కెరీర్ స్టార్టింగ్‌లోనే ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు సుధాకర్.. తమిళ ఇండస్ట్రీలో అప్పటికే ఉన్న స్టార్ హీరోస్‌కు అందని ఓపెనింగ్స్ కలెక్షన్స్, ఊహించని స్టార్‌డమ్ కేవలం మూడు సంవత్సరాలలోనే అందుకున్నారు సుధాకర్.. ఈ ఎదుగుదల తమిళ ఇండస్ట్రీలో కొంతమందికి నచ్చలేదు.. అందుకే సినిమాలు రిలీజ్ కాకుండా చేశారు.. అందుకే తెలుగు ఇండస్ట్రీకి వచ్చి విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వచ్చిన ప్రతి చిన్న వేషాన్ని వేసి.. అలరిస్తూనే ఉన్నారు.. మరో రజినీకాంత్.. ఒక మెగాస్టార్ రేంజ్‌లో ఉండాల్సిన సుధాకర్‌ని తొక్కేసింది ఎవరు? నాటి స్టార్ హీరోయిన్ రాధికతో సుధాకర్ పెళ్లి కాకుండా అడ్డు పడింది ఎవరు? టాప్ హీరోగా ఉన్న సుధాకర్ గారికి కెరియర్ లేకుండా చేసిన సీఎం ఎవరు? అనే నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రండి.
పితుహూ… అంటూ యముడికి మెుగుడు మూవీలో అందర్నీ కడుపుబ్బా నవ్వించిన సుధాకర్ గారి నటన అంత త్వరగా మరిచిపోలేరు తెలుగు ప్రేక్షకులు. సుధాకర్ గారి స్వస్థలం ప్రకాశం జిల్లాలోని మార్కాపురం. తండ్రి గంగమాల రత్నం..ఈయన డిప్యూటీ కలెక్టర్, తల్లి కటాక్షమ్మ.. ఏడుగురు మగ సంతానమున్న ఈ కుటుంబంలో సుధాకర్ గారే చివరివారు. తండ్రి ఉద్యోగ రీత్యా.. రాష్ట్రమంతా తిరిగేవారు.. అందువల్లే సుధాకర్ గారు కర్నూలు జిల్లాలోని కోయిలకుంట్లలో 1959 మే 18న పుట్టారు. చిన్నప్పటి నుంచి బాగానే చదువుకున్నా.. ఇంటర్‌లోకి వచ్చేసరకి.. నాటకాల వైపు మనసు మళ్లింది సుధాకర్ గారికి.. దీంతో.. నటించాలని ఉందని ఇంట్లో చెప్తే.. నాన్న నో చెప్పినా.. తల్లి, అన్నయ్యలు సపోర్ట్ చేశారు.. అలా నటన వైపు వచ్చారు సుధాకర్ గారు.
అలా నటనలో ఓనమాలు నేర్చుకోవటం కోస చెన్నైకి రైలు ఎక్కేశారు.. అయితే అప్పట్లో సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు చిరంజీవి, సుధాకర్, హరిప్రసాద్ చెన్నైలో ఒకే రూమ్‌లో ఉండేవారు. 1977లో చిరంజీవి, సుధాకర్ ఒకేసారి యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యారు. అక్కడి నుంచి ఒకేసారి డిగ్రీ పట్టా పుచ్చుకొని బయటకు వచ్చారు. అయితే యాక్టింగ్ స్కూల్ మధ్యలో ఉన్నప్పుడే తమిళం నుంచి సుధాకర్ కు అవకాశాలు మొదలయ్యాయి.
ఆ సమయంలో దర్శకుడు భారతీ రాజా సుధాకర్‌కు ఛాన్స్ ఇచ్చారు. అలా సుధాకర్ ‘కిళుక్కెమ్ పోంగెమ్ రెయిల్’ అనే చిత్రం ద్వారా హీరోగా ఇండస్ట్రీలో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత.. ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలు, సూపర్ హిట్లతో తమిళనాట స్టార్ హీరోగా మారిపోయారు.. ఎంతలా అంటే.. కేవలం మూడేళ్లలో 40 తమిళ సినిమాల్లో హీరోగా చేసేంతలా.. సంచలన విజయాలతో తమిళనాట సుధాకర్ పేరు మారుమోగింది. ఈయన దూకుడును చూసి తమిళనాడు స్టార్ హీరోలు ఎంజీఆర్, శివాజీ గణేషన్ లాంటి వాళ్లు కూడా భయపడ్డారు. ఒక తెలుగు వాడు తమిళ గడ్డపైకి వచ్చి ఇంత స్థాయిలో పాపులారిటీ సంపాదించుకోవడం అక్కడి దర్శక నిర్మాతలతో పాటు కొందరు హీరోలకు ససేమిరా నచ్చలేదు.అందుకే కేవలం మూడేళ్లలో 40 సినిమాలు చేసి సూపర్ స్టార్‌గా ఎదుగుతున్న సుధాకర్ కెరీర్‌ను బలవంతంగా తొక్కేశారు. అవకాశాలు రాకుండా చేశారు. కేవలం తెలుగువాడు అనే ఒకే ఒక్క కారణంతో సుధాకర్ తమిళ ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయాడు. ముఖ్యంగా ఎంజీఆర్ సుధాకర్‌కి అవకాశాలు రాకుండా, ప్రొడ్యూసర్స్ లేకుండా చేశారన్న రూమర్ చాలా గట్టిగా వినిపించింది అప్పట్లో.
సుధాకర్ నటించిన 40 సినిమాల్లో దాదాపు 30 విజయాలు ఉన్నాయి. అందులో 20 సినిమాలకు పైగా సీనియర్ హీరోయిన్ రాధికతో కలిసి నటించాడు సుధాకర్.
ఈ ఇద్దరి జంట అప్పట్లో తమిళనాట ఒక సంచలనం. ఇద్దరు పెళ్లి కూడా చేసుకుంటారు అనుకున్నారు. అంత పాపులర్ అయింది సుధాకర్, రాధిక జోడి. ఈ క్రమంలోనే సుధాకర్‌కు తమిళనాట అవకాశాలు క్రమంగా తగ్గిపోయేలా చేశారు.. అప్పటి తమిళ స్టార్ హీరోస్..
తమిళంలో అవకాశాలు తగ్గిన తర్వాత తెలుగు ఇండస్ట్రీకి వచ్చాడు సుధాకర్. కెరీర్ మొదట్లో విలన్ వేషాలు వేశాడు. యముడికి మొగుడు సినిమా తర్వాత తనలోని కమెడియన్ బయటికి వచ్చాడు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఏకధాటిగా 600 సినిమాలు చేశాడు.
కెరీర్ పీక్‌లో ఉందనగానే.. సుధాకర్ 2010, జూన్ 29న అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి కోమాలోకి వెళ్లిపోయారు. 2015లో కోలుకున్న ఆయన మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ.. కొన్ని సినిమాలు నిర్మించనున్నట్లు ప్రకటించారు. అయితే అప్పటి నుంచి ఆయన మరణించారంటూ కొన్ని వదంతులు రావడం మొదలైంది. పలు మీడియా సంస్థలు కూడా సుధాకర్ కన్నుమూశారంటూ అదే వార్తను క్యారీ చేశాయి. దీంతో తాను ఆరోగ్యంగానే ఉన్నానని, చాలా సంతోషంగా ఉన్నానని.. దయచేసి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని ఓ వీడియోను రిలీజ్ చేశారు సుధాకర్.
అయితే ఈ వీడియోలో సుధాకర్‌ని చూసిన ఆయన ఫాన్స్ షాక్ అయ్యారు. ఎంతో అందంగా.. ఆరోగ్యంగా ఉండే సుధాకర్ ఇలా అయిపోయారేంటి అంటూ కామెంట్స్ చేశారు కూడా..
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నటి రాధికతో తనపై వచ్చిన రూమర్స్‌పై స్పందించారు.
‘1983 జనవరి 9న తెలుగుదేశం పార్టీ ఏర్పడిన రోజునే నా పెళ్లైంది.. విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో పెళ్లి చేసుకున్నా. పెద్దలు కుదిర్చిన వివాహమే. నేను ఫస్ట్ పెళ్లి చూపుల్లో చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నా. సినిమా వాళ్లంటే రకరకాల రూమర్స్ వస్తుంటాయి.. నా మీద కూడా అప్పట్లో చాలా రూమర్స్ వచ్చాయి. తమిళ్‌లో రాధికతో ఎక్కువ సినిమాలు చేయడం వల్ల.. ఆమె నేను కలిసి తిరుగుతున్నాం అదీ ఇదీ అంటూ భయంకరమైన రూమర్స్ వచ్చాయి. వాటిని నేను పట్టించుకునేవాడ్ని కాదు.
ఇదే కాదు నాకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు. కాఫీ ఎక్కువ తాగుతా.. టీ అప్పుడప్పుడూ.. ఏదైనా ఫంక్షన్ పార్టీలు జరిగినప్పుడు ఓ గ్లాస్ బీరు తాగేవాడిని. అది కూడా ఎక్కువగా తాగింది లేదు. ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండేవాడిని. కానీ ఏదీ చెప్పి రాదు కదా.. ఆరోగ్యం అలా పాడైంది. చావు వరకూ వెళ్లి వచ్చాను.. కోమా నుంచి బయటపడ్డాను. ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు నటుడు సుధాకర్.
ఇప్పుడు ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో తన ఒక్కగానొక్క కొడుకు బెన్నిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు. త్వరలో తన కొడుకు సినిమాల్లోకి రాబోతున్నారని ప్రకటించారు సుధాకర్.
అంతేగాకుండా తనకు అవకాశాలు రాకుండా తమిళనాట కొందరు కుట్ర చేశారని.. అందుకే సూపర్ స్టార్ కావాల్సిన నేను ఒక సాధారణ నటుడిగా మిగిలిపోయాను అంటూ ఆవేదన చెందారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే సుధాకర్ కెరియర్ సవ్యంగా సాగి ఉంటే.. ఈ రోజు ఈయన మరో రజనీకాంత్, చిరంజీవి అయి ఉండేవారు కూడా.. ఏదేమైనా మన వాడు కాదు అనే ఒకే ఒక్క కారణంతో సుధాకర్ కెరీర్‌ను దౌర్జన్యంగా లాగేసుకున్నారు తమిళనాట కొందరు హీరోలు.
సుధాకర్ గారి సినిమాలలో మీకు నచ్చిన క్యారెక్టర్ ఏమిటో కామెంట్ చేయండి.