స్టార్ హీరోతో మమతా మోహన్ దాస్ డేటింగ్....
ఇక తనపై వచ్చిన డేటింగ్ గురించి మాట్లాడుతూ..గతంలో లాస్‌ఎంజిల్స్‌లో ఉన్నప్పుడు ఒకరితో డేటింగ్‌లో ఉన్నా... Sri Media News
సెలబ్రిటీలపై ఎన్నో రూమర్స్ వస్తుంటాయి. కొందరు చూసీ చూడనట్లు ఉంటారు. కొందరేమో అగ్గి మీద గుగ్గిలమవుతారు. మరికొందరేమో కోపమొచ్చినా, బాధేసినా మనసులోనే దాచుకుంటారు. మరికొందరు కెమెరా కంటికి చిక్కితే గానీ ప్రేమ వ్యవహారం బయటపడదు. అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ తనపై వచ్చిన డేటింగ్ రూమర్లపై క్లారిటీ ఇచ్చింది. మరి ఆ బ్యూటీ ఎవరు? డేటింగ్ పై ఏం చెప్పింది? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘యమదొంగ’లో ప్రత్యేక పాత్రతో గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ మమతా మోహన్‌దాస్. ఆ సినిమా తర్వాత ఈ మలయాళీ కుట్టి వరుస అవకాశాలు అందుకొని దక్షిణాది భాషలన్నిటిలో నటించారు. ప్రస్తుతం విజయ్ సేతుపతితో కలిసి ‘మహారాజా’తో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు.
కాగా... జూనియర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాతో ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు పరిచయము అయ్యింది.కేవలం తెలుగులోనే కాకుండా తమిళ మలయాళ భాషల్లో అందరిని మెప్పించింది. యమదొంగ సినిమా తర్వాత వరుస సినిమాల్లో చేసే అవకాశాలను దక్కించుకుంది. కానీ ఆ సమయంలోనే క్యాన్సర్ బారిన పడింది. కొన్నాళ్లపాటు క్యాన్సర్ కి సంబంధించిన చికిత్స తీసుకుంది కూడా.. క్యాన్సర్ తో పోరాటం చేసిన తర్వాత కొంతకాలం సినిమాలకి బ్రేక్ ఇచ్చింది.
కాగా... ఈ ఏడాది రుద్రంగి అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. దాంతో పాటు ప్రస్తుతం మలయాళం లో కూడా పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. కాగా ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతి నటించిన మహారాజ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించింది. ఇకపోతే ఈ సినిమా జూన్ 14న విడుదల కాబోతోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమంలో ఉంది మమత.. సో తాజాగా ఓ ఇంటర్వ్యూలో డేటింగ్‌పై ఆసక్తికర విషయాలు చెప్పింది.
‘‘నాకు మలయాళ చిత్ర పరిశ్రమలో వచ్చిన గుర్తింపుతో చాలా సంతోషంగా ఉన్నా. తాను నటించిన చిత్రాలకు ప్రశంసలు కూడా దక్కాయి. అందువల్లే తమిళం, తెలుగు సినిమాలు చేసే అవకాశం వచ్చింది. మలయాళ ప్రేక్షకులు నాకు అండగా ఉన్నారు. బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి, గౌరీ ఖాన్ నాపై ప్రశంసలు కురిపించారు.’’ అని చెబుతు నవ్వేసింది ఈ అమ్మడు.
ఇక తనపై వచ్చిన డేటింగ్ గురించి మాట్లాడుతూ..‘‘గతంలో లాస్‌ఎంజిల్స్‌లో ఉన్నప్పుడు ఒకరితో డేటింగ్‌లో ఉన్నా. కానీ ఆ రిలేషన్ ఎక్కువకాలం నిలవలేదు. లైఫ్‌లో రిలేషన్ అనేది ఉండాలి. కానీ దానివల్ల వచ్చే ఒత్తిడిని నేను కోరుకోవడం లేదు. అయితే జీవితంలో రిలేషన్ అనేది కచ్చితంగా అవసరమని నేను అనుకోవడం లేదు. ఎవరితోనైనా డేటింగ్‌లో ఉన్నారా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నా. నా లైఫ్ భవిష్యత్తులో ఎలా ఉండనుందో చూద్దాం. ప్రస్తుతం అయితే పార్ట్‌నర్ కోసం వెతుకుతున్నా. కాలంతో పాటే అన్ని విషయాలు ఎప్పుడో ఒకసారి బయటపడాల్సిందే’’ అని వెల్లడించింది.
What's Your Reaction?