రామోజీరావు అస్తమయం...మృతికి ప్రముఖుల సంతాపం....
రామోజీరావు మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖు సంతాపం తెలిపారు. ప్రధాని మోదీ, చంద్రబాబు, సీఎం రేవంత్, వెంకయ్యనాయుడు, కిషన్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, సంతాపం తెలిపారు.Sri Media News
మీడియా మెఘల్, ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు తుదిశ్వాస విడిచారు. తెలుగు మీడియా రంగంపై చెరగని ముద్రవేసినా.. ఆయన 88 ఏళ్ల వయస్సులో గుండెసంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్‌సిటీలోని నివాసానికి ఆయన పార్థివదేహాన్ని తరలించారు.
1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకటసుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. అక్కలు రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ తర్వాత ఆయన జన్మించారు. కుటుంబసభ్యులు రామోజీకి.. తాతయ్య రామయ్య పేరు పెట్టారు. బడిలో మాస్టారుకు తన పేరు రామోజీరావు అని చెప్పి.. తన పేరును తనే పెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచే విలక్షణ, సృజనాత్మకత ఉన్న వ్యక్తి ఆయన.
ప్రస్తుతం ఆయన వయసు 88 సంవత్సరాలు. ఈనాడు దినపత్రిను ప్రారంభించి ఆయన అందరికీ సుపరిచితమయ్యారు. ఉషా కిరణ్ మూవీస్ సంస్థను ఏర్పాటు చేసి సినిమాలను కూడా రూపోందించారు. ప్రియా పచ్చళ్ల సంస్థను కూడా ఏర్పాటుచేశారు. మీడియా మొగల్ గా ఆయన పేరుగాంచారు. 1965లో అడ్వర్టైజ్మెంట్ సంస్థను ఏర్పాటు చేసిన రామోజీ రావు అప్పటి నుంచి వెనుదిరగి చూడలేదు. మార్గదర్శిని కూడా ఏర్పాటు చేశారు. ఆయన సుదీర్ఘ కల ఫిలింసిటీని పద్దెనిమిది వందల ఎకరాల్లో నిర్మించారు. హైదరాబాద్ లో సినీ పరిశ్రమకు అవకాశాలను గుర్తించి నాడే ఫిలింసిటీని నిర్మించారు. రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూపు ఆధీనంలో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. 2016లో భారత ప్రభుత్వం రామోజీరావుకు దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ తో సత్కరించింది.
రామోజీరావు మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖు సంతాపం తెలిపారు. ప్రధాని మోదీ, చంద్రబాబు, సీఎం రేవంత్, వెంకయ్యనాయుడు, కిషన్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, సంతాపం తెలిపారు.
"రామోజీ రావు గారు మరణించడం చాలా బాధాకరం. అతను భారతీయ మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు. అతని గొప్ప రచనలు జర్నలిజం, చలనచిత్ర పరిశ్రమ,మీడియాపై చెరగని ముద్ర వేసాయి. రామోజీ రావు భారతదేశ అభివృద్ధి పట్ల చాలా మక్కువ చూపేవారు. రామోజీరావుతో మాట్లాడే అకాశం ఎన్నో సార్లు దక్కింది.మీడియా రంగంలో, సినీ రంగంలో రామోజీ సేవలు మరువలేనివన్నారు ప్రధాని మోదీ. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢసానుభూతి" అని మోదీ ట్వీట్ చేశారు.
"రామోజీ మరణం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. తిరిగి కోలుకుంటారని అనుకున్నా కానీ..ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందనుకోలేదు. రామోజీ మరణం రాష్ట్రానికే కాదు దేశానికి తీరని లోట అని చంద్రబాబు సంతాపం తెలిపారు.
"తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, మీడియా రంగానికి రామోజీగారు చేసిన సేవలు మరువలేనివి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారుకుంటున్నాను" అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీ రావు మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. పలు రంగాల్లో వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యస్థాపకుడిగా వారందించిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. శోక తప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు
ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం దివి కేగింది..ఓం శాంతి అని చిరంజీవి ట్వీట్ చేశారు.
అక్షరయోధుడు రామోజీరావు తుదిశ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఆయన స్థాపించిన ఈనాడు పత్రిక భారతీయ పత్రికా రంగంలో పెను సంచలనమే. అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించారు. రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణంతో భారతీయ చిత్ర పరిశ్రమకు హైదరాబాద్‌ను వేదికగా చేశారు. ఆయన కుటుంబానికి నా తరఫున, జనసేన తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని అన్నారు పవన్.
రామోజీ రావు లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు. మీడియా సామ్రాజ్యాధినేత , భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. ‘నిన్ను చూడాలని’ చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికి మరువలేను. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
మీడియా దిగ్గజం రామోజీరావుకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం తెలిపారు ‘రామోజీ రావు వ్యక్తి కాదు, శక్తివంతమైన వ్యవస్థ. వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగిన వారి జీవితం నుంచి యువతరం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. తెలుగు వారందరికీ రామోజీరావు గర్వకారణం’ అని వెంకయ్య నాయుడు Xలో పోస్ట్ చేశారు.
ఓ రైతు కుటుంబంలో పుట్టి, ఓ యాడ్ ఏజెన్సీలో చిరుద్యోగిగా మొదలైన ఆయన జీవితం ఈ పద్మభూషణ స్థితికి రావడం వెనుక ఓ పెద్ద ప్రస్థానమే ఉంది… కేంద్ర హోం మంత్రి, ముఖ్యమంత్రులు సహా పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం ఆయన్ని దర్శించుకుని, ఆయన ఎదుట వినయంగా కూర్చున్న దృశ్యాలు ఎన్నో... తెలుగు జాతి చరిత్రలో తన కంటూ కొన్ని పేజీలను రూపోందించుకున్న యోధుడు.. రామోజీగారు
What's Your Reaction?