ఆ బిజినెస్‌లో ఫెయిల్ అయ్యాడు... ఎవరికి తెలియని రామోజీ నిజాలు...జగన్ కి రామోజీరావు కి ఉన్న గొడవ ఏమిటి.?

జాతీయ స్థాయి పత్రికలు కానీ ప్రాంతీయ పత్రికలు కానీ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. ఈరోజు పేపర్ ను కొనాలంటే కేవలం పట్టణాల్లో ని బస్ స్టాండ్ లు లేదా ప్రముఖ కూడలిలో మాత్రమే దొరికేవి. కొన్ని సార్లు వారికి పేపర్లు అందకపోతే ఆ రోజు సాయంత్రం లేదా మరుసటి రోజున పేపర్ ను చదివాల్సి వచ్చేది. Sri Media News

Jun 8, 2024 - 14:30
Jun 9, 2024 - 11:09
 0  8
ఆ బిజినెస్‌లో ఫెయిల్ అయ్యాడు... ఎవరికి తెలియని రామోజీ నిజాలు...జగన్ కి రామోజీరావు కి ఉన్న గొడవ ఏమిటి.?
Ramoji rao Biography

రామోజీరావు జీవితం

ఈనాడు రామోజీరావు జీవితం ఓ గొప్ప స్పూర్తి పుస్తకం. సామాన్యుడు అసామాన్యంగా ఎదుగొచ్చని నిరూపించిన గొప్ప వ్యక్తి. యుక్త వయసులో ఆయనకు సామాజిక బాధ్యత అపారంగా ఉండేది. రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య. క్రిష్నా జిల్లా పెదపారుపూడి గ్రామంలో పుట్టారాయన. తండ్రి వెంకట సుబ్బారావు, తల్లి సుబ్బమ్మలకు లేక లేక కలిగిన సంతానం. వీరిది వ్యవసాయ కుటుంబం. ఇద్దరు అక్కల తర్వాత రామోజీరావు 8 ఏళ్లకు నవంబర్ 16, 1936లో పుట్టారు. అందుకే ఆయన్ను గరాభంగా పెంచుకున్నారు. స్కూల్ లో తనకు తానుగా రామోజీరావు అని పేరు పెట్టుకున్నారు. తల్లిదండ్రులు కూడా కాదనలేదు. మొదటి సారి 8వతరగతి చదివేందుకు గుడివాడ వచ్చారాయన. 1951లో హైస్కూల్ చదువు పూర్తి చేశారు. ఆ తర్వాత ప్లస్ టూ తో పాటు బీఎస్సీ కూడా గుడివాడలోనే చదువుకున్నారు. అయితే కళల మీద మంచి ఆసక్తి ఉండేది. బొమ్మలు భాగా వేసేవారు. డిజైన్స్ లో క్రీయేటివిటీ చూపించేవారు. దీంతో విజయవాడలో మొదట ఒక ఉద్యోగానికి ప్రయత్నం చేయగా పిలుపు కూడా రాలేదు. దాంతో ఏం చేయాలా అని కొన్నాళ్ల పాటు ఆలోచించారు రామోజీరావు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి ఒక మార్కెటింగ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్ గా చేరారు. కొన్నాళ్ల పాటు పనిచేసిన తర్వాత రామోజీరావుకు తల్లిదండ్రులు రమణమ్మతో పెళ్లి కుదర్చారు. అయితే ఆమె పేరును రమాదేవిగా మార్చుకున్నారు. ఇద్దరూ అనుకోకుండా పేర్లు మార్చుకుని రామోజీరావు, రమాదేవిలు దంపతులయ్యారు. ఢిల్లీలోనే ఉద్యోగంలోఉన్న  రామోజీరావు దంపతులకు పెద్ద కుమారుడు కిరణ్ పుట్టారు. ఆ సమయంలోనే సంపాదన సరిపోలేదు. భవిష్యత్ పై ఆయన ఆలోచనలు మొదలయ్యాయి. ఢిల్లీలో వ్యాపారాలను చాలా ఆసక్తిగా గమనించారాయన. ఇక కొడుకు పుట్టిన తర్వాత ఏదైనా సొంతంగా వ్యాపారం చేయాలి. తాను నలుగురికి పని కల్పించే స్తాయిలో ఉండాలనుకున్నారు రామోజీరావు. దాంతో ఢిల్లీ నుంచి తిరిగి వచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఇంటిదగ్గరే ఉన్న ఆయన వ్యాపారం చేయాలనుకున్నారు. అయితే మహిళలు మాత్రమే చేసే చిట్టీల వ్యాపారాన్ని భారీగా చేయాలనుకున్నారు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే మార్గదర్శి చిట్ ఫండ్స్. రామోజీరావు చిట్ ఫండ్ ను చాలా జాగ్రత్తగా, భయంతో నిర్వహించేవారు. ఎవరైనా సరే డబ్బు ఇచ్చారంటే దానిని తన కంటే కూడా వేరేవారి కష్టమని నమ్మి జాగ్రత్తగా పద్దులు రాసి సమయానికి ఇచ్చేవారు. అలా ఆయన మార్గదర్శి చిట్ ఫండ్ ను పది మందితో మొదలు పెట్టి వేలాది మందికి విస్తరించారు. తర్వాత 60వేల మంది ఖాతాదారులకు చేరి సక్సెస్ అయింది. అయితే స్వతహాగా రైతు బిడ్డ. రైతులకు ఆధునిక వ్యవసాయం పరిచయాలనుకున్నారాయన. ఆ ఆలోచనల నుంచి పుట్టిందే అన్నదాత మాస పత్రిక. ప్రముఖ వ్యవసాయ అధికారుల సూచనల నుంచి యూనివర్శిటీ పరిశోధకులు, విజయవంతమైన రైతుల కథనాలతో రూపొందిన అన్నదాత కూడాసూపర్ హిట్ అయింది. అప్పుడే ప్రింటింగ్ ప్రెస్ తన చేతిలో ఉంది. జాతీయ స్థాయి పత్రికలు కానీ ప్రాంతీయ పత్రికలు కానీ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. ఈరోజు పేపర్ ను కొనాలంటే కేవలం పట్టణాల్లో ని బస్ స్టాండ్ లు లేదా ప్రముఖ కూడలిలో మాత్రమే దొరికేవి. కొన్ని సార్లు వారికి పేపర్లు అందకపోతే ఆ రోజు సాయంత్రం లేదా మరుసటి రోజున పేపర్ ను చదివాల్సి వచ్చేది. రాజకీయాలు, సమకాలీన అంశాల మీద రామోజీరావుకు మొదటి నుంచి ఆసక్తి ఉండేది. కానీ ఆ చదవాలన్న ఆకలి తీరేది కాదు. సరైన పత్రికలు లేవు. పైగా సమాజంలో ఏదైనా చెడు జరగితో యుక్తవయులో ఉన్న రామోజీరావుకు కోపం వచ్చేది. ఆయన కమ్యూనిస్టు పార్టీలో సభ్యత్వం కూడా తీసుకున్నారు. తనకు పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వర్ రావుల ఆదర్శ జీవితం స్పూర్తి. వారి మాటలు, స్పీచ్ లు, రచనలు ఆయనకు ఎంతో ఉత్సాహాన్ని కలిగించేవి. అలా మనం ఎందుకు పత్రిక పెట్టకూడదు. సామాన్యుడికి మనమే ఎందుకు వాయిస్ కాకూడదు. అవినీతి పరులు, నిర్లక్ష్యంగా పని చేసే అధికారులను ఎందుకు పనిచేసేలా, కర్తవ్య భోదన చేయకూడదనుకున్నారాయన. అలా పేపర్ చదవాలన్న కోరిక తీరకపోగా సామాన్యుడికి సరైన దిన పత్రిక లేదనే కోరికతో ఈనాడు స్థాపించారు రామోజీరావు. 1974, ఆగస్టు 10న ఈనాడును విశాఖపట్నంలో స్థాపించారు. కానీ పత్రిక అంటే ఇవాళ్టి వార్తలను రేపు చదవడం కాదు,. సూర్యోదయానికి ముందే పత్రిక చదివి తమ పనులు తాము చేసుకునేలా ఉండాలనేది ఆయన సంకల్పం. అలా చిన్న ప్రెస్ తో ఈనాడును స్థాపించారు రామోజీరావు. అంతే కాదు ఉదయం ఐదుగంటలకే సైకిల్ మీద పేపర్ ను ప్రతి ఇంటి గేటు ముందు వేసిరావాలని, పేపర్ సభ్యత్వం తీసుకున్నవారికి సూర్యుడు రాకముందే వారి చేతిలో ఉండాలని పని మొదలు పెట్టారు. ఆ వెంటనే తాను కూడా ఉదయమే సైకిల్ మీద తిరిగి ..పేపర్ ఎక్కడ వేస్తున్నారు, ఎలా వేయాలనే దానిపై తాను సైతం తిరిగి దిన పత్రికను సప్లై చేశారాయన. మెల్లిగా పేపర్ చదివేవారి సంఖ్య పెరుగతూ వచ్చింది. ఒకప్పుడు కేవలం డబ్బున్నవారు మాత్రమే చదివేవారు. ఆ తర్వాత సామాన్యులకు కూడా దిన పత్రిక చదవాలన్న కుతూహలం పెంచేలా వార్తలను రాసేవారాయన. ప్రభుత్వ విధానాలను, అవినీతి పరులను చీల్చి చెండాడుతూ జర్నలిజం పవర్ ను ప్రజలకు మొదటి సారి చూపించింది ఈనాడు. దాంతో ప్రతిహోటల్ లో ఈనాడు దర్శనమిచ్చేది. ఈనాడు పేపర్ వేసుకునే హోటల్ ను నడిపి సక్సెస్ కూడా అయ్యారు చాలా మంది. ఫలానా హోటల్ లో పేపర్ ఉంటుందని మరీ వెళ్లి చదివేవారు. అలా విశాఖ నుంచి హైదరాబాద్ వరకు ఈనాడు విస్తరించింది.

మార్గదర్శితో మొదలైన చిట్ ఫండ్ వ్యాపారం కంటే వెయ్యి రెట్ల అభివ్రుద్దితో ఈనాడు ముందుకు సాగింది. అలా ఈనాడు సామాన్యుడి వాయిస్ గా మారింది. ఎన్ని పేపర్లు చదివినా ఈనాడు చదవకుంటే ఏదో వెళితి ఉంటుందనేలా సామాన్య రీడర్ కు ఆయన కిక్ ఇచ్చారు. మొల్లిగా స్పెషల్ పేజీలను పరిచయం చేశారు. మహిళలకు వసుంధర, సినిమా పేజ్, చివరలో స్పోర్ట్స్ పేజీని పరిచయం చేశారాయన. వసుంధర పేజీ పరిచయం తర్వాత రెట్టింపు సంఖ్యలో ఈనాడు సేల్ప్ పెరిగడం ఆరోజుల్లో సంచలనం. కాంగ్రెస్ పార్టీ పాలిట సింహస్వప్నంలా నిలిచింది. ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రభంజనం మొదలు కావడానికి ఈనాడు కూడా కారణం. ప్రతిపక్షంలేకుండా యథేచ్చగా సాగుతున్న కాంగ్రెస్ పాలనకు ఎన్టీఆర్ కు తోడు ఈనాడు కూడా తోడైంది. ప్రజలను కాంగ్రెస్ ఎలా మోసం చేస్తుందో రోజూ వచ్చే వార్తలతో ఎన్టీఆర్ ను గెలిపించారు ప్రజలు. అలా నాటి నుంచి ఈనాడు కీర్తి దేశమంతా పాకింది. దేశంలోనే అత్యధిక సర్క్యులేషన్ గల పత్రికగా కూడా కొన్నాళ్ల పాటు రికార్డ్ క్రీయేట్ చేసింది ఈనాడు. ఆ తర్వాత సినిమా ప్రియుల కోసం సితార, సాహితీ ప్రియుల కోసం చతుర, విపుల లను ప్రవేశ పెట్టి మీడియా రంగంలో దూసుకుపోయారు. అయితే ఇంగ్లీష్ లో కూడా ఇదే రేంజ్ లో జాతీయ స్థాయిలో సంచలనం స్రుష్టించాలనుకున్నారు రామోజీరావు. కానీ న్యూస్ టుడే అంత క్లిక్ కాలేదు. ఇంగ్లీష్ చదివే వారు తక్కువగాఉండటంతో పాటు జాతీయ పత్రికలతో పోటీ పడలేకపోయింది.దీంతో దానిని మూసి వేశారాయన. ఇంకా చెప్పాలంటే మొదటి సారి ఏదైనా పని మొదలు పెడితే ఫెయిల్ కావడం రామోజీరావు చరిత్రలో లేదు . మొదటి సారి న్యూస్ టుడేను మూసేశారు. కానీ ఆ సమయంలోనే ప్రియా ఫుడ్స్ ను స్థాపించి తెలుగు వారి రుచులను బయటి రాష్ట్రాల వారికి కూడా రుచి చూపించిన ఘనత రామోజీరావుదే. వందల రకాల పచ్చళ్ల నుంచి స్నాక్స్ వరకు తయారు చేశారు. తర్వాత ప్రియా పచ్చళ్లకు డిమాండ్ పెరగడంతో ఏకంగా విదేశాలకు కూడా ఎగుమతి చేసి మరో రికార్డ్ క్రీయేట్ చేశారు. ప్రియా ఫుడ్స్ కు జాతీయ స్థాయిలో నాడు ఎన్నో అవార్డ్ లు దక్కాయి. స్వచ్చమైన, క్వాలిటీ తో ఉన్న పచ్చళ్లను దేశ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది తెలుగు రుచుల ప్రియులు ఆదరించారు. ఆ తర్వాత దూరదర్శన్ మాత్రమే ఉన్న తెలుగు వారికి ఈటీవీని పరిచయం చేశారు రామోజీరావు. అప్పటికే జెమిని టీవీ కూడా ఎంటరైంది. మొదట 18 గంటల ప్రసారాల నుంచి 24 గంటల ప్రసారాలతో ఈటీవీ సంచలనం స్రుష్టించింది. సినిమాలు కావాలంటే వారానికి ఒక సారి దూరదర్శన్ లో చూసేవారికి ఎంటర్టెయిన్ మెంట్ కరువు తీర్చింది ఈనాడు. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా ఈనాడు నెట్ వర్క్ ను విస్తరించారు. ఇక ఈనాడుతో పాటు గా సినిమాలు కూడా నిర్మించారు రామోజీరావు. సామాజిక అంశాలతో సినిమాలు తీసేందుకు ఆయన ఆసక్తిచూపించేవారు. అసభ్యత లేకుండా అందరూ చూసేలా సినిమా కథలు ఉండాలనేది రామోజీరావు తపన. అలానే శ్రీవారికి ప్రేమలేఖ నుంచి ప్రతిఘటన, మౌనరాగం, అమ్మ, పీపుల్స్ ఎన్ కౌంటర్ లాంటి సినిమాలను ఉషాకిరణం ఫిలింస్ పేరుతో నిర్మించారు. ఆ తర్వాత మయూరి డిస్ట్రిబ్యూటర్స్ పేరుతో సినిమాల పంపిణీ కూడా చేశారాయన. ఇక దేశంలోనే అతి పెద్ద ఫిల్మ్ సిటీని నిర్మించారు రామోజీరావు. హిందీ సినిమాల నుంచి దేశంలోని ఏ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కాలన్నా కూడా హైదరాబాద్ వచ్చేలా దర్శక, నిర్మాతలు, హీరోలను ఆకర్షించి హైదరాబాద్ ను మూవీ హబ్ గా తీర్చిదిద్దారు.  అయితే జీవితం సక్సెస్ ఫుల్ గా సాగుతున్న తరుణంలో తన చిన్న కొడుకు సుమన్ కేన్సర్ తో చనిపోవడం ఆయన్ను కుంగదీసింది. అప్పుడే మార్గదర్శిలో అక్రమాలు జరిగాయని నాటి వైఎస్ హయాంలో ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కోర్టుల్లో కేసులు వేశారు. దీంతో ఆర్ధిక ఇబ్బందులు మొదలయ్యాయి. పదివేల ఎకరాల్లో ఉన్న ఫిల్మ్ సిటీ ని మెయింటెయిన్ చేయడం అంత సులువు కాదు. దానికి నష్టాలు వచ్చాయి. డాల్ఫిన్స్ హోటల్స్ కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. మార్గదర్శి చిట్ ఫండ్స్ డబ్బులను చట్టానికి విరుద్దంగా ఫిల్మ్ సిటీ కి, ఇతరత్రా వ్యాపారాలకు మళ్లిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో ఏకంగా దేశ వ్యాప్తంగా ఉన్న ఈటీవీ నెట్ వర్క్ ఛానల్స్ ను ముఖేష్ అంబానీకి అమ్మేశారు రామోజీరావు. తర్వాత విపుల, చతుర పత్రికలను కూడా క్లోజ్ చేశారు. అన్నదాత కూడా ఆకోవలోకే వెళ్లిపోయింది. అయితే ఈనాడు, ప్రయా పచ్చళ్లు విజయవంతంగా నడుస్తున్నాయి. ఫిలింసిటీ కూడా నష్టాలను వీడింది. అంతే కాదు ఈటీవీ లైఫ్, అభిరుచి, సినిమా , బాలభారత్ లాంటి చానల్స్ ను ఈ టీవీభారత్ ను మళ్లీ ప్రారంభించారు. అయితే ఏపీలో వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత రామోజీరావు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తన సర్కారును తక్కువ చేసి, ప్రజల్లో చులకన చేసేలా ఈనాడు తప్పుడు వార్తలు రాస్తుందని జగన్ కక్ష కట్టారు. దాంతో రామోజీరావు పై కేసులు నమోదయ్యాయి. మార్గదర్శి చిట్ ఫండ్ ఆఫీసులపై సీఐడీ దాడులతో పాటు చెల్లింపులను కూడా ఆపేల చర్యలు తీసుకున్నారు. ఇక వ్రుద్దాప్యంలో ఉన్న రామోజీరావుకు ఆరోగ్యం భాగోలేకపోయినా కూడా అధికారులు ప్రశ్నించడం, ఆ వీడియోను బయటకు రిలీజ్ చేయడం సంచలనం స్రుష్టించింది.

జగన్ మీద కక్ష్యతో  బాబుకు మద్దతు ఇవ్వడం

ఇక జగన్ మీద కక్ష్యతో  బాబుకు మద్దతు ఇవ్వడం మొదలు పెట్టారు. ఈనాడు పేపర్ నుంచి ఈటీవీ వరకు జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశాయి. జగన్ ను గద్దె దించడమే ఈనాడు లక్ష్యమైంది. జగన్ వర్సెస్ రామోజీరావు పోరుగా కూడా మారింది. ఎన్ని కేసులు పెట్టినా రామోజీరావు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఎంతలా అంటేఏపీలో ఈనాడు పేపర్ , టీవీలు చంద్రబాబుకు మద్దతుగా వార్తలు రాయడం మొదలు పెట్టాయి. అలా రామోజీరావు చంద్రబాబు నాయుడు కూటమి సక్సెస్ అయ్యేందుకు తన వంతు సాయం చేశారు. కూటమి గెలుపును ఆయన చూశారు. అయితే హఠాత్తుగా గుండె సంబంధమైన సమస్య తీవ్రం కావడంతో జూన్ ఆరున స్టార్ హోస్పిటల్ లో జాయిన్ చేశారు కుటుంబ సభ్యులు. స్టంట్ కూడా వేశారు. కానీ ఇతరత్రా సమస్యలు తీవ్రం కావడంతో జూన్ 8న ఉదయం 4 గంటల 50 నిమిషాలకు కన్ను మూశారాయన. ఆయన మరణంతో ఒక మీడియా లెజెండ్ శకం ముగిసిందని చెప్పొచ్చు. చిట్ వ్యాపారం నుంచి మొదలు పెట్టి ప్రియా ఫుడ్స్ వరకు ఆయన ప్రతి వ్యాపారంలో సక్సెస్ అయ్యారు. నష్టాలు రాగానే వాటిని మూసేసి కొత్త వ్యాపారాలు మొదలు పెట్టేవారు. ఎక్కడో ఢిల్లీలో నెలకు 2వందల జీతంతో కెరీర్ మొదలు పెట్టిన రామోజీరావు 8లక్షల కోట్ల ఆస్తులను ఆయన స్రుష్టించారు.

 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow