సమంత బండారం బయటపెట్టిన డాక్టర్‌! కౌంటర్‌ ఇచ్చిన బ్యూటీ..

ఏమాయ చేశావే మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి.. అందర్నీ తన మెస్మరైజింగ్‌ యాక్టింగ్‌తో మాయ చేసిన బ్యూటీ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి.. తాను ఏం చేసినా సన్షేషనల్‌గానే ఉండేది.Sri Media News

Jul 6, 2024 - 13:01
 0  2
సమంత బండారం బయటపెట్టిన డాక్టర్‌! కౌంటర్‌ ఇచ్చిన బ్యూటీ..
అక్కినేని నాగచైతన్యతో ప్రేమ పెళ్లి చేసుకున్నప్పుడు టాలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌ అనిపించుకున్నారు..కానీ ఏం జరిగిందో, తెలియదు కానీ ఇద్దరూ విడిపోయి విడాకులు తీసుకోవటంతో టాలీవుడ్‌లో పెద్ద దుమారమే చెలరేగింది. విడాకులు తరువాత అనూహ్యంగా చాలా అరుదైన వ్యాధి బారిన పడినట్లు, అది మయోసైటిస్‌ అనే వ్యాధి అని దానికి చికిత్స తీసుకుంటున్నానని ప్రకటించింది. ఈ కారణంగానే సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది.
సినిమాలకు దూరంగా ఉన్నా.. సమంత క్రేజ్ ఏమాత్రం చెక్కుచెదరలేదు. చేతిలో సినిమాలు లేకపోయినప్పటికీ హెడ్‌లైన్స్‌ అవుతూనే వస్తోంది సమంత. నాగచైత్యన్యతో విడిపోయిన తరువాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుందామె. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'ఖుషి' సినిమా తర్వాత సమంత ప్రేక్షకుల ముందుకు వచ్చింది లేదు.
కొంచెం గ్యాప్‌ అనంతరం వరుస సినిమాలకు సైన్‌ చేస్తూ.. ఫ్యాన్స్‌ బిగ్‌ ట్రీట్‌ ఇచ్చింది సమంత.''హనీ, బన్నీ'' అనే బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. దీంతో పాటు మరో రెండు సినిమాలకు సమంత ఓకే చెప్పింది. కాగా సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటుంది.
సమంతకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 33 మిలియన్ల అభిమానులు సమంతను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు. సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సమంత.. రోజూ ఏదొక పోస్ట్‌ పెడుతూనే ఉంటుంది. అయితే తాజాగా సమంత చేసిన పోస్ట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. సమంత మయోసైటిస్ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.
ఆ ఫోటోలో సమంత నెబ్యులైజర్‌ను ఉపయోగిస్తున్నట్లు ఉంది. ఆ ఫోటో కింద సాధారణ వైరల్‌ మందులకు బదులు హైడ్రోజన్ పెరాక్సైడ్ , డిస్టిల్డ్ వాటర్ కలపడం “మేజిక్ లాగా పనిచేస్తుందని” రాసుకొచ్చింది సమంత. అయితే దీనిపై కొందరు డాక్టర్లు మండిపడుతున్నారు. 
హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒక అన్స్టేబుల్ రసాయనం, ఇది నీరు మరియు ఆక్సిజన్ గా మారుతుంది. అయితే ఈ ఆక్సిజన్ అణువులుగా మారేముందు పరమాణువులుగా ఉన్నప్పుడు ఫ్రీ రాడికల్స్లా పనిచేసి అవి అప్పటికే వైరస్ వలన దెబ్బతిన్న ఊపిరితిత్తుల లోపలి పలుచని పొరల్ని బాగా దెబ్బ తీసి, న్యుమోనియా గానీ, ఏక్యూట్ రెస్పిటేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ కి గానీ దారి తీస్తుంది. ఇదొస్తే డైరెక్టు సావే… అంటూ కొందరు డాక్టర్లు సమంత ఇచ్చిన సలహాపై మండిపడుతున్నారు.
సమంత పోస్ట్‌పై రియాక్ట్ అయిన ఓ డాక్టర్ ఇలాంటివి చెప్తున్న సమంతను జైలులో పెట్టాలని రాసుకొచ్చాడు. ఒక రకంగా వార్నింగ్ ఇచ్చాడు. దీనిపై స్పందించిన సమంత తన డాక్టర్ గైడెన్స్ లో మాత్రమే తను ఇవన్నీ చేశానని చెప్పుకొచ్చింది. తనకు వార్నింగ్ ఇచ్చిన వైద్యుడు.. తన డాక్టర్‌తో చర్చకు వచ్చి ఉంటే గొప్పగా ఉండేదని సమంత అభిప్రాయపడింది. కానీ ఇలా మెసేజ్ చేయడంతో చీప్ అయిపోయాడని ఇండైరెక్ట్ కామెంట్స్ చేసింది సమంత.
తన ఉద్దేశం ఇతరులకు సహాయం చేయడం మాత్రమే కానీ చెడు ఆలోచన లేదని సమంత చెప్పుకొచ్చింది. గతంలో కూడా ఓ డాక్టర్ సమంత ఇచ్చిన టిప్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టడం జరిగింది. డాండెలైన్ హెర్బ్ కాలేయ ఆరోగ్యానికి బెస్ట్‌ మెడిసిన్‌ అని సమంత చెప్పడం సరికాదని అతను తెలిపాడు. అవగాహన లేకుండా ఫాలోవర్స్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని డాక్టర్ తన పోస్ట్ ద్వారా సమంతపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సమంత తన 33 మిలియన్ల ఫాలోవర్లకు తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపణలు చేశాడు. ఇక సమంత చేసిన పోస్టుపై డాక్టర్లు చేసిన కామెంట్స్‌పై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలా హానికరమైన సలహాలు ఎవరైనా సోషల్‌ మీడియా ద్వారా ఇచ్చినప్పుడు, వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అప్పుడే, అందరూ పోస్ట్‌లు చేసేముందు జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు ఉన్న చట్టాలు కూడా అందుకు సరిపోతాయి మరో నెటిజన్ పోస్టు చేశారు. మరికొందరు.. హైడ్రోజన్ పెరాక్సైడ్ చెవి శుభ్రం చేయడానికి కూడా వాడుతుంటాం కదా.. ఇందులో కొత్తేం ఉంది.. తప్పేముందని అంటున్నారు. అయితే సమంత చేసిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది.
కాగా తనపై వస్తున్న విమర్శలకు కామెంట్లకు.. డాక్టర్‌ పెట్టిన పోస్టుకు కూడా సమంత స్పందించింది. ఆ డాక్టర్ కాస్త మర్యాదగా ఉండాలని కోరింది. తన హెల్త్‌కు సంబంధించిన పోస్టులు పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటానని.. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొనే పెడతానని సమంత క్లారిటీ ఇచ్చింది. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow