ఎగ్జిట్ పోల్స్ నిజమైతయా..? జనం నాడి పట్టుకోలేని ఎగ్జిట్ పోల్స్.

ఏపీ ఎన్నికలు దేశ వ్యాప్తంగా కాక రేపుతున్నాయి. జూన్ 4న ఏ పార్టీ విజయ కేతనం ఎగురవేస్తుంది అనే టెన్షన్ ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. Sri Media News

Jun 3, 2024 - 13:40
Jun 3, 2024 - 13:53
 0  9
ఎగ్జిట్ పోల్స్ నిజమైతయా..? జనం నాడి పట్టుకోలేని ఎగ్జిట్ పోల్స్.
Exit polls, Andrapradesh, YSRCP, TDP, Elections alert

ఉత్కంఠగా ఏపీ ఎన్నికలు

ఏపీ ఎన్నికలు దేశ వ్యాప్తంగా కాక రేపుతున్నాయి. జూన్ 4న ఏ పార్టీ విజయ కేతనం ఎగురవేస్తుంది అనే టెన్షన్ ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. మే 13న పోలింగ్ పూర్తైన నాటి నుంచి ఎంతో ఉత్కంఠగా ఇటు రాజకీయ నాయకులు అటు ప్రజలు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెల 4న ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఫలితాలు వెలువడనున్నాయి.

దాదాపు 2శాతం

ప్రతీ ఎన్నికల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించే లోపు ఎగ్జిట్ పోల్స్  రచ్చలేపడం మాములే.... కానీ ఈ సారి ఏపీ ప్రజలు ఎవరివైపు మొగ్గు చూపారు అనేది.. ఏ రాజకీయ విశ్లేషకులు, ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలు  చెప్పలేక పోతున్నాయి...  అధికార వైసీపీ, కూటమి పార్టీలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటూ అధికారం తమదే అన్న ధీమాతో ఉన్నారు. 2019 ఎన్నికలకు మించి ఈసారి దాదాపు 2శాతం మేర ఓటింగ్ పెరగడంతో అధికార, ప్రతిపక్షాలు విజయం తమదేనన్న లెక్కలు కడుతున్నాయి.

ఈసారి ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ పెరగడంతో వివిధ రకాల విశ్లేషణలు, సర్వేలు, సోషల్ మీడియాలు రచ్చ లేపుతున్నాయి. దీంతో ఓటర్లతో పాటు రాజకీయ పక్షాలు సైతం గందరగోళంలో పడిపోయాయి. కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు అధికార వైసీపీకి అనుకూలంగా ఉండగా, మరికొన్ని సర్వేలు కూటమి విజయం ఖాయం అని చెబుతున్నాయి. దీంతో ఫలితాలపై ఆసక్తి మరింత పెరిగింది.
పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ
కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి పాలనా పగ్గాలు చేపట్టడం ఖాయమని దాదాపుగా అన్ని సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌  తెల్చి చెప్పాయి. ఎన్డీయే 350 స్థానాలకుపైగా దక్కించుకోవడం ఖాయమని మెజార్టీ సంస్థలు వెల్లడించాయి. కానీ.. దేశ వ్యాప్తంగా ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై తీవ్ర చర్చ జరుగుతోంది. దానికి కారణం... ఏపీలో ఏ పార్టీ విజయం సాధిస్తూంది అనే విషయాన్ని మాత్రం ఎవరు అంచాన వెయ్యలేక పోతున్నారు.... ఏపీలో ప్రజానాడిని పట్టుకోవడంలో ఎగ్జిట్ పోల్ సంస్థల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఈ ఎగ్జిట్ పోల్స్ లో అయితే.. వైసీపీ, లేదంటే ఎన్డీయే కూటమి వస్తుందని పలు సంస్థలు చెప్పడం... అసలు ఎగ్జిట్ పోల్ ఏదో, నకిలీ ఏదో తెలియని గందరగోళ పరిస్ధితులు ఏపీలో నెలకొంది.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ, ఎన్డీయే కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగిందనే విషయం పోలింగ్ రోజే తేలిపోయింది. అయితే ఎంత టఫ్ ఫైట్ ఉన్నా అంతిమంగా ప్రజలు పట్టం గట్టేది ఒకరికి మాత్రమే. కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఆ క్లారిటీ ఇవ్వడంలో విఫలమైనట్టు చెప్పవచ్చు.. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ సైతం ఒపీనియన్ పోల్స్ తరహాలో ఏదో ఒకవైపు మొగ్గు చూపడం లేదా పాక్షిక ఫలితాలు చెప్పి తప్పించుకునే ధోరణే ప్రదర్శించాయి.

Aaraa mastan ఎగ్జిట్ పోల్ సర్వేలో వైసీపీ: 94 -104 అసెంబ్లీ స్థానాలను గెలుస్తుందని... టీడీపీ కూటమి: 71 – 81 అసెంబ్లీ స్థానాలను గెలుస్తుందని... పార్లమెంట్ విషయానికి వస్తే... వైసీపీకి 13 – 15 సీట్లు... టీడీపీ కూటమికి 10 – 12 సీట్లు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. అంతేకాదు... ఏపీ ఎన్నికల్లో వైసీపీ గెలవనుందని ఆరా మస్తాన్ సర్వే అభిప్రాయపడింది. మహిళలు ఎక్కువగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారన్న మస్తాన్.. జగన్ పార్టీ 49.41 శాతం ఓట్లను సాధించి.. 94 నుంచి 101 సీట్లతో అధికారంలో రాబోతోందన్నారు. టీడీపీ కూటమి 47.55 శాతం ఓట్లను సాధించి 71-81 స్థానాలకు పరిమితం కాబోతోందని ఆరా మస్తాన్ వెల్లడించారు.

మ‌రి ముఖ్యంగా టీడీపీ కీల‌క నేత నారా లోకేష్ మంగ‌ళ‌గిరి నుండి, కుప్పం నుండి చంద్రబాబు, హిందూపురం నుండి బాల‌కృష్ణ భారీ మెజార్టీతో గెలుస్తార‌న్నారు. అలాగే జ‌న‌సేన అధినేత పిఠాపురం నుండి భారీ మెజార్టీతో గెల‌వ‌బోతున్నార‌ని అలాగే రెండు ఎంపీ సీట్లలో కూడా జన‌సేన గెల‌వ‌బోతుంద‌ని ప్రక‌టించారు మస్తాన్.. అలాగే వైసీపీ కీల‌క నేత అయినా విజ‌య‌సాయి రెడ్డి నెల్లూరు నుండి ఓట‌మి పాలు అవుతార‌ని.. అలాగే మంత్రులుగా ప‌ని చేసిన రోజా, ఉష‌శ్రీ చ‌ర‌ణ్, గుమ్మనూరు జ‌య‌రాం ఓడిపోతార‌ని... అలాగే మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి కూడా ఓడిపోతున్నట్లు మ‌స్తాన్ ప్రకటించి సంచలనం సృష్టించారు. ఎదేమైనా... ఏపీలో మరోసారి వైసీపీ అధికారం చెపడుతుందని ప్రకటించారు....

Atma Sakshi Exit Poll విషయానికి వస్తే...  వైసీపీ : 98-116 అసెంబ్లీ స్థానాలను... టీడీపీ కూటమి: 59 – 77 స్థానాలను గెలుస్తుందని..
Political Laboratary Exit Poll విషయానికి వచ్చిన కూడా వైసీపీ: 108, కూటమి: 67  అసెంబ్లీ స్థానాలను గెలుస్తుందని తెల్చి చెప్పింది.
అంతేకాదు... పస్ట్ స్టెప్ సోల్యూషన్స్ సర్వే, జన్‌మత్‌ పోల్స్‌, పార్థదాస్‌ ఎగ్జిట్‌పోల్స్‌ వైసీపీ అధికారం పట్టనుందని తెల్చి చెబుతుంటే...

జాతీయ మీడియా సంస్థాలు అన్ని.. వాటి సర్వేల్లో కుటమి రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని తెలిపాయి. లోకల్ సంస్థ అయినా కేకే సర్వే... KK ఎగ్జిట్ పోల్ సర్వే టీడీపీ+జనసేన+బీజేపీ: 133-144 స్థానల్లో విజయం సాధించగా వైసీపీ: 14 – 24 స్థానాలతో సరిపెట్టుకుంటుందని చెప్పెకొచ్చింది. పార్లమెంట్ స్థానాల విషాయనికి వస్తే.. టీడీపీ+జనసేన+బీజేపీ కలిపి 25 స్థానల్లో క్లీన్ స్విప్ చేయగా... వైసీపీకి జీరో స్థానాలు అని ప్రకటించింది.

వైసీపీకి అధికారం దక్కే అవకాశం ఉందని కొన్ని సర్వే సంస్థలు... కూటమీదే విజయం అని కోన్ని సర్వేలు వెల్లడించినప్పటికీ అందులో ఆరా అనే సంస్థ అంచనాలపై విస్తృత చర్చ జరుగుతోంది. కొందరు ముఖ్య నేతలకు సంబంధించి కూడా కొన్ని స్థానాలపై ఆరా ఇచ్చిన విశ్లేషణ తో పార్టీలు అప్రమత్తం అయ్యాయి. ఇండియా టుడే, ఏబీసీ సీవోటర్‌, పయనీర్‌, ఇండియా టీవీ, సీఎన్‌ఎస్‌, న్యూస్‌ 18 తదితర జాతీయ స్థాయి సర్వే సంస్థలన్నీ కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని వెల్లడించాయి. రాష్ట్రంలో టీడీపీ కూటమికి ఇటు అసెంబ్లీ, అటు లోక్‌సభ స్థానాల్లో పూర్తి ఆధిక్యత వస్తుందని కూడా బహిర్గతం చేశాయి.

అయితే వీటిలో ఆరా సంస్థ రాష్ట్రంలో తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని వెల్లడించడం చర్చనీయాంశమైంది. గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆరా సంస్థ ఎగ్జిట్‌ పోల్స్‌ నిజమయ్యాయి. అయితే ఈ పర్యాయం ఆ సంస్థ టీడీపీ కూటమి కన్నా 15 నుంచి 20 స్థానాల ఆధిక్యతతో వైసీపీ తిరిగి అధికారంలోకి రావచ్చని అంచనా వేసింది. అదే సమయంలో వైసీపీలోని కొందరు ప్రముఖులు, కొందరు మంత్రులు ఘోర ఓటమిని చవిచూడబోతున్నారని ప్రకటించింది. అదే సమయంలో తాము ఇచ్చిన సంఖ్య కంటే ఎక్కువ స్థానాలు వస్తాయని ఆరా సంస్థ చెప్పుకొచ్చింది. దీంతో..అసలు ఫలితం ఎలా ఉంటుందనే చర్చ కూటమి నేతల్లో ఉత్కంఠ పెంచుతోంది.

అంచనాలు తప్పిన సందర్భాలూ


కొన్నిసార్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పిన సందర్భాలూ ఉన్నాయి. వివిధ సర్వే సంస్థలు ఇస్తున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేసేలా ఉంటున్నాయి. 2004 సార్వత్రిక ఎన్నికలు, 2015, 2020 బిహార్ ఎలక్షన్లు, 2021 వెస్ట్ బెంగాల్, ఢిల్లీ ఎన్నికలు, నిరుడు జరిగిన మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, రాజస్థాన్ ఎలక్షన్ల విషయంలో ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి.

2004 సార్వత్రిక ఎన్నికల టైంలో ఎగ్జిట్పోల్స్ అన్నీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని అంచనా వేశాయి. 250 నుంచి 278 వరకు సీట్లు రావొచ్చని పేర్కొన్నాయి. మళ్లీ ఆ పార్టీనే అధికారం చేపడుతుందని చెప్పాయి. అదే సమయంలో యూపీఏకి 174 నుంచి 205 వరకు సీట్లు రావొచ్చని చెప్పాయి. అయితే, చివరకు ఫలితాల్లో మాత్రం యూపీఏనే పై చేయి సాధించింది.

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తారుమారయ్యాయి. ఎన్డీయే కూటమికి 181 సీట్లు రాగా.. యూపీఏకి 218 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత పలు పార్టీలూ యూపీఏకి మద్దతు ప్రకటించడంతో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఆ ఎగ్జిట్పోల్స్లో ఎన్డీటీవీ మాత్రమే యూపీఏకి 205 సీట్లు ఇవ్వగా.. దానికన్నా 13 సీట్లు ఎక్కువొచ్చాయి.

బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ రెండు సార్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. 2015లో అన్ని సర్వే సంస్థలు ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పాయి. కనిష్టంగా 64 నుంచి గరిష్టంగా 155 సీట్ల వరకు వస్తాయని లెక్కేశాయి. జేడీయూ, ఆర్జేడీల నేతృత్వంలోని మహాఘట్బంధన్కు 132 స్థానాలు వస్తాయని పేర్కొన్నాయి. అయితే, ఆ లెక్కలను తలకిందులు చేస్తూ.. మహాఘట్ బంధన్కు 151 సీట్లు వచ్చాయి.

ఎన్డీయేకి కేవలం 53 సీట్లే వచ్చాయి. 2020 ఎన్నికల్లోనూ మహాఘట్బంధన్కు 180 వరకు.. ఎన్డీయే కూటమికి 135 వరకు రావొచ్చని ఎగ్జిట్పోల్స్ పేర్కొన్నాయి. చివరకు ఆ ఎన్నికల్లో మహాఘట్బంధన్కు 110 సీట్లు వచ్చాయి. జేడీయూ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 125 స్థానాలు వచ్చాయి. దీంతో ఆ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది.


గత సంవత్సరం తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్ రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. అయితే, ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్పోల్స్ వెల్లడించాయి. ఒక్క తెలంగాణలో మినహా మూడు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తిప్పికొట్టాయి. ఆ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీనే అధికారంలోకి వచ్చింది. ఆ మూడు రాష్ట్రాల్లోనూ కొన్ని సర్వే సంస్థలు బీజేపీకి, ఇంకొన్ని కాంగ్రెస్కు అనుకూలంగా ఫలితాలివ్వగా.. ఎక్కువ శాతం సంస్థలు హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని అంచనాకు వచ్చాయి. కానీ, ఆయా రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలోకి వచ్చింది.

జనాలను కన్ఫ్యూజ్ చేసేలా ఉన్నాయన్న ఆరోపణలూ

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు జనాలను కన్ఫ్యూజ్ చేసేలా ఉన్నాయన్న ఆరోపణలూ లేకపోలేదు. ఒక్కో సంస్థ ఒక్కో తీరుగా ఫలితాలను ఇస్తుండడం, కొన్ని సందర్భాల్లో అవి రివర్స్ అవుతుండడంతో ఫైనల్ ఫలితాల కోసమే పబ్లిక్ వెయిట్ చేస్తున్నారు. ఇటు రాజకీయ నాయకులు కూడా అదే ధోరణితో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నమ్మడం లేదు.

ఎగ్జిట్ పోల్స్ చేసే సర్వే సంస్థలు తీసుకునే శాంపిల్స్ తక్కువగా ఉంటున్నాయని, జనాలు చాలా వరకు తాము ఎవరికి ఓటేశామన్న విషయాన్ని ట్విస్ట్ చేసి చెబుతుంటారన్న వాదనలు వినిపిస్తున్నాయి.  ఎవరి అంచనాలు సరైనవో తెలియాలి అంటే... జూన్ 4న వరకు వేచి చూడాల్సిందే.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow