ప్రధాని నరేంద్ర మోడీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసిన మాల్దీవ్స్ గవర్నమెంట్.
ప్రధాని నరేంద్రమోడీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల మంత్రులని అక్కడి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల లక్షద్వీప్ పర్యటన పై మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.Sri Media News
భారత ప్రధాని నరేంద్రమోడీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల మంత్రులని అక్కడి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల లక్షద్వీప్ పర్యటన పై మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. వీటితో భారత్ తో పాటు అంతర్జాతీయ వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. దీనితో దిద్దుబాటు చర్యలకు దిగిన మాల్దీవుల ప్రభుత్వం ముగ్గరు మంత్రులపై వేటు వేసింది. సోషల్ మీడియా లో వివాదాస్పద పోస్టు లు పెట్టిన వారిని పదవి నుంచి తప్పించినట్లు మాల్దీవుల విదేశాంగ శాఖ పేర్కొంది. మరియం షియానా , మల్షహ్ తో పాటు మరో మంత్రి హాసన్ జిహన్ లను మంత్రి పదవి నుంచి తప్పించినట్లు సమాచారం.
భరత్ తో పాటు మోదీ ని ఉదేశిస్తూ మాల్దీవుల్లో అధికార పార్టీ నేతలు వ్యాఖ్యలు చేయటం పై అక్కడి విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. కొందరు నాయకులూ చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతం అని ప్రభుత్వంతో సంబంధం లేదని పేరొంది . మంత్రులు అటువంటి వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇలా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ముగ్గరు మంత్రులను తొలగించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. కాగా మోడీ ప్రధాని పై అనుచిత వ్యాఖ్యలు చేయటం తో భారతీయులు బైకోట్ మాల్దీవ్ అని హ్యాష్ ట్యాగ్ ని సోషల్ మీడియా లో ట్రేండింగ్ చేసారు. ఆ దేశానికి వెళ్లాలని షెడ్యూల్ ప్లాన్ చేసుకున్న దాదాపు 90 వేలమంది భారతీయులు టూర్ ని కాన్సల్ చేసుకున్నారు.
ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోడీ లక్షద్వీప్ పర్యటనకు వెళ్లిన ఫోటోలు వీడియో లు సోషల్ మీడియా లో వైరల్ గా మారగా వాటిలో ఓ వీడియో పై మరియం షియానా చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. లక్షద్వీప్ బీచ్ పై మోడీ నడుస్తున్న ఓ వీడియో పై మరియం సోషల్ మీడియా వేడిఅక్కగా స్పందిస్తూ... ప్రధాని మోడీ ఇజ్రాయల్ దేశపు తోలుబొమ్మ అని అనుచిత కామెంట్ చేసారు. దీనితో ఒక్కసారిగా ఆమె వ్యాఖ్యలు వివాదాస్పదం గా మారాయి. ఆమె వ్యాఖ్యలు భారత్ లోని పలువురు తీవ్రంగా ఖండించారు. మాల్దీవ్ మంత్రులు చేరిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటులు సైతం త్రీవ్రం గా ఖండించారు. భరత్ పై మాల్దీవ్ దేశ మంత్రులు అలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా ఆశ్చర్యం కలిగించింది. పొరుగు దేశం తో తాము స్నేహంగానే ఉండాలనుకుంటాం కానీ వారి ద్వేషాన్ని సహించం, మాల్దీవుల్లో ఎన్నోసార్లు పర్యటించాను అయితే ఇటువంటి సమయం లో భారత్ లోని దీవులను పర్యటిస్తూ మన డీపర్యాటకానికి మద్దతు ఇద్దాం అని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సోషల్ మీడియా లో పేర్కొన్నారు.
What's Your Reaction?