బైరెడ్డి ఫ్యామిలీలో వార‌స‌త్వ పోరు....పెదనాన్న రాక్.. అబ్బాయి షాక్!

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.. ఈ పేరు తెలియాని తెలుగు వారు ఉండరు. ఈ మాస్ లీడర్ ఏం చేసిన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ అయ్యేది... ఏం మాట్లాడినా సంచలనమే.. తన ప్రసంగాలతో ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టించే నేతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.Sri Media News

Jul 10, 2024 - 18:39
 0  3
బైరెడ్డి ఫ్యామిలీలో వార‌స‌త్వ పోరు....పెదనాన్న రాక్.. అబ్బాయి షాక్!
బైరెడ్డి అంటే జగన్ కు కూడా  ప్రత్యేకమైన అభిమానం. అంతటి నాయకుడు వైసీపీ ఘోర ఓటమి తరువాత ఎక్కడ కనిపించడం లేదు... వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తన పంచ్‌ డైలాగ్‌లతో.. ప్రతిపక్షాలను హడలెత్తించిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు. 2019 నుంచి కర్నూలు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పి... నందికొట్కూరు ఎమ్మెల్యే కంటే ఎక్కువ పాలిటిక్స్‌ చేశారు సిద్ధార్థ రెడ్డి. ఎమ్మెల్యేను సైతం పక్కన పెట్టి.. అన్నీ తానే దగ్గరుండి మరీ పనులు చేయటంతో నిత్యం వార్తల్లో నిలిచేవాడు బైరెడ్డి.

బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాడే... ఆయన తాత బైరెడ్డి శేషశయనారెడ్డి ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రిగా, పెదనాన్న బైరెడ్డి రాజశేఖరరెడ్డి మాజీ ఎమ్మెల్యేగా పని చేశారు. సో పెదనాన్నతో కలిసి..  రాజకీయ ప్రయాణం మెుదలు పెట్టిన సిద్ధార్థ్‌ రెడ్డి.... అయితే పెద్దనాన్నను ప‌క్కన పెట్టి ఈయ‌న వైసీపీలో చేరి.... సొంతంగా రాజ‌కీయాలు చేయ‌డం మొద‌లుపెట్టారు. దీంతో బైరెడ్డి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి త‌న వార‌సురాలిగా కూతురు బైరెడ్డి శ‌బ‌రి రెడ్డిని పరిచయం చేశారు.

బైరెడ్డి కుటుంబానికి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డికి అస్సలు పడదు. జగన్ పేరు చెబితేనే మండిపడే వాడు బైరెడ్డి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అటువంటిది... ఏం జరిగిందో ఎమో తెలియాదు కానీ...  పెదనాన్నకు చెప్పకుండానే సిద్ధార్ద రెడ్డి వైసీపీ కండువా కప్పేసుకున్నాడు. ఈవిషయంపై బైరెడ్డి బహిరంగంగా విమర్శించకపోయినా.. లోకల్ గా సిద్ధార్ధకు సపోర్ట్ ఇవ్వలేదు. ఇలా జరుగుతున్న సమయంలో నందికొట్కూరు నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా పని చేసి.. 2019లో వైసీపీ అభ్యర్థి తోగురు ఆర్థర్‌ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.

దీంతో ఎప్పుడూ తండ్రి చాటు బిడ్డగా ఉండే శబరిని…సిద్ధార్ధరెడ్డి మీద ఉన్న కోపంతోనే రాజకీయాల్లోకి తెచ్చారు. బైరెడ్డి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి... ఈ కోపంతోనే ఎలాగైనా కూతుర్ని రాజకీయాల్లో రాణించేలా… ప్రత్యర్ధిని దెబ్బకొట్టేలా చేయాలని అనుకున్నారు. సిద్ధార్ధరెడ్డిని  ఢీ కొట్టేందుకు శబరిని పులిలా తయ్యారు చేస్తు వచ్చారు బైరెడ్డి. బీజేపీలో చేరి ఆమె రాజకీయ ప్రయణం ప్రారంభించారు. ఇలా ఉండగా... ఇద్దరు పోట పోటిగా రాజకీయల్లో ఎదుగుతూ వచ్చారు...  బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని వైసీపీ ప్రభుత్వం 17 జులై 2021న  రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ అంటే శాప్‌ ఛైర్మన్‌గా నియమించింది.

ఇదిలా ఉంటే... నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే తానే అన్నట్టుగా బిల్డప్ ఇచ్చేవాడు సిద్ధార్థ రెడ్డి... అంతేనా... వైసీపీలో ఎమ్మెల్యే ఆర్థర్‌ని పక్కన పెట్టి.. ఆంతా తానై వ్యవహరించాడు కూడా... దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. తన కులం తక్కువ కాబట్టే.. తనను తక్కువ చూపు చూస్తున్నాడనీ.. పెత్తనం చెలాయిస్తున్నాడని ఎమ్మెల్యే ఆర్థర్‌ బహిరంగంగానే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై ఆరోపణలు చేశారు. ఇది కాస్తా పార్టీ అధిష్టానం దగ్గరికి వెళ్లినా.. ఇద్దరి మధ్యా సఖ్యత మాత్రం కుదరలేదు. దీంతో ఎమ్మెల్యే ఆర్థర్ వైసీపీని వీడి... కాంగ్రెస్‌లో చేరారు ఆర్థర్..  ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి 6 వేల పైచిలుకు ఓట్లు సాధించారు.

ఆర్థర్‌ ఓట్లు చీల్చడంతో.. నందికొట్కూరులో వైసీపీ ఓడిపోవాల్సి వచ్చింది. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆర్థర్‌ని గెలిపించింది తానే అని చెప్పుకున్న సిద్ధార్థ రెడ్డి.. 2024 ఎన్నికల్లో గెలిపించలేకపోయారా అనే చర్చ జిల్లాలో జరుగుతోంది. గతంలో పలు మీటింగ్స్‌లో నందికొట్కూరు నియోజకవర్గంలో తనను కొట్టేవాడే లేడు అన్నట్లు బిల్డప్‌ ఇచ్చారు సిద్ధార్థ రెడ్డి. తనను కాదని ఎవరు గెలవలేరు అన్న కామెంట్లు చేశారు కూడా. ఇలా జరుగుతున్న సమయంలో బైరెడ్డి శబరి ప్రజల్లో తన ఇమేజ్ పెంచుకుంటూ వచ్చి 2024 ఎన్నికల సమయానికి తన బలన్ని బీజేపీలో  తన చూపించుకున్నారు. అయితే 2024 ఎన్నికల్లో టీడీపీ- బీజేపీ- జనసేన కూటమిగా పోటి చేయ్యడంతో అక్క బైరెడ్డి  శబరి 2024 మార్చ్ నెలలో టీడీపీలో చేరి ఏంపీగా గెలిచారు.

తమ్ముడు సిద్ధార్థ రెడ్డి నేను జగనన్నను  ఫాలో అవుతా అని చెప్పి... గుడ్డిగా ఆయన మాటలను ఫాలో అవుతున్నట్లే కనిపిస్తోంది..  సిద్ధార్థ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో మున్సిపాలిటీ ఛైర్మన్‌, కౌన్సిలర్లు పార్టీని వీడుతుంటే.. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చూస్తు ఉండటం తప్ప ఏం చేయ్యలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో.. నందికొట్కూరు నియోజకవర్గ ఇంచార్జి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి శిబిరంలో నేతలు జెండా ఎత్తేస్తున్నా....  సొంత నియోజకవర్గంలో  తన పట్టు నిలుపుకోలేకపోతున్నారు. ఎన్నికల తరువాత ఏకంగా సొంత నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అవుతోంది.

ఛైర్మన్‌తో సహా కౌన్సిలర్లు పార్టీకి గుడ్‌బై చెబుతుంటే.. ఆపలేకపోయారు. దీనికి కారణం రీసెంట్ గా పార్టీ నుంచి వెళ్లి పోయేవారిని మేము ఆపం.. ఎన్ని రోజులని వెళ్లిపోయేవాళ్లని పట్టుకొని ఉంటాం అని జగన్‌ అనడంతో...  జగన్‌ అన్న మాటలను సిద్ధార్థ్‌ రెడ్డి ఫాలో అవుతున్నాడని సెటైర్స్ వేస్తున్నారు ప్రజలు.

నందికొట్కూరులో వైసీపీకి ఎటువంటి అనుమానం రాకుండా..  మున్సిపల్‌ ఛైర్మన్‌. మున్సిపల్ చైర్మన్ సుధాకర్‌ రెడ్డి సహా 16 మంది కౌన్సిలర్లు ఒకేరోజు పార్టీ మార్చేశారు.. అయితే  పార్టీని నమ్ముకుని... బైరెడ్డి, జగన్ అండ ఉంటుందని... కొందరు ఎన్నికల్లో భారీగా ఖర్చు చేశాట. అంతేనా అప్పులు తెచ్చి మరీ ప్రచార ఏర్పాట్లు చేశారట కూడా. తీరా వైసీపీ ఓడిపోయిన తరువాత కొన్ని రోజుల మాత్రమే నియోజకవర్గంలో ఉన్న సిద్ధార్థ రెడ్డి.. హైద్రాబాద్‌కి వెళ్లిపోయారు. కొందరు నేతలు హైద్రాబాద్‌కు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారట. వైసీపీని నమ్ముకొని అప్పుల పాలయ్యామని, తమ పరిస్థితి ఏమిటని అడిగిన వారి నుంచి సమాధానం లేక పోవడంతో....  పార్టీలో ఉండటం కష్టం అనుకున్న వారు ఇలా పార్టీని మార్చేస్తున్నారనిఅంటున్నారు.

గతంలో వైసీపీ అండను చూసుకుని, సిద్ధార్థ రెడ్డి వర్గం చేసిన హంగామా అంతా ఇంతా కాదు.. అటువంటిది ఇప్పుడు వారే...  వైసీపీని వీడి.. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. గతంలో అంతలా ప్రగల్భాలు పలికిన వారే పార్టీ మారుతుండటంతో... స్వయంగా సిద్ధార్థ రెడ్డే.. వారిని పంపుతున్నారనే ప్రచారమూ జరుగుతోంది. అయితే సిద్ధార్థ రెడ్డి సన్నిహితులు మాత్రం.. ఇదంతా అసత్య ప్రచారమని కొట్టిపారేస్తున్నారు. కానీ నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గం నుంచి వలసలు కొనసాగుతాయనే ప్రత్యర్థులు చెబుతున్నారు. ఇప్పటికైనా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అలర్ట్‌ అయ్యి.. పార్టీ క్యాడర్‌ని కాపాడుకుంటారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. పోయే వాళ్లని మేము ఆపము అని స్టేట్‌మెంట్లు పాస్‌ చేసేకంటే.. వారి వెళ్లిపోవటానికి గల కారణాలు అడిగి తెలుసుకుంటే కొంచెం అయినా పార్టీ అధిష్టానం వారికి అండగా ఉన్నదన్న ధైర్యం వస్తుంది. మరి సిద్ధార్థ రెడ్డి ప్రతి కార్యకర్తని కలిసి.. ధైర్యం నింపుతారా.. గతంలో ఉన్న ఫైర్ మళ్లీ ఆయనలో‌ చూస్తామా.. లేదా అన్నది వెయిట్‌ చేయాల్సిందే. బైరెడ్డి ఫ్యామిలీలో జరిగిన జరుగుతున్న వార‌స‌త్వ పోరు ఇప్పుడు రాష్ట్రంలో హట్ టాపిక్ 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow