మిస్ వైజాగ్ నక్షత్ర నుంచి రోడ్ పైకి ..... భర్త ఇంటి వద్ద ఆందోళన.... వేరే మహిళతో భర్త.....

భర్త ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న మిస్ వైజాగ్ నక్షత్ర.తన అందంతో అభినయంతో మిస్ వైజాగ్ పోటీల్లో పాల్గొన్న నక్షత్ర అందరి దృష్టిని ఆకర్షించడంతో మిస్ వైజాగ్ టైటిల్ ని సొంతం చేసుకుంది. కానీ తన భర్త మనసుని గెలుచుకొని..Sri Media News

Jun 1, 2024 - 23:20
 0  9
మిస్ వైజాగ్ నక్షత్ర నుంచి రోడ్ పైకి ..... భర్త ఇంటి వద్ద ఆందోళన....  వేరే మహిళతో భర్త.....

ఆవిడా 2017 మిస్ వైజాగ్ ...

తన అందంతో అభినయంతో మిస్ వైజాగ్ పోటీల్లో పాల్గొన్న నక్షత్ర అందరి దృష్టిని ఆకర్షించడంతో మిస్ వైజాగ్ టైటిల్ ని సొంతం చేసుకుంది. కానీ తన భర్త మనసుని గెలుచుకొని... సంసారం నిలుపుకోలేకపోయింది. తన అందచందలతో భర్తను కొంగుముడిన పట్టుకోలేక పోయింది...

ప్రేమ  ఎలా మొదలైంది... 

2013 డిసెంబర్ నెలలో ఓ మూవీ ఆడిషన్‌‌లో నక్షత్ర, తేజ మధ్య పరిచయం ఏర్పడింది. మనసులు కలవడంతో 2017 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు.  వీరిద్దరికీ ఒక పాప పుట్టింది. సజావుగా సాగుతున్న సంసారంలో కలతలు మొదలయ్యాయి. తన భర్త ప్రవర్తనలో మార్పు వచ్చిన విషయం గురించింది నక్షత్ర. తన భర్త గురించిన నిజాలు తెలుసుకున్న ఆమె కృంగిపోయింది. . అయినా సరే  భర్త తేజను వదల్లేదు నక్షత్ర. మార్చుకొవాలని ఎంతో టై చేసింది... కానీ ఫలితం లేదు...

భర్తను రెడ్ హ్యాడెండ్‌గా

భార్య నక్షత్రకు విడాకులు ఇవ్వకుండానే భర్త సాయి తేజ మరో మహిళను పెళ్లి చేసుకొని... ఓ అపార్ట్మెంట్ తీసుకొని... ఆమె దగ్గరే ఉంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న నక్షత్ర, మీడియాకు తన భర్తను రెడ్ హ్యాడెండ్‌గా పట్టించింది. అంతేకాదు ఆ సన్నివేశాన్ని చూసి  తట్టు కోలేకపోయిన నక్షత్ర.  భర్త చెంప ఛెళ్లుమనిపించింది. దీంతో భార్యభర్తల మధ్య వ్యవహారం బయటకు వచ్చింది.

తన భర్త అసలు నిజస్వరూపం 

తేజ గురించి అసలు విషయాలు బయటపెట్టింది నక్షత్ర. తేజకు కుటుంబం పై భద్యత లేదు...  పబ్జీ గేమ్ ఆడి అమ్మాయిలను ట్రాప్ చేసేవాడు... దీని కారణంగా పబ్జీ గేమ్ కి బానిసై డ్యూటీకి వెళ్ళేవాడు కాదు. తెల్లవార్లూ గేమ్ ఆడుతూ అమ్మాయిలతో నీచంగా మాట్లాడేవాడు. ఉదయం పడుకునేవాడు. నావెల్ డాక్ యార్డ్ లో ఉద్యోగం పోయింది. అంతేకాదు రోజుకో వర్జిన్ అమ్మాయి కావాలని... నక్షత్రపై ఒత్తిడి పెట్టేవాడు తేజ. అంతేకాదు... ఆడది కనిపిస్తే వదిలిపెట్టేవాడు కాదట...  నక్షత్ర అక్కను కూడా అదే ఉద్దేశంతో చూసేవాడని... వావి వరుసలు లేకుండా ప్రవర్తిస్తాడని అంటుంది నక్షత్ర. 2020 వరకూ తన కాపురం బానే ఉండేదని... ఎప్పుడైతే తన భర్త నిజస్వరూపం బయటపడిందో అప్పటి నుంచి గొడవలు మొదలయ్యాయని... 2021 నుంచి ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువయ్యాయని నక్షత్ర చెబుతుంది.

తేజకి సినిమాలంటే ఉన్న పిచ్చితో హీరో అవుతా అని చెప్పి తన బంగారం మొత్తం తాకట్టు పెట్టేశాడట. అయితే ఇద్దరు కలిసి ఉన్నప్పుడే తేజ బ్యాక్ డోర్ మూవీ సినిమా చేశాడు. ఆ సమయంలో ఆ మూవీ హీరోయిన్ పూర్ణ నన్ను డేట్ కి రమ్మంటుందని నక్షత్రతో అనేవాడట... అసలు నిజం తెలుసుకుందాం అని బ్యాక్ డోర్ మూవీ డైరెక్టర్ ని అడిగితే అదేం లేదని చెప్పాడట డైరెక్టర్. చాలా మంది అమ్మాయిలతో ఎఫైర్లు నడిపేవాడని.. వారితో అసభ్యకరంగా ఫోన్ లో మాట్లాడేవాడని... వాయిస్ రికార్డులు, అమ్మాయిలతో చాట్ చేసిన మెసేజులు వంటి సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయని నక్షత్ర చెబుతుంది.

నా బిడ్డ కోసమే భరిస్తూ వచ్చాను

నా భర్త  ఎలాంటి  దారుణాలు చేసినా నా బిడ్డ కోసమే భరిస్తూ వచ్చాను. .. కానీ ఎన్ని భరించిన  అతను ఏమాత్రం మారలేదని ఆమె చెప్పుకొచ్చింది. . ఇప్పుడు ఏకంగా మరో మహిళతో భార్య అని చెప్పి కాపురం పెట్టాడని మే 30న విశాఖపట్నంలోని తన భర్త ఆఫీస్ ముందు న్యాయం కోసం ధర్నాకు దిగారు నక్షత్ర. తన భర్త వేరే మహిళతో గదిలో ఏకాంతంగా గడుపుతుండగా నక్షత్ర రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తనకు విడాకులు ఇవ్వకుండా భర్త తేజ వేరే మహిళను వివాహం చేసుకున్నారని ఆరోపించారు.

నక్షత్ర చేసిన ఆరోపణలు నిజం కాదని

అయితే భర్త తేజ వెర్షన్ చూస్తే... తనపై నక్షత్ర చేసిన ఆరోపణలు నిజం కాదని. తన మీద పలు కేసులు ఉన్నాయని.. అవి ఇంకా పెండింగ్ లోఉన్నాయని, ఇక తనతో గదిలో ఉన్న అమ్మాయి ఆడిషన్ కి వచ్చిందని.. మూవీ తీసే ప్లాన్ లో ఉన్నామని అన్నారు. అయితే చూట్టు ఇలా కుటుంబంలో తలెత్తిన సమస్యల కారణంగా ఒకప్పటి మిస్ వైజాగ్ ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. మరి ఈ వ్యవహరం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow