన్‌‌ని నమ్మారు. అందుకే.... సంక్షేమ పధకాల లబ్దిదారులు కసితో ఓటింగులో పాల్గొన్నారని జగన్‌‌కి గట్టి నమ్మకం ఉంది.

అందుకే వైఎస్ జగన్ రెండోసారి ముఖ్యమంత్రిగా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో ఫ్యాన్ గాలి బలంగా వీచిందని వైసీపీ నమ్ముతుంది. దీన్ని బలపరుస్తూ... జగన్ రెండోసారి ప్రమాణ స్వీకార తేదీని సైతం ఖరారు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. సాగరనగరం విశాఖపట్నంలో జూన్ 9వ తేదీన జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడించారు. ఫలితాలు వెల్లడైన వెంటనే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఆయన ప్రకటించడం. టీడీపీ- జనసేన నాయకులు, శ్రేణుల్లో వణుకు పుడుతుంది. జూన్-9న వైజాగ్ లో జగన్ ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని మంత్రి బొత్స సహా కీలక నేతలు ప్రకటించాడంతో వైసీపీ ప్రభుత్వం ఏర్పడితే.. మంత్రి వర్గంలో ఎవరు ఉంటారు అని చర్చ బాగా జరుగుతుంది.

జ‌గ‌న్ క‌నుక అధికారంలోకివ‌స్తే... మంత్రి వ‌ర్గంలో మ‌హిళ‌ల‌కు అవ‌కాశం ఖ‌చ్చితంగా ఉంటుంద‌నేది తెలిసిందే. అయితే ఈ సారి మరి కొంత పెంచిప్రాధాన్యత పెంచి మహిళలకు ఎక్కువగా మంత్రి పదవులు ఇస్తారని చెప్పవచ్చు... మంగ‌ళగిరిలో నారా లోకేష్‌ను ఓడించి.. గెలిస్తే.. మురుగుడు లావ‌ణ్యకు బీసీ కోటాలో మంత్రి ప‌ద‌వి ఖాయ‌ం. నిజానికి పోలింగ్ రోజునే..ఈ విష‌యం అంత‌ర్గతంగా వైసీపీ నాయ‌కులు ముందుకు తీసుకువెళ్లారు కూడా. త‌ద్వారా.. ఓటింగ్ త‌మకు అనుకూలంగా ప‌డేలా వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రించారు జగన్. మంగళగిరిలో మురుగుడు లావణ్య ఎంత తక్కువ అయినప్పటికీ వెయ్యి ఓట్ల మెజారిటీతో అయినా గెలుస్తుందని తెలుస్తుంది. దీనికి తోడు మాజీ ఎమ్మెల్యే మురుగుడు హనుమంతరావు కుటుంబీకురాలే కావడంతో ఈమె రాజకీయాలకు కొత్తేమీ కాదు. ఎంఏ ఇంగ్లిష్ చదువుకున్న లావణ్య.. మంగళగిరిలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఓట్లు ఉన్న పద్మశాలి సామాజికవర్గానికి చెందినది. అందుకే వైసీపీ వ్యూహాత్మకంగా ఆఖరి నిమిషంలో గంజి, ఆళ్ళను పక్కనెట్టి మరీ మురుగుడు లావణ్యను ఇక్కడ పోటీలో నిలబడి గెలిస్తే "హోం శాఖ" ఇచ్చే ఆవకాశం ఉంది. ఎందుకంటే  జగన్ గత అయిదేళ్ల కాలంలో హోం శాఖ మహిళకే కేటాయించారు.

హిందూపురం నియోజకవర్గం టీడీపీకి హిందూపురం కంచుకోట. టీడీపీ స్థాపించినప్పటి నుంచి అక్కడ ఆ పార్టీకి ఓటమే లేదు. 1983 నుంచి ఎన్టీఆర్ మూడు సార్లు, వెంకట్రాముడు ఒకసారి అబ్దుల్ ఘనీ ఒకసారి గెలిచారు. 1996లో ఎన్టీఆర్ మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో నందమూరి హరికృష్ణ విజయం సాధించారు.. 2014, 2019 ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ టీడీపీ నుంచి గెలుపొందారు. అయితే జూన్ 4న ఇక్కడ దీపిక గెలిచి.... హిందూపురంలో వైసీపీ జెండా ఎగరేస్తే... దీపిక‌కు కూడా.. మంత్రి ప‌ద‌వి ద‌క్కే అవ‌కాశం ఉంది. దీపికకు వ్యాపారల్లో అనుభవం ఉండటంతో ఈమెకు పరిశ్రమల శాఖ మంత్రి ఇవ్వొచ్చు.

పిఠాపురంలో ప‌వ‌న్ను ఓడిస్తే.. వంగా గీత‌కు.. డిప్యూటీ సీఎం ప‌ద‌విని ఇస్తామ‌ని ఎన్నిక‌ల ప్రచారంలోనే జ‌గ‌న్ చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై పిఠాపురం నుంచి పోటీ చేసిన మహిళ. గత ఎన్నికలలో కాకినాడ ఎంపీగా గెలిచిన ఈమెను వైసీపీ బరిలోకి దింపింది. టీడీపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన గీత.. 2000లో ఆ పార్టీ తరఫున రాజ్యసభకు వెళ్లారు. అనంతరం ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009లో ఇదే పిఠాపురంలో పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి కాకినాడ ఎంపీ టికెట్ తెచ్చుకున్న గీత ఈ ఎన్నికలలో విజయం సాధించారు. ఈసారి కూడా కచ్చితంగా గెలిచి తీరుతానని ధీమాగా ఉన్నారు. పైగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని కూడా వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి కీలక హామీ ఇచ్చారు. పైగా గీత లోకల్ అని.. మహిళ అనే సెంటిమెంట్.. రాజకీయ అనుభవం కలిసి వస్తుందని వైసీపీ భావించి బరిలోకి దింపింది.

ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన ఇద్దరు వైసీపీ మహిళా నేతలకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఎస్టి కోటాలో సీనియర్ ఎమ్మెల్యే అయిన పాలకొండకు చెందిన విశ్వాసరాయి కళావతికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈమె వరసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచింది. ఈ.సారి ఈమె గెలిచి వైసీపీ అధికారం లోకి వస్తే ఈమెకు మంత్రి పదవి దక్కి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈమెకు పశు సంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రిగా జగన్ కేబినేట్‌‌లో పదవి ఇస్తారని తెలుస్తుంది.

పాతపట్నం ఎమ్మెల్యే క్యాండిడేట్ రెడ్డి శాంతి కి కూడా మంత్రి పదవి దక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక సారి ఎమ్మెల్యే గా గెలిచి రెండవ సారి పోటీ చేస్తుంది. ఈ సారి ఈమె కూడా గెలిచి వైసీపీ అధికారం లోకి వస్తే ఈమెకు కూడా మంత్రి పదవి కి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈమెకు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పదవి ఇవ్వొచ్చాని అంచానా.


కుప్పంలో భరత్‌.... టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోట. ఎందరో ఈ కోటను కూల్చాలని విశ్వ ప్రయత్నాలు చేసినా ఎవరివల్లా కాలేదు. ఈసారి మాత్రం కూసాలు కదిలిపోవడమే కాదు.. బద్దలు కొట్టే తీరుతామని పీసు పీసులు చేస్తామని వైసీపీ చెబుతోంది. అందుకే ఇక్కడి నుంచి యువనేత భరత్ ను పోటీలోకి దింపింది వైసీపీ. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి చంద్రమౌళి తనయుడే భరత్.. బాబుపై చంద్రమౌళి రెండు దఫాలు పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈ ఎన్నికల్లో గెలిచి చరిత్ర సృష్టిస్తా అని పదే.. పదే చెబుతున్నారు. అంతేకాదు...నియోజకవర్గ అభివృద్ధిని చేయడమే గాక.. ఏ కార్యక్రమం ప్రారంభించాలన్నా కుప్పం నుంచే మొదలు పెట్టడం జరిగింది. పైగా ఎమ్మెల్సీ పదవిని కూడా కట్టబెట్టడం జరిగింది. గత ఎన్నికల్లో ఒకటి రెండు రౌండ్లలో వెనుకబడిన బాబు.. ఈసారి ఊహించని రీతిలో ఓడిపోతారని.. ఒక్క మునిసిపాలిటీ పైనే చంద్రబాబుకు ఆశలు ఉన్నాయని.. మిగిలిన అన్ని ప్రాంతాలు మార్పు కోరుకుంటున్నాయని వైసీపీ చెబుతోంది. దీనికి తోడు.. భరత్ ను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే మంత్రి పదవి ఇస్తానని కూడా వైఎస్ జగన్ మాటిచ్చారు. అయితే ఈయనకు గృహనిర్మాణ శాఖ మంత్రి పదవి ఇవ్వచ్చాని తెలుస్తుంది.

బొత్స సత్యనారాయణ... వైసీపీ సీనియర్ నాయకుడు. 2019లో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించి, 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా విద్యా శాఖ మంత్రిగా నియమితులయ్యారు. బొత్స సత్యనారాయణ 1999లో బొబ్బిలి పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీగా విజయం సాధించారు. ఆనాడు ఎన్డీఏ హవా వల్ల కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ నుండి కేవలం 5 ఎంపీలని గెలుచుకోగా అందులో బొత్స ఒకరు. 2004, 2009 లలో చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. భారీ పరిశ్రమల శాఖ, పంచాయతీ రాజ్ గృహ నిర్మాణ శాఖ, రవాణా, మార్కెటింగ్ శాఖలకు మంత్రిగా పని చేశారు. ఏపీసీసీ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేశారు. 2015 లో, బొత్స కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బొత్స తన కుటుంబం, మద్దతుదారులతో కలిసి వైయస్ఆర్ కాంగ్రెస్‌ లో చేరారు. 2019 చీపురుపల్లి నియోజకవర్గం నుండి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.. ఈ సారి కూడా గెలిచి బొత్స సత్యనారాయణ ఈ సారి రవాణా, మార్కెటింగ్ శాఖ మంత్రిగా చేసే ఆవకాశం ఉంది.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... వైఎస్ జగన్  పై కాంగ్రెస్ కక్ష కట్టడంతో వైయస్ కుటుంబానికి సపోర్ట్ గా నిలిచారు. 2013లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేరారు. 2014 , 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.ఆయన 2019లో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల, భూగర్భ శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గ్రామ సచివాలయ, వాలంటీర్ల శాఖ భాద్యతలను 21 సెప్టెంబర్ 2020న ప్రభుత్వం అప్పగించింది. అయితే ఈ సారి కూడా ఆయన గెలిచి... గనుల, భూగర్భ శాఖ మంత్రిగా భాద్యతలు చెపట్టానున్నారు.


బాలినేని శ్రీనివాస రెడ్డి... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌తో ఆయనకు బంధుత్వం ఉంది. తండ్రి వెంకటేశ్వర రెడ్డి బాటలో శ్రీనివాస రెడ్డి కూడా రాజకీయాల వైపు అడుగులు వేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరి.. అంచలంచెలుగా ఎదిగారు.. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా మారారు. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరి.. జిల్లాలో మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో తిరుగులేని నేతగా బాలినేనికి గుర్తింపు ఉంది. వైఎస్సార్సీపీలో సీనియర్ పొలిటీషియన్‌గా ఉన్నారు. ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఐదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019లో మళ్లీ ఒంగోలు నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఆ తర్వాత సీఎం జగన్ కేబినెట్‌లో విద్యుత్, అడవులు పర్యావరణం, శాస్త్ర సాంకేతిక వ్యవహారాల మంత్రిగా బాలినేని బాధ్యతలు నిర్వర్తించారు.

ఒంగోలు నుంచి ఏకంగా ఐదుసార్లు గెలిచిన ట్రాక్ రికార్డ్ బాలినేని శ్రీనివాసరెడ్డికి ఉంది. అయితే కేబినెట్ ప్రక్షాళనలో భాగంగా 2022 ఏప్రిల్ 7న మంత్రి పదవికి బాలినేని రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో ఆయన అలకబూనారు. సీఎం జగన్, అధిష్టానం బుజ్జగింపులతో ఆయన వెనక్కు తగ్గారు. ఆ తర్వాత బాలినేనికి రీజినల్ కో ఆర్డినేటర్ బాధ్యతల్ని అప్పగించారు.. కానీ అనూహ్యంగా ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. తాను కేవలం ఒంగోలు నియోజకవర్గానికి పరిమితం అవుతానని ప్రకటించారు. అయితే ఈ సారి గెలిచి అడవులు పర్యావరణశాఖ మంత్రి అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి... 2019 జగన్ మంత్రివర్గంలో చోటు దక్కాల్సింది. కానీ సామాజిక సమీకరణాల కారణంగా ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో మాచర్ల నియోజకవర్గంలోనే అత్యధిక విజయాలు నమోదు కావడంతో ఆయనకు మంత్రివర్గ విస్తరణలో చోటు ఖాయమని అనుకున్నారు. అప్పటికే మంత్రివర్గంలో రెడ్డి సామాజికవర్గం వారు అధికంగా ఉండటంతో పిన్నెల్లికి మంత్రి పదవి లభించలేదు. ఈసారి గెలిస్తే... పిన్నెల్లికి మంత్రి పదవి పక్క అని తెలుస్తుంది. ఒకవేళ పిన్నెల్లి ఈ ఎన్నికల్లో గెలిస్తే.. ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఈవీఎం ధ్వంసం కేసుతో ఆయన రాష్ట్ర మొత్తం కూడా ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారారు.

కొడాలి నాని.... 2004, 2009లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. అయితే 2014 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2019లోనూ వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. గుడివాడలో ఇప్పటికే నాలుగుసార్లు గెలిచిన నాని.. ఐదోసారి కూడా ఘన విజయం సాధిస్తానని ధీమాగా చెబుతున్నారు ప్రజలు. గుడివాడ కింగ్‌ అనే బిరుదును ఆయన సొంతం చేసుకున్నాడు.. ఎవరికి ఏ సమస్య ఉన్నా.. నేను ఉన్నా అంటూ ముందు ఉండటం.. తన పర బేధం చూపించకుండా.. అందిరితో కలిసి పోవటంతో.. కొడాలికి ఆ పేరు వచ్చింది.. అటు వంటి నాయకుడికి  మరోసారి  జగన్ మంత్రి పదవి ఇస్తారని తెలుస్తుంది... అయితే ఈయనకు ఏ పదవిని జగన్ ఇవ్వనున్నారో వేచి చూడాల్సిందే.


వల్లభనేని వంశీ.... తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ వల్లభనేని వంశీ మోహన్ 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా గన్నవరం అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. ఈ సమయంలో వైసీపీ అభ్యర్థి తుట్ట రామచంద్రరావు పై 9400 ఓట్లతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇక 2019 ఎన్నికల ముందు వంశీ దాదాపు వైఎస్ఆర్సిపీలో చేరతారని వార్తలు వినిపించాయి. ఈ సమయంలో వంశీని జగన్ హగ్‌ చేసుకున్న ఫోటో చాలా వైరల్‌ అయ్యింది. దీంతో వంశీ వైసీపీ చేరటం దాదాపు ఖరారు అయిపోయిందని వార్తలు కూడా హల్‌చల్‌ చేశాయి. కానీ, పార్టీ మారకుండా టిడిపిలోనే కొనసాగారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా మళ్లీ పోటీ చేసి వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుపై 838 ఓట్లతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

2019 వైసీపీ ప్రభంజనంలో ఆయన గెలిచారంటే.. అర్థం చేసుకోవచ్చు.. వంశీ ప్రభావం.. స్థానికంగా ఎలా ఉంటుందో.. కానీ.. ఒక్కసారిగా టీడీపీలో రాజకీయ సమీకరణాలు మారటం మెుదలయ్యాయి.. నిజానికి.. 2019 ఎన్నికల ముందే.. వంశీకి.. టీడీపీకి మధ్య దూరం మెుదలయ్యింది.. పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు ఆయన దూరమయ్యారు. కేవలం లోకేశ్ చేతుల్లోకి వచ్చిన తర్వాత పార్టీ విధానాలు దెబ్బతిన్నాయని బహిరంగాగనే విమర్శలు గుప్పించారు.. దీంతో ఆయనకు వ్యతిరేకంగా టీడీపీ నేతలే తప్పుడు ప్రచారాలు చేయడం ప్రారంభించారు. ఇది తట్టుకోలేక వల్లభనేని వంశీ టీడిపిని వీడి వైసీపీలో చేరారు. తమ పార్టీ గుర్తుపై గెలిచి.. పార్టీ ఫిరాయించటంతో చర్యలు తీసుకోవాలని.. టీడీపీ వేసిన పిటిషన్‌తో ఆయనపై అనర్హత వేటు వేస్తూ 2024 ఫిబ్రవరి 26న స్పీకర్‌ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు. తనను నమ్ముకొని వచ్చిన వంశీకి.. సీఎం జగన్‌ గన్నవరం ఎమ్మెల్యే టికెట్‌ని ఇచ్చారు.. ఈసారి కూడా గెలిచి.. హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకోనున్నారు వంశీ... సో వంశీకి ఈ సారి జగన్ మంత్రి వర్గంలో  విద్యా శాఖ మంత్రిగా ప్లేస్ పక్క అని తెలుస్తుంది.

విడదల రజిని.... గుంటూరు జిల్లా చిలకలూరిపేట అసెంబ్లీ స్థానం నుంచి 2019 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి తన ప్రత్యార్థిపై ఎనిమిది వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈమెకు అంతకుముందు ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం లేదు. పొలిటికల్ బ్యాగ్రౌండ్ అసలు లేదు. కానీ, అలా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి.. ఇలా ఎమ్యెల్యేగా గెలుపొంది.. ఆ తరువాత మంత్రి అయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో లేటుగా ఎంట్రీ ఇచ్చినా.. తన మాట తన దూకుడుతో ఎమ్యెల్యేగా గెలుపొంది.. ఈ సారి కూడా వైద్యవిద్య శాఖల మంత్రిగా జగన్ క్యాబినేట్ లో  స్థానం సంపాదించుకున్నారని తెలుస్తుంది.


గుడివాడ అమర్నాథ్...  రాష్ట్ర విభజన సమయంలో తెలుగుదేశం పార్టీ ధోరణి నచ్చిన ఆయన 2011లో టిడిపికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.ఈ సమయంలో  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా ఆయన పని చేశారు. ఇక 2014 ఎన్నికల సమయం వచ్చింది. ఈ ఎన్నికల్లో ఆయనకు అనకాపల్లి నుంచి ఎంపీ టికెట్ ను కేటాయించారు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు అమర్నాథ్ వయస్సు కేవలం 29 సంవత్సరాలు. ఈ  ఎన్నికల్లో మొత్తం శ్రీనివాసరావు చేతిలో అమర్నాథ్ ఓటమిన్ పాలయ్యారు. అయినా ఆయన పార్టీ కోసం నిలబడ్డారు. జగన్ వెంటేనే నడిచారు. ఈ తరుణంలో విశాఖ రైల్వే జోన్ కోసం 256 కిలోమీటర్లు పాదయాత్రలు కూడా చేశారు అమర్నాథ్. దీంతో జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం బాధ్యతలను ఆయనకు అప్పగించారు. వాటిని సమర్థవంతంగా పూర్తి చేశారు

ఇక 2019 ఎన్నికల్లో అమర్నాథ్ కి జగన్ మోహన్ రెడ్డి అనకాపల్లి అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఈ సమయంలో టీడీపీ అభ్యర్థి పీల గోవిందం సత్యనారాయణ పై 8169 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే జగన్ తొలి క్యాబినెట్లో ఆయనకు మంత్రి పదవి వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ, ఆ సమయంలో కుదరలేదు. రెండోసారి క్యాబినెట్ విస్తరణంలో ఆయనకు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. రెండోసారి కూడా సీఎం జగన్ క్యాబినెట్‌‌లో ఈయన మంత్రి అవుతారని తెలుస్తుంది. అయితే పదవిపై క్లారిటి లేదు. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow