టాక్స్ పేయర్లకు కేంద్రం గుడ్ న్యూస్..
పన్ను చెల్లింపుదారులు సెక్షన్ 80D కింద హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంల కోసం రూ.25,000 డిడక్షన్ క్లెయిమ్ చేయవచ్చు. ముఖ్యంగా పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని ఎక్కువ మంది హెల్త్ ఇన్సూరెన్స్‌లో పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించేందుకు ఈ పరిమితిని రూ.75,000కి పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు.
2024లో సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించింది. ఇటీవలే జూన్ 9వ తేదీన ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలోనే వచ్చే నెలలో పూర్తి స్థాయి బడ్జెట్ ను ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఎన్నికలకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే త్వరలో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. 2024-25కి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశ పెట్టనున్నారు. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌కి మరోసారి మోదీ సర్కార్ అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె వచ్చే జులైలో 6వ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
అయితే ఈసారి బడ్జెట్‌లో మధ్యతరగతికి ఉపశమనం కల్పించే నిర్ణయాలు ఉంటాయని వార్తలు వస్తున్నాయి. సెక్షన్ 80C, 80D డిడక్షన్ లిమిట్స్ సవరించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు ఈ నిర్ణయం ఉపశమనం కల్పించనుంది. ప్రభుత్వం చివరిసారిగా 2014-15 కేంద్ర బడ్జెట్‌లో సెక్షన్ 80C డిడక్షన్ లిమిట్ సవరించింది. ఈ మొత్తాన్ని రూ.1 లక్ష నుంచి రూ.1.5 లక్షలకు పెంచింది. చాలా మంది మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు, సెక్షన్ 80C చాలా కీలకమైనది, ఎందుకంటే ఇది వివిధ పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. దీనికి ఉదహరణగా... పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS), స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. అలానే ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌లు (ELSS), యూనిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు (ULIPs), హోమ్ లోన్ ప్రిన్సిపుల్ పేమెంట్స్‌పై కూడా పన్ను ప్రయోజనాలు అందుతాయి.
అయితే ఇక్కడ మనం సెక్షన్ 80C, 80D గురించి తెలుసుకుందాం... ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80సి వేతనం తీసుకునే ఉద్యోగులకు చాలా ముఖ్యమైనది. జీతం ద్వారా ఆదాయం పొందుతున్న ఉద్యోగులు పాత పన్ను విధానంలో రిటర్నులు దాఖలు చేస్తుంటే.. ఈ సెక్షన్ ద్వారా రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఉద్యోగులు తాము చేసే పన్ను ఆదా పెట్టుబడులను అనుసరించి ఈ మినహాయింపు వర్తిస్తుంది.
ఇక.. సెక్షన్ 80D విషయానికి వస్తే... ఆర్థిక సంవత్సరంలో చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియంలపై ₹25,000 వరకు పన్ను మినహాయింపులను అందిస్తుంది. 60 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్‌లకు పన్ను మినహాయింపు పరిమితి ఆర్థిక సంవత్సరానికి ₹50,000కి పెరుగుతుంది.
ప్రస్తుతం పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్థిక బాధ్యతల కారణంగా సెక్షన్ 80సీ పన్ను మినహాయింపు లిమిట్ రూ.1.5 లక్షలు అనేది సరైనది కాదని టాక్స్ పేయర్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న లిమిట్ పెంచడం ద్వారా మధ్య తరగతి ప్రజలకు భారీ ఊరట లభిస్తుందంటున్నారు. జులైలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి ప్రకటనలు చేస్తారో వేచి చూడాల్సిందే. పన్ను చెల్లింపుదారులకు అనుగుణంగానే కేంద్ర నిర్ణయం కూడా ఉండొచ్చని పలువురు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అదే జరిగితే..పన్ను చెల్లింపు దారులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించిందనే చెప్పొచ్చు.
ప్రస్తుతం, పన్ను చెల్లింపుదారులు సెక్షన్ 80D కింద హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంల కోసం రూ.25,000 డిడక్షన్ క్లెయిమ్ చేయవచ్చు. ముఖ్యంగా పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని ఎక్కువ మంది హెల్త్ ఇన్సూరెన్స్‌లో పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించేందుకు ఈ పరిమితిని రూ.75,000కి పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు.
మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడంతో, ప్రజలు క్లియర్, ఎఫిషియంట్ ట్యాక్స్ సిస్టమ్ కోసం ఎదురు చూస్తున్నారు. ట్యాక్స్ శ్లాబ్‌లు తగ్గించడం, ఎగ్జమ్షన్‌లు క్రమబద్ధీకరించడం ద్వారా సాధారణ ప్రజలకు పన్ను విధానాలు సులువుగా అర్థమయ్యేలా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించడానికి, పారదర్శకతను మెరుగుపరచడానికి ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్‌లో డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచడం చాలా కీలకమని నిపుణులు చెబుతున్నారు.
What's Your Reaction?