తన సమాధి తానే నిర్మించుకున్న రామోజీ రావు ...వీడియో వైరల్
ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూసిన చెందిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని నానక్ రామ్ గూడలోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన పార్థివదేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించారు.Sri Media News
ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూసిన చెందిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని నానక్ రామ్ గూడలోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన పార్థివదేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించారు. ఇక రామోజీ అంత్యక్రియలు ఆదివారం నిర్వహించనున్నారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఫిల్మ్‌సిటీలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో రామోజీరావు గారి గురించి అనేక ఇంట్రస్టింగ్ విషయాలు బయిటకు వస్తున్నాయి. తాజాగా ఆయన మరణానికి ముందే సమాధి ఎక్కడ నిర్మించాలో ఆ ప్రదేశాన్ని ఎంపిక చేసుకున్న విషయం బయిటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే...
రామోజీ ఫిల్మ్‌సిటీని స్థాపించి ప్రపంచ చిత్రపటంలో తెలుగు నేలకు చోటు కల్పించారు. అంతేకాదు.. రామోజీ ఫిల్మ్‌సిటీని నిర్మించాడానికి ఆయన ఏంతో కష్టపడ్డారు... అంతేకాదు... రామోజీ ఫిల్మ్‌సిటీపై ప్రేమకుడా పెంచుకున్నారు... అందుకే... ప్రతిష్టాత్మక ఫిలిం సిటీలోనే ఎత్తైన కొండపై ఆయన నివాసం ఏర్పాటు చేసుకొన్నారు. ఆయన అక్కడే ఉంటూ వ్యాపార, రాజకీయాలు, మీడియా వ్యవహారాలపై ఫోకస్ పెట్టారు. అన్ని విషయాలను ఆ ప్రాంతం నుంచే ఫోకస్ చేసే వారు. సీఎంలు, మంత్రులైనా ఆ ప్రాంతానికి వెళ్లి కలవల్సిందే...
అంతగా తన మనసుకు నచ్చిన రామోజీ ఫిల్మ్ సిటీ ప్రాంతంలోనే తన మరణానికి ముందు సమాధిని నిర్మించుకొన్నారు. ఆ ప్రాంతాన్ని తన స్మారక మందిరంగా మార్చుకొన్నారు. ఈ ప్రదేశంలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తన మరణానికి ముందే సమాధి, స్మారక మందిరాన్ని నిర్మించుకొన్న అతి కొద్ది ప్రముఖుల్లో ఒకరిగా రామోజీ రావు ఘనతను సంపాదించుకొన్నారు. ప్రతి మనిషికి మరణం కూడా ఒక వరమని చెప్పిన మహనీయుడిగా రామోజీరావు చరిత్రలో నిలిచిపోతారు.
ఇక ఈ విషయాన్ని... టీడీపీ నేత, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. ఓ వీడియోను విడుదల చేశారు. వీడియోలో రామోజీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే తన సమాధి ఎక్కడ ఉండాలో రామోజీరావు ముందే నిర్ణయించారని ఆర్ఆర్ఆర్ తెలియజేశారు. "ఉదయం లేవగానే రామోజీరావు చనిపోయారనే వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. కొన్ని నెలల క్రితం ఆయనతో రెండు గంటల పాటు మాట్లాడాను. నా జీవితంలో ఆ సమయం మరిచిపోలేనిది. తన సమాధి ఎక్కడ ఉండాలో కొన్నేళ్ల ముందే నిర్ణయించారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని ఓ ప్లేస్‌ని ఎంపిక చేశారు. దాన్ని ఓ ఉద్యానవనంలా తీర్చిదిద్దారు" అని రఘురామకృష్ణరాజు వీడియోలో చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే రామోజీరావు మరణం పట్ల ప్రముఖులు తన సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పటికే మోడీ ట్వీట్ చేయగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సంతాపాన్ని తెలియజేశారు.... తన దూరదృష్టితో ఎన్నో విజయాలు సాధించి సమాజంలో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. పద్మవిభూషణ్ సత్కారం అందుకున్నారన్నారు. మీడియా, సినీ పరిశ్రమలకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతి అని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు.
రామోజీరావు మరణంతో మీడియా, వినోద రంగం ఓ లెజెండ్‌ను కోల్పోయిందన్నారు. ఈనాడు వార్తా పత్రిక, ఈటీవీ న్యూస్ నెట్‌వర్క్, రామోజీ ఫిల్మ్ సిటీ సహా అనేక సంస్థలను స్థాపించి ఎంతో మందికి మార్గదర్శకులుగా నిలిచిన సృజనాత్మక వ్యాపారవేత్త...రామోజీ రావు
What's Your Reaction?