భార్యను కష్టపడి చదివిస్తే మరో పెళ్లి భర్త షాక్..డిస్ట్రిక్ మేజిస్ట్రేట్‌కు లేఖ!
ఓ భర్త తన భార్యను ఉన్నత చదువులు చదివించి ప్రభుత్వ ఉద్యోగంలో చూడాలనుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే తాను కష్టపడుతూ భార్యను బాగా చదివించాడు. ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణనిప్పించాడు. కార్పెంటర్‌గా పని చేస్తున్నప్పటికి ఏ కష్టం భార్య వరకు రానివ్వలేదు.. భార్య కూడా భార్త కోరుకున్నట్టుగానే ప్రభుత్వ ఉద్యోగం సాధించింది... కానీ జాబ్ రాగానే ఆమె భర్తకు మొహం చాటేసి వెళ్లిపోయింది .Sri Media News
ఈ విషయాన్ని ఆ భర్త ఆలస్యంగా తెలుసుకున్నాడు. తీవ్ర మనస్థాపానికి గురైన భర్త మీడియా ముందుకు వచ్చి... తన భార్య తనకు కావాలంటూ కన్నీరుమున్నీరు అయ్యాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఉద్యోగం వచ్చిన తరువాత మారిపోవడం తట్టుకోలేక పోయాడు.
నీరజ్, లేఖాపాల్ ఐదేళ్ల పాటు ప్రేమించుకుని 2022 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. కార్పెంటర్‌గా పనులు చేస్తూ భార్యను చదివించి, గవర్నమెంట్ జాబ్ కోసం ట్రైనింగ్ ఇప్పించాడు.ఇంతవరకు బాగానే ఉంది. 2024 జనవరిలో లేఖా భర్త నీరజ్ దగ్గరకు వచ్చి కాలేజీలో చిన్నపని ఉంది. వెళుతున్నాను అని చెప్పింది. భర్త కూడా సరే వెళ్లిరా.. అని పంపించాడు... సాయంత్రం అవుతుంది. అయిన భార్య లేఖా ఇంకా ఇంటికి రాలేదు. భార్య కోసం అంతా చూట్టు ఉన్న ప్రాంతల్లో వెతికాడు.. ఆమే స్నేహితులు, కుటుంబంలోని సభ్యుల దగ్గర ఉందేమో అని చూశాడు. కానీ అక్కడ కూడా కనిపించలేదు.
ఆమెకు కాల్ చేస్తూ ఉన్నాడు.. ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయ్యలేదు. అంతలో ఆమెకు అకౌంటెంట్‌గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని తెలుసుకున్నాడు నీరజ్. భార్యకు ఉద్యోగం వచ్చింది కాబట్టి... అపాయింట్ మెంట్ లెటర్ తీసుకోవడానికి కలెక్టర్ కార్యాలయానికి వెళుతుందని తెలుసుకోని అక్కడికి చేరుకోగా.. భర్తను చూసిన లేఖా వెనుక డోర్ నుండి వెళ్లిపోయింది. తరువాత ఆమెను కలిసేందుకు చాల సార్లు ప్రయత్నించాడు కానీ.. ఫలితం లేదు... భార్య గురించి తెలుసుకోగా ఆమె మరొకర్ని ప్రేమించి, పెళ్లి చేసుకుందని తెలిసింది... ఈ విషయం తెలిసిన నీరజ్ తట్టుకోలేక పోయాడు. నాకు న్యాయం చేయండి.. నా భార్య నాకు కావాలి అని మీడియా ముందుకు వచ్చాడు. తన భార్యను తిరిగి తనకు ఇప్పించాలని కోరాడు. తరువాత డిస్ట్రిక్ మేజిస్ట్రేట్‌కు లేఖ రాశాడు. అయితే భార్య మాత్రం ఆ పెళ్లి ఫేక్ అని, నీరజ్ తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని లేఖా అంటుంది. కానీ ఇద్దరికి పెళ్లి అయినట్టు పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోల కొన్ని వైరల్ అయ్యాయి. వీటిపై లేఖా స్పందించలేదు. కాగా ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
గతంలో యుపిలో ప్రయాగ్ రాజ్‌లో కూడా ఈ తరహా ఘటన వెలుగు చూసింది. జ్యోతి మౌర్య అనే మహిళను భర్త చదివించగా.. ఉన్నతోద్యోగం రాగానే.. భర్తను వదిలేసి, మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది. మొగుడు అడ్డు తొలగించుకునేందుకు అతడిపై తప్పుడు కేసులు బనాయించింది. బయటకు వచ్చిన భర్త తనకు జరిగిన అన్యాయం గురించి గగ్గోలు పెడితే.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
What's Your Reaction?