విజయశాంతి అందుకే బాలయ్యతో నటించలేదా..? “నిప్పురవ్వ” సినిమా టైంలో ఏమి జరిగింది..?
నందమూరి బాలకృష్ణ బాలకృష్ణ సుదీర్ఘ సినీ కెరీర్‌లో పౌరాణికం, జానపదం, యాక్షన్, ఫాంటసీ ఇలా అన్ని జానర్స్ టచ్ చేశారు. సమకాలీన హీరోలకు సాధ్యంకానీ కథాంశాలతో సినిమాలు తీసి ప్రేక్షకులను మెప్పించారు. కానీ బాలయ్య సినిమాల్లో ‘నిప్పురవ్వ’ కి ఓ ప్రత్యేక స్థానం ఉంది.Sri Media News
అలా అని ఇదేమి బ్లాక్ బస్టర్ మూవీ కాదు. కానీ ఈ ప్రాజెక్టు ప్రారంభమవ్వడమే ఊహించని సంఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. ఈ సినిమాకోసం హాలీవుడ్ రేంజ్ టెక్నాలజీ ఉపయోగించారు కూడా.. అప్పట్లో ఈ సినిమాకు భారీ భారీ బడ్జెట్.. ప్లాన్ కూడా వేశారు. ఆ టైంలో ఈ బడ్జెట్ కొంచెం ఎక్కువే. కథ నచ్చడంతో విజయశాంతి.. తన భర్త శ్రీనివాస ప్రసాద్‌తో కలిసి ఈ సినిమా నిర్మించేందుకు ముందుకు వచ్చారు. బాలయ్య డేట్లు ఇచ్చాడు. కోదండ రామిరెడ్డి దర్శకుడు. బాలయ్య బిరుదు అయిన యువరత్న ఆర్ట్స్ అనే బ్యానర్ స్థాపించి సినిమా నిర్మించాలని విజయశాంతి డిసైడ్ అయ్యింది. కానీ ఈ సినిమా ప్రారంభం నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోంది. హీరోయిన్‌గా దివ్యభారతిని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఎందుకు తప్పించారు. నిర్మతగా వచ్చిన విజయశాంతి హీరోయిన్‌గా నటించాడానికి కారణాలు ఏంటి?. సినిమా షూటింగ్ టైంలో ఫైట్ మాస్టర్ చనిపోడానికి కారణాలు ఏంటి?. విజయశాంతికి, బాలయ్యకూ మనస్పర్థలు రావడానికి ఈ సినిమానే కారణమా?. ఆ తర్వాత వీళ్లు కలిసి నటించలేనంతగా వీరి మధ్య గొడవలు జరిగాయ? అస్కార్ అవార్డ్ వినర్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్ట్‌ర్ అతడు ఎవరు తెలుసుకుందాం.
బాలకృష్ణ హీరోగా రూపొందిన సినిమాల్లో ‘నిప్పురవ్వ’ ఓ ప్రత్యేకం. ముందుగా ఈ సినిమాకు హీరోయిన్ గా దివ్య భారతిని అనుకున్నారు. ‘బొబ్బిలి రాజా’ చిత్రంతో ఆమెకు క్రేజ్ పెరగడంతో.. వరుస ప్రాజెక్టులకు సైన్ చేసింది. దాంతో ఈ ప్రాజెక్టు చేయడానికి ఆమె ముందుకు రాలేదు. ఇక చేసేదేమి లేక ఈ చిత్ర నిర్మాత అయిన విజయశాంతే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అప్పటికే విజయశాంతి – బాలకృష్ణది బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ అనే టాక్ ఉంది. దీంతో ఆమె ఉంటే సినిమాకు మరింత క్రేజ్ వస్తుందనుకున్నారు. బడ్జెట్ లెక్కలేస్తే ఖర్చు అప్పట్లోనే రు. 3 కోట్లు దాటేసింది. చివరకు విజయశాంతి అంత బడ్జెట్ భరించలేనని చెప్పడంతో బాలయ్య కూడా ఓ నిర్మాతగా మారారు. అందుకే తన బిరుదు పేరు మీదే యువరత్న ఆర్ట్స్ స్థాపించారు.
సినిమా షూటింగ్ 1991లో చెన్నైలోని ఏవీఎం స్టూడియోలో ప్రారంభించారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, మళయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఇద్దరూ హాజరయ్యారు. పరుచూరి సోదరులు అదిరిపోయే కథ రెడీ చేసి దర్శకుడు కోదండ రామిరెడ్డికి ఇచ్చారు. అయితే కర్త్యవం సినిమాతో విజయశాంతి పాపులారిటీ పెరిగి.. హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసే స్థాయికి వెళ్లింది. దీంతో తనకు కూడా హీరో బాలయ్యకు ధీటుగా సరిసమానమైన పాత్ర ఉండాలని.. అందుకు అనుగుణంగా కథలో మార్పులు, చేర్పులు చేయాలని దర్శకుడు కోదండ రామిరెడ్డిపై ఒత్తిడి చేయడం ప్రారంభించిందట.
అయితే చాలా పక్కాగా రాసిన స్క్రిఫ్ట్‌ను మారిస్తే ఇబ్బంది అవుతుందని పరుచూరి సోదరులు ఎంత చెప్పినా కూడా విజయశాంతి వినకుండా.. తనకు అనుగుణంగా సీన్లు రాయాలని కోరేవారన్న టాక్ ఉంది. ఆ తర్వాత చెన్నైలోని ఏవీఎం, వాహిని, హైదరాబాద్‌లోని రామానాయుడు, సారథి, అన్నపూర్ణ, పద్మాలయ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. బొగ్గు గనుల ఫ్యాక్టరీ కోసం సింగరేణి ప్రాంతంలో పెద్ద సెట్ వేశారు. ఆ బొగ్గు గనుల ప్రాంతంలోకి భారీగా నీళ్లు వచ్చే టైంలో ముగ్గురు ప్రమాద వశాత్తు మృతి చెందారని.. కొందరికి గాయాలు అయ్యాయన్న వార్తలు వచ్చాయి. ఫైట్ మాస్టర్ కూడా చనిపోయాడు.
ఈ విషయాన్ని సినిమా యూనిట్ బయటకు చెప్పలేదు. చివరక మృతిచెందిన వారి కుటుంబాలు కోర్టులకు వెళ్లడంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది. చివరకు రిలీజ్ డేట్ కూడా వాయిదా పడింది. ఏకంగా రెండు సంవత్సరాలకు పైగా షూటింగ్ జరుపుకుంది. అనుకున్న దానికంటే బడ్జెట్ ఎక్కువైంది. వడ్డీలు కూడా పెరిగిపోయాయి. ఇక కథలో మార్పులు చేయాలని విజయశాంతి కోరడం బాలయ్యకూ నచ్చలేదు. ఈ క్రమంలోనే వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఆ తర్వాత వీళ్లు కలిసి నటించలేనంతగా ఇవి పెరిగిపోయాయి.
ఈ సినిమా షూటింగ్ ఆగిపోవడంతో దర్శకుడు కోదండ రామిరెడ్డి చిరంజీవితో ముఠామేస్త్రికి కమిట్ అయ్యారు. దీంతో ఈ సినిమా మరింత లేట్ అయ్యింది. ఓ రెండు పాటలను అయితే పరుచూరి బ్రదర్స్ ఊటి, ఆస్ట్రేలియాలో షూట్ చేశారు. చివరకు ముఠామేస్త్రి షూటింగ్ అయ్యాక కోదండ రామిరెడ్డి ఫ్రీ అవ్వడంతో అప్పుడు తిరిగి నిప్పురవ్వ షూటింగ్ జరిగింది. సినిమా లేట్ అవ్వడంతో కొన్ని పాటలను స్వరపర్చిన మ్యూజిక్ డైరెక్టర్ బప్పీలహరి బాలీవుడ్‌లో బిజీ అయిపోయాడు. చివరకు రండి రండి కదలిరండి అనే పాటను రాజ్ కోటి స్వరపర్చాడు. చివరికి ఈ సినిమాకు ఏఆర్. రెహ్మన్ సంగీతం అందించారు.
ఇదే మ్యూజిక్ డైరెక్టర్‌గా రెహమాన్ ఫస్ట్ తెలుగు మూవీ. రెహమాన్ సహా ఈ మూవీకి మొత్తం నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేశారు. రాజ్‌కోటి, బప్పిలహరి సాంగ్స్ కంపోజ్ చేయగా...రెహమాన్ బీజీఎమ్ అందించారు. ఓవరాల్‌గా రెహమాన్ కెరీర్‌లో ఇది ఐదో మూవీ. రోజా, జెంటిల్‌మెన్ సినిమాలకు రెహమాన్ అందించిన బీజీఎమ్ నచ్చి కోదండరామిరెడ్డితో పాటు నిర్మాతలు పట్టుపట్టి రెహమాన్‌ను నిప్పురవ్వకు మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నారు.
సినిమా చాలా లేట్ అవ్వడంతో పాటు విజయశాంతి కథలో మార్పులు కోరడంతో బాలయ్య రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో బంగారు బుల్లోడుకు వెళ్లిపోయాడు. 1993 సంక్రాంతికి సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. బయ్యర్లు అడ్వాన్సులు కూడా ఇచ్చారు. చివరకు 1993 విజయదశమి కానుకగా సెప్టెంబర్ 3వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు దర్శక నిర్మాతలు ప్రకటించారు. చివరకు బంగారు బుల్లోడు రిలీజ్ డేట్ కూడా అదే అయ్యింది. ఇక ‘బంగారు బుల్లోడు’ విషయానికొస్తే..జగపతి ఆర్ట్స్ పిక్చర్స్ బ్యానర్ పై నటుడు జగపతిబాబు తండ్రి వి.బి.రాజేంద్రప్రసాద్ ఈ సినిమా తీశారు. రవిరాజ పినిశెట్టి దర్శకత్వం వహించారు. రవిరాజా బాలకృష్ణ కాంబినేషన్ లో మొదటి సినిమా ఇదే. బాలకృష్ణ సరసన రమ్యకృష్ణ, రవీనా టాండన్‌లు హీరోయిన్లుగా నటించారు. గ్రామీణ కుటుంబ కథా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతం పెద్ద ఎస్సెట్.
విడుదలకు ముందే సినిమా మ్యూజికల్‌గా పెద్ద హిట్ అయింది బంగారు బుల్లోడు. భారీ బడ్జెట్ తోరూపొందిన ‘నిప్పురవ్వ’ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అనుకోకుండా రెండు సినిమాల రిలీజ్ డేట్ ఒకటే అయింది. ఇరు పక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో రెండు సినిమాలు సెప్టెంబర్ 3 న రిలీజ్ అయ్యాయి. మీ సినిమా ను వేరే తేదీన రిలీజ్ చేసుకొమ్మని వి.బి.రాజేంద్రప్రసాద్ ని విజయశాంతి అడిగినప్పటికీ ఆయన ఒప్పుకోలేదు. విజయశాంతి బాలకృష్ణ ల మధ్య ఆర్ధిక లావాదేవీల విషయంలో తేడాలు రావడంతో బాలయ్య నిప్పురవ్వ సినిమా గురించి పట్టించుకోవద్దని అభిమానులకు చెప్పినట్టు కూడా కథనాలు పరిశ్రమలో గుప్పుమన్నాయి. వాస్తవాలు ఎలా వున్నప్పటికీ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కాగా బంగారు బుల్లోడు దూసుకుపోయింది. నిప్పురవ్వ విజయశాంతికి నష్టాలు మిగిల్చింది. ఇలా ఎందుకు జరిగిందో ఇప్పటికి ఎవరూ పెదవి బయటికి చెప్పలేదు.
‘నిప్పురవ్వ’ ‘బంగారు బుల్లోడు’ చిత్రాలు 1993 సెప్టెంబర్ 3 నే రిలీజ్ అయ్యాయి. బాలయ్య అభిమానులకు ఏ సినిమా చూడాలి.. ఎక్కడ హంగామా చేయాలో తెలియక షాక్ అయ్యారు. ఒక్క హైదరాబాద్‌లోనే ఏకంగా 50 థియేటర్లలో బాలయ్య సినిమాలు ఆడాయి. అప్పట్లో ఇదో రికార్డు. అయితే నిప్పురవ్వ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. లాంగ్‌రన్‌లో మాత్రం బంగారు బుల్లోడు సక్సెస్ సాధించింది. చివరకు నిప్పురవ్వ సినిమాకు పెట్టిన ఖర్చు ఆ సినిమా రాబట్టేలుదు.
What's Your Reaction?