కేంద్రం కీలక ప్రకటన...! గ్యాస్ సిలిండర్‌పై రూ.300 తగ్గింపు

లోక్ సభ ఎన్నికల సమయంలో బీజేపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుని.... పేద, మధ్యతరగతి కుటుంబాల ఓట్లను టార్గెట్ చేసుకోని పీఎం ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్ పై ఇస్తున్న రూ.300 సబ్సిడీని మరో ఏడాదికి పొడిగిస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించిన విషయం తెలిసిందే.Sri Media News

Jun 25, 2024 - 23:38
 0  2
కేంద్రం కీలక ప్రకటన...! గ్యాస్ సిలిండర్‌పై రూ.300 తగ్గింపు

లోక్ సభ ఎన్నికల సమయంలో బీజేపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుని.... పేద, మధ్యతరగతి కుటుంబాల ఓట్లను టార్గెట్ చేసుకోని పీఎం ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్ పై ఇస్తున్న రూ.300 సబ్సిడీని మరో ఏడాదికి పొడిగిస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించిన విషయం తెలిసిందే... ఇందుకోసం రూ.12వేల కోట్లు ఖర్చు చేశారు కూడా. ఎన్నికల ముందు మార్కెట్ లో గ్యాస్ సిలిండర్ ధర రూ. 955 గా ఉండేది. అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సబ్సిడీ పథకం ద్వారా రూ.300 తగ్గి రూ. 655కే లభించింది.

అయితే అనుకున్నట్టుగానే.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టింది. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ మరోసారి బాధ్యతలు చేపట్టారు. అయితే ఇసారి బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ రాలేదు... ఈ క్రమంలో ప్రజల్లో బీజేపీ గ్రాఫ్ పెంచేందుకు ఇప్పటి నుంచే చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. గతవారమే రైతులకు పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రభుత్వం.. తాజాగా సామాన్యులకు మేలు చేసే మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే వంట గ్యాస్ సబ్సిడీ కొనసాగింపు. ఉజ్వల యోజన ద్వారా అందిస్తున్న రూ. 300 రాయితీని మరో 9 నెలల పాటు కొనసాగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.

అంటే.. ఈ రాయితీని.. వచ్చే ఏడాది అనగా 2025, మార్చి చివర వరకు కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దాంతో పాటు 5 కేజీల సిలిండర్‌ ధరపైన కూడా కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాక 2025, మార్చి తర్వాత నుంచి సబ్సిడీ ఉంచాలా.. కొనసాగించాలా అనే దానిపై కూడా నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌పీజీ సిలిండర్‌ సబ్సిడీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం.. సుమారు 12 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ సబ్సిడీ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తుంది. అలానే పీఎం ఉజ్వల యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ఇచ్చే 12 సిలిండర్ల మీద ఈ సబ్సిడీని అందిస్తుంది. కేంద్రం గ్యాస్‌ సిలిండర్‌ మీద అందించే 300 రూపాయల సబ్సిడీ వల్ల పేద, మధ్య తరగతి వాళ్లకు ఎంతో మేలు చేకూరనుంది. ఈ క్రమంలో కేంద్రం మరో 9 నెలల పాటు సబ్సిడీని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది అనగా 2025, మార్చి వరకు ఈ 300 రూపాయల సబ్సిడీతో గ్యాస్‌ సిలిండర్‌ కొనుగోలు చేయవచ్చు.

 2016 ప్రధాన మంత్రి ఉజ్వల స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చింది బీజేపీ. ఈ పథకంలో భాగంగా సిలిండర్‌తో పాటు గ్యాస్‌ స్టవ్‌ను ఉచితంగా అందిస్తోంది. ఇక ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 10 కోట్ల కుటుంబాలకు ఉజ్వల స్కీమ్‌ సిలిండర్లు అందించినట్లు కేంద్రం వెల్లడించింది.  ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లు సబ్సిడీపై అందిస్తుంది కేంద్రం. గతంలో గ్యాస్ సిలిండర్ ధర ఎక్కువగా ఉండేది. అయితే రాఖీ సందర్భంగా అక్టోబర్ 4న ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు గిఫ్ట్‌గా సిలిండర్ ధరపై ఒకేసారి రూ. 200 తగ్గించారు. ఇదే సమయంలో సబ్సిడీని కూడా రూ. 200 నుంచి రూ. 300 కు పెంచారు. దీంతో ఇప్పుడు ఇతరులతో పోలిస్తే ఉజ్వల అర్హులకు రూ. 300 తక్కువకే గ్యాస్ సిలిండర్ వస్తుంది.

అయితే తాజాగా 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌పై సబ్సిడీని కొనసాగించేందుకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఎన్నికలు ముందే ఉజ్వల యోజన సిలిండర్లపై రూ. 300 సబ్సిడీ ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆ రాయితీని వచ్చే ఏడాది 2025, మార్చి చివరి వరకు కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో పాటు 5 కేజీల సిలిండర్ ధరపైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 2025, మార్చి తర్వాత సబ్సిడీ కొనసాగించాలా వద్దా అనే విషయంపై అప్పుడే నిర్ణయం తీసుకోనుంది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow