ఆడవాళ్ళు మీ ఆరోగ్యాన్నీ నిర్లక్ష్యం చేస్తున్నారా...! అయితే జాగ్రత్త...

మహిళలు తమ ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోరు. వారు పట్టించుకోని చిన్న సమస్యలు తీవ్రమైన సమస్యలకు దారితీస్తాయి.Sri Media News

May 31, 2024 - 18:04
 0  7
ఆడవాళ్ళు మీ ఆరోగ్యాన్నీ నిర్లక్ష్యం చేస్తున్నారా...!     అయితే జాగ్రత్త...

మహిళలు తమ ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోరు. పట్టించుకోలేదు. వారు పట్టించుకోని చిన్న సమస్యలు తీవ్రమైన సమస్యలకు దారితీస్తాయి. మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అయితే, వారు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మర్చిపోతారు. ఇది చాలా సమస్యలను కలిగిస్తుంది. ఈ లక్షణాలపై శ్రద్ధ చూపకపోతే, అవి ప్రాణాంతకం కావచ్చు. ఈ సందర్భంలో, మహిళల్లో క్యాన్సర్ లక్షణాలను తెలుసుకోండి.రొమ్ము క్యాన్సర్ మహిళల్లో సాధారణ సమస్య. సరైన చికిత్స అందిస్తే చాలా వ్యాధులు నయమవుతాయి. రొమ్ము క్యాన్సర్ లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. రొమ్ము క్యాన్సర్ యొక్క ప్రధాన లక్షణాలు రొమ్ములు మరియు చంకలలో గడ్డలు, రొమ్ము పరిమాణం మరియు ఆకృతిలో మార్పులు మరియు చనుమొనల నుండి తల్లి పాలు కాకుండా ఇతర ద్రవాలు విడుదలవుతాయి. చర్మం కుంగిపోవడం మరియు ఎర్రటి ఛాతీ వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు
ఈ మధ్యకాలం లో ఆడవారు పనుల్లో పడి వారి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. వారు పట్టించుకోని కొన్ని కొన్ని విషయాలే వారి ఆరోగ్యానికి తీవ్రమైన సమస్యలు తీసుకువస్తాయి.. ఇన్ వారిని చూసుకుంటూ వారిని వారి ఆరోగ్యాన్ని పట్టించుకోవడం మర్చిపోతుంటారు. దానివల్ల వారికి అనుకోని సమస్యలు తలెత్తుతాయి. కొన్ని కొన్ని సమస్యలు తీవ్రమై కాన్సర్ ని కూడా కలిగించవచ్చు.

బ్రెస్ట్ కాన్సర్... 

ఇప్పుడు కాన్సర్ ని కలిగించే లక్షణాలు ఎలా ఉంటాయో  చూదాం. బ్రెస్ట్ కాన్సర్ అనేది సాధారణంగా అందరిలో వచ్చే సమస్య, సరైన సమయంలో విధానం లో చికిత్స అందిస్తే ఏ వ్యాధి అయినా నయం చేయవచ్చు. కానీ వాటిని గుర్తించకుండా నిర్లక్ష్యం చేస్తే అవి ప్రాణాంతకం కావచ్చు. బ్రెస్ట్ సైజు లో మార్పులు.. చంకలో గడ్డలు.. తల్లి పాలు కాకుండా వేరే లిక్విడ్స్ రావడం... ఎర్రగా దురద లాంటివి బ్రెస్ట్ కాన్సర్ కి ప్రధాన లక్షణాలు... వీటిని గురించిన వెంటనే చికిత్స తీసుకోవడం వాళ్ళ దీనిని త్వరగా నయం చేయవచ్చు. నిర్లక్ష్యం చేస్తే ఇది ప్రాణాలకే ప్రమాదం.

 ఒవేరియన్ కాన్సర్... 

ఇది కూడా మహిళల్లో సాధారణం గా కనిపించే రెండవ ప్రధాన కాన్సర్.. దీనిని సైలెంట్ కిల్లర్ అని లుడా అంటారు. ఇది అండాశయం లో ట్యూమర్స్ పెరగడం వల్ల సంభవిస్తుంది. దీని లక్షణాలు పొత్తికడుపు వాపు లేదా ఉబ్బరంగా ఉండడం, కొంచెం తిన్నా ఎక్కువ తిన్నట్టుగా అనిపించడం,మలబద్దకం, నొప్పి, ఎప్పుడూ యూరిన్ వెళ్లాలని అనిపించడం ఈ ఒవేరియన్ కాన్సర్ లక్షణాలు... దీనిని కూడా వెంటనే గుర్తించి చికిత్స అందిస్తే నయం చేయవచ్చు. 

రెక్టల్ కాన్సర్.. 

ఇది మరణాలకు దారి తీసే ప్రధాన  కాన్సర్ లలో రెండవది.. ఇది సరైన లక్షణాలు చూపించదు... కానీ దీనిని మీరు మీ పోతి కడుపులో నొప్పి లేదా మలం లో రక్తం,అనుకోకుండా బరువు పెరగడం లేదా తగ్గడం,చిన్న పనులు చేసినా అలసటగా అనిపించడం వీటి ప్రధాన లక్షణాలు.. 

లంగ్స్ కాన్సర్:-

మనం చూసే చాలామంది లో ఈ కాన్సర్ ని ప్రధానంగా చూడవచ్చు... చాలారోజులుగా దగ్గడం, దగ్గు తో పాటు రక్తం పడటం, ఊపిరి సరిగా ఆడకపోవడం, ఆయాసం రావడం,ఆకలి లేకపోవడం, సడెన్ గా బరువు తగ్గడం, ఛాతిలో తీవ్రమైన నొప్పి ఇలాంటివి ఈ కాన్సర్ యొక్క ప్రధాన లక్షణాలు...'

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow