వారంతా టికెట్తీసుకోవాల్సిందే తెలంగాణ మహాలక్ష్ములకు షాక్ డీలక్స్‌ బస్సు ఎక్కితే బహుమతులు

డీలక్స్‌ బస్సు ఎక్కితే మహిళలకు బహుమతులు ఇస్తామంటూ కొత్త స్కీంను ఆర్టీసీ ప్రారంభించింది. హనుమకొండ - హైదరాబాద్‌ మార్గంలో జనగామ డిపో 3 డీలక్స్‌ బస్సులను ప్రవేశపెట్టింది. ఈ బస్సుల్లో ప్రయాణిస్తే ప్రతి 15 రోజులకు ముగ్గురు మహిళలకు గిఫ్ట్లు ఇస్తామని ప్రకటించింది.Sri Media News

Jun 24, 2024 - 08:39
Jun 25, 2024 - 22:14
 0  5
వారంతా టికెట్తీసుకోవాల్సిందే తెలంగాణ మహాలక్ష్ములకు షాక్ డీలక్స్‌ బస్సు ఎక్కితే  బహుమతులు

తెలంగాణలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణానికి మంచి స్పందన వచ్చింది. మహిళలతో బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఉచిత ప్రయాణంతో ఆర్టీసీ బస్సులు మహిళలతో నిండిపోతున్నాయి. ఆక్యుపెన్సీ రేటుతో పాటు, ఆర్టీసీకి ఆదాయం కూడా మునుపెన్నడూ లేనంత పెరిగింది. అయితే ఈ రద్దీ వల్ల సీట్ల కోసం గొడవలు జరుగుతున్నాయి. పురుషులకు సీట్లు కూడా దొరకని పరిస్థితిని మనం చూస్తున్నాం. దీంతో పెరిగిన రద్దీ దృష్ట్యా... బస్సుల సంఖ్య పెంచాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. ఇక ఉచిత బస్సు ప్రయాణం వల్ల డీలక్స్‌ బస్సుల్లో ప్రయాణం చేసే మహిళల సంఖ్య తగ్గుతోంది. అలానే ఎక్స్‌ప్రెస్‌, ఆర్డీనరి బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరుగుతోంది. ఈక్రమంలో తాజాగా ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఇకపై వారంతా టికెట్‌ తీసుకోవాల్సిన పరిస్థితి రానుందని సమాచారం...

రాష్ట్రంలో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు వీలున్న ఎక్స్‌ప్రెస్‌ బస్సులను అవసరాలకు తగ్గట్టుగా ఆర్టీసీ పెంచడం లేదు. డబ్బులు చెల్లించి పూర్తి టికెట్‌ కొనాల్సిన డీలక్స్‌ బస్సులవైపు వారిని మళ్లించేందుకు కొన్నిచోట్ల ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే డీలక్స్‌ బస్సు ఎక్కితే మహిళలకు బహుమతులు ఇస్తామంటూ కొత్త స్కీంను ఆర్టీసీ ప్రారంభించింది. హనుమకొండ - హైదరాబాద్‌ మార్గంలో జనగామ డిపో 3 డీలక్స్‌ బస్సులను ప్రవేశపెట్టింది. ఈ బస్సుల్లో ప్రయాణిస్తే ప్రతి 15 రోజులకు ముగ్గురు మహిళలకు గిఫ్ట్లు ఇస్తామని ప్రకటించింది.

ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో గతంలో సగటున 70-75 శాతం వరకు మాత్రమే ఉండేది. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమల్లోకి వచ్చాక దాదాపు వంద శాతం నమోదవుతోంది. కేవలం ఎక్స్‌ప్రెస్‌ బస్సులనే పరిగణనలోకి తీసుకుంటే 120 శాతం దాటుతోంది. ఆర్డినరీ బస్సుల్లో కంటే ఎక్స్‌ప్రెస్‌లో సీట్లు కొంత మెరుగ్గా ఉంటాయి. వీటిలో బస్సు వేగం కూడా అధికం. ఆగే స్టాపులు, ప్రయాణానికి సమయం కూడా తక్కువ పడుతుంది.

ఈ కారణంగానే మహిళలు ఎక్కువగా ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ప్రయాణానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశం ఆర్టీసీకి ఆర్థికంగా సమస్యగా మారింది. రోజువారీ నిర్వహణ ఖర్చులు, డీజిల్‌, ఉద్యోగులకు నెల జీతాలకు ఇబ్బంది అవుతోంది. దీంతో ఆర్టీసీ మార్పులు చేయడానికి ప్రయత్నిస్తోంది.

ఎ‍్సక్స్ ప్రెస్‌ బస్సుల్లో రద్దీ పెరగడంతో.. దూర ప్రాంత సర్వీసుల్ని రద్దు చేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారుల నుంచి డిపో మేనేజర్లకు కొంతకాలం క్రితమే అంతర్గత ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. దీంతో పలు అంతర్‌ జిల్లా, అంతర్రాష్ట్ర సర్వీసులను రద్దు చేశారు. జనగామ నుంచి బాసర మార్గంలో 30 ఏళ్లుగా ఎక్స్‌ప్రెస్‌ బస్సుంది. ఉచిత ప్రయాణ పథకం వచ్చిన తర్వాత బస్సులో రద్దీ విపరీతంగా పెరిగింది. దాంతో ఫిబ్రవరి మాసంలో జనగామ డిపో ఈ సర్వీసును రద్దు చేసింది. కరీంనగర్‌ నుంచి ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేటకు సూర్యాపేట, మిర్యాలగూడ మీదుగా ఎక్స్‌ప్రెస్‌ ఉండేది. ఈ బస్ను రద్దు చేశారు. ప్రయాణికుల ఒత్తిడి పెరగడంతో ఇటీవల పునరుద్ధరించారు. ఈ క్రమంలో ఆయా మార్గాల్లో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల స్థానంలో.. డీలక్స్‌లను తీసుకురావాలని భావిస్తోంది అంటున్నారు.

కాగా... తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రకటించింది. అధికారంలోకి వస్తే అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9 నుంచి అమలు చేస్తోంది. ఈ పథకానికి మహిళల నుంచి అనూహ్య స్పందన వస్తున్నప్పటికీ బస్సుల కొరత ఇబ్బందికరంగా మారింది. అటు ఆటో డ్రైవర్ల నుంచి కూడా మొదటి నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది.

కాగా గతంలో దీని మీద ఒక ప్రవైట్ ఉద్యోగి పిటిషన్ దాఖలు చేశారు. మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణ వసతి కల్పించడం వివక్ష కిందకు వస్తుందని నాగోల్‌కు చెందిన ఉద్యోగి తెలంగాణ హైకోర్టులో పిల్ వేశారు. ఆర్టీసీలో వ్యవహారాల మీద నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఆర్టీసీలో(TSRTC) మహిళలకు ఉచిత ప్రయాణ వసతి ఇవ్వడం వలన మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందని… దీని వలన మిగతా వారికి ఇబ్బందులు కలుగుతున్నాయని పిటిషనర్ తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం 2023 డిసెంబర్ 8న జారీ చేసిన జీవో 47ను సస్పెండ్‌ చేయాలని కోరారు. కేంద్ర చట్టాల ద్వారా ఏర్పాటైన ఆర్టీసీలో ఉచిత పథకంపై అధికారం రాష్ట్రానికి లేదన్నారు. అంతేకాదు ఉచిత ప్రయాణం వలన ఆర్ధికంగా ఆర్టీసీ మీద పడే ఆర్ధిక భారాన్ని కూడా ప్రభుత్వం భరించడం అన్యాయమేనని పిటిషన్ వాదిస్తున్నారు. పన్నుల రూపంలో ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి ఇలా మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందించడం ఎంతవరకు సమంజసమని పిటిషనర్ తెలిపారు

కాగా ఈ కేసును విచారించిన హైకోర్టు ఇందులో ప్రజా ప్రయోజనేమీ లేదనే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ వ్యాజ్యాన్ని రిట్ పిటీషన్ గా మార్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణంతో తీవ్ర రద్దీ పెరిగిందని పిటిషనర్ వాదించారు. ఈ మేరకు ఉచిత ప్రయాణంపై ఇచ్చిన జీవో 47ని రద్దు చేయాలని హరీందర్‌ హైకోర్టును కోరారు. అయితే, పిటిషన్‌ ఉచిత ప్రయాణంతో ఇబ్బందులను ఎదుర్కొని పిల్‌ను దాఖలు చేశారని అభిప్రాయపడింది ధర్మాసనం... దీంతో ఈ కేసు విచారణను వాయిదా వేసింది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow