వందలాది మందిని బలి తీసుకున్నఈ హత్రాస్ బాబా ఎవరు! ఒక పోలీస్ బాబా గా ఎందుకు మారాడు ...
బాబాలేమి పుట్టుకతోనే దేవుడి అవతారం తో రారు కదా. మనోడు కూడా యూపీలోని ఎతా జిల్లా పతియాలీ తాలూక బహదూర్ గ్రామంలో పుట్టాడీ నారాయణ్ సాకార్. Sri Media News
ఉత్తర్ ప్రదేశ్ లో ఘోరం జరిగింది. ఓ బాబా ఏర్పాటు చేసిన ప్రవచనాల కార్యక్రమంలో భారీ తొక్కిసలాట జరిగింది. ఉత్తర్ ప్రదేశ్ లోని హత్రాస్ జిల్లా ఫుల్లెరాయ్ గ్రామంలో జరిగిన ఈ తొక్కీసలాటలో వంద మందికి పైగా చనిపోయారు. రెండువందల మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉండటం విషాదకరం. పుణ్యం కోసం వెళ్తే ప్రాణమే పోయింది. మన దేశంలో సైన్స్ కంటే సోది చెప్పే బాబాల మీదనే నమ్మకం పెట్టుకుంటారు జనం. మాటకారితనం నేర్చిన ప్రతి ఒక్కడు బాబానే. అలాంటి మాటకారే ఈ భోలే బాబా. ఈయన బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మేము కూడా బాబా అవతారం ఎత్తుతామంటారు. నిజమండి బాబు. ఒకప్పుడు ఈయన పోలీస్. దొంగ బాబాలను జైల్లో వేసిన ఈయన ఇప్పుడు ఏకంగా బాబా అవతారం ఎత్తాడు. భోలే బాబా పేరు నారాయణ సాకార్. ఒకప్పుడు పోలీస్ ఉన్నతాధికారులకు సెల్యూట్ లు కొట్టిన ఈయన ఏకంగా సీఎం లనే పిలిపించుకునే రేంజ్ కి ఎదిగాడంటే నమ్మండి.
https://www.youtube.com/watch?v=arIc71lcujk&t=467s
ఈయన ఇంటి దగ్గర ఉండే ఖాళీ ఖుర్చీకి కూడా వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి తమ వెర్రి తో దండం పెట్టుకుని వెళ్తుంటారు. ఆయన ఇంట్లో అయితే కనిపిస్తే చాలు ఏడుస్తూ దండం పెట్టుకుని ఏదో నిజంగానే పై నుంచి స్వామి వచ్చినట్లుగా భక్తులు పులకించిపోతారు. ఆయన నడుచుకుంటూ గేటు దాటి కారెక్కి వెళ్లిపోతుంటే ఉదయాన్నే జనం నేల మీద పొర్లు దండాలు పెడతారు. ఆయన భార్య కనిపించినా దేవతా మూర్తని మొక్కడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఒంటరిగా వస్తే భాగోలేదని జంటగా పెళ్లాంతో వచ్చి మరి ప్రవచనాలు చెబుతున్నారీ బోలే బాబా.
బాబాలేమి పుట్టుకతోనే దేవుడి అవతారం తో రారు కదా. మనోడు కూడా యూపీలోని ఎతా జిల్లా పతియాలీ తాలూక బహదూర్ గ్రామంలో పుట్టాడీ నారాయణ్ సాకార్. ఇతని తండ్రి వ్యవసాయం చేసేవాడు. ఇతను కూడా వ్యవసాయం చేస్తూ చదువుకున్నాడు. తండ్రి దిగువ మధ్యతరగతి కావడంతో ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి జీవితాన్ని మెరుగు పరుచుకోవాలనుకున్నాడు. అలానే కష్టపడి చదివి పోలీస్ ఉద్యోగం సంపాదించాడు. మొదట ఎస్సై గా చాలా పోలీస్ స్టేషన్ లలో పనిచేశారీయన. ఎంతో మంది సీనియర్ లకు సెల్యూట్ కొట్టాడు. ఎన్నో మర్డర్ కేసులను చేధించాడు. ఆ తర్వాత ఇంటెలీజెన్స్ బ్యూరోలో చాలా కాలం పాటు పనిచేశాడు. మరి దొంగబాబాల ఇన్ కమ్ చూసి కుళ్లుకున్నాడేమో కానీ 18 ఏళ్ల సర్వీస్ తర్వాత జీతం బోర్ కొట్టేసిందనుకున్నాడు. వెంటనే 1990లో వీఆర్ఎస్ తీసుకున్నాడు.
ఇక ఈ గ్యాప్ లో నే బాబా అవతారం ఎత్తేందుకు అవసరమైన సిలబస్ మొత్తం చదువుకున్నాడు. భగవద్గీత, మహాభారతం, రామాయణం కథలు నేర్చుకుని, ఇతరుల పుస్తకాలు చదివి తన గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ భార్యతో కలిసి ఓ గుడిసె వేసుకున్నాడు. అక్కడ తనకు దేవుడు కనిపించాడని, అందుకే అన్నీ వదిలేసి ఇలా బతుకుతున్నానని తనను కలిసిన జనాలకు చెబుతుండేవాడు. పైగా కొత్తలో రేబన్ సన్ గ్లాసెస్ పెట్టి, పైన బొట్టు పెట్టి వైట్ అండ్ వైట్ డ్రెస్ లో బాబా గా మారారాయన.
పాత పురాణ కథలకు తనదైన మాటకారి తనం జోడించి చెబుతుంటే వెర్రి జనం చెవులు నిక్కబొడుచుకుని వినడం మొదలు పెట్టారు. ఇలా మెల్లిగా ఐదేళ్లలోనే ఏక్ నెంబర్ బాబా అయ్యాడీ నారాయణ సాకార్. మొదట చాలా స్టైలిష్ బాబా గా పేరు తెచ్చుకున్నారు. ఎంత సేపు, ఆత్మ, పరమాత్మ, పుణ్యం, పాపం అంటూ చెబుతుంటాడు. ఈయన ఫేమస్ డైలాగ్ కూడా ఉంది. ఇలాంటివి మన వాళ్లు ఎంతో మంది దొంగ బాబాల దగ్గర విన్నదే. మనం సంపాదించుకున్న డబ్బును బ్యాంక్ లో వేసుకుంటాం. దానిని జాగ్రత్తగా అవసరమైనప్పుడు తీసుకుని వాడుకుంటాం. పుణ్యం కూడా అంతే. చేసే మంచి పని పుణ్యం కోటాలో ఎకౌంట్ లో పడుతుంది. అదే పాపం చేస్తే మాత్రం ఆ వెంటనే మీరు డెబిట్ కార్డ్ తో తీయకున్నా కూడా పాపం వెంటాడుతుందని అందరికీ అర్ధమయ్యేలా చెవిలో పూలు పెడతారన్నమాట. మొదట ప్రవచనాలతో మొదలు పెట్టిన ఆయన మెల్లిగా పేరు మార్చుకున్నారు. తర్వాత తన పేరు చివరన హరి అని పేరుపెట్టుకున్నాడు. తర్వాత హరి విశ్వాస్. ఆ తర్వాత భోలే బాబా.
అయితే సోషల్ మీడియాలో ఈ బాబా ప్రచారం చేసుకోడు. మొత్తం మౌత్ టాక్ తో గ్రౌండ్ లెవల్ లోనే ప్రచారం చేస్తుంటాడు. మొదట తన భార్యతో కలిసి రిచ్ గా వైట్ అండ్ వైట్ కోట్ వేసుకుని కళ్ల జోడు పెట్టుకుని, మీసాలు తీసేసి లైట్ గా లిప్ స్టిక్ రాసి పైన బొట్టు మెడలో దండతో జనాలకు దర్శనం ఇచ్చేవారాయన. ఆ తర్వాత వైఫ్ తో కలిసి నిండుగా కనిపించి తనకు తోచిన మాటలు చెబుతూ, జనాలకు భక్తి భావం పొంగించి తానే దేవుడయ్యాడు. ఆయన వస్తున్నాడంటే చాలు జనం ...నిజమైన దేవుడు మారు వేశంలో వచ్చినా సైడ్ ప్లీజ్ అని ఈ భోలే భాబాకు దండం పెట్టేంతగా ఎదిగారు.
అయితే ఈయన చాలా జాగ్రత్తగా ఉంటారు. బహుషా పోలీస్ బ్రెయిన్ కదా...దొంగ బాబాల కహానీలు, నేరాలు చూసి తన రూట్ మార్చాడు. జనాలను నమ్మించేందుకు బాబా వేశాలు వేయడు, కాషాయం కట్టడు. ఇక కొత్తలో మోడర్న్ గా ఉండి వయసు పెరిగా తెల్ల చొక్క, తెల్ల ప్యాంట్ వేసుకుని తన భార్యతో కలిసి కూర్చుని ఇక మాటలు చెబుతుంటాడు. జనం ఆహా , ఓహో అని వింటారు. అలా మెల్లిగా యూపీ నుంచి మధ్య ప్రదేశ్ కు ఆ తర్వాత రాజస్తాన్ వరకు ఫేమస్ అయ్యారాయన.
ఈయనకు ఈయన చేపిస్తాడో లేదంటే వేరే వారు చేస్తారో కానీ దూర ప్రాంతాలకు వెళ్లి ప్రవచానాలు ఇస్తుంటారు. వేలల్లో జనం హాజరవుతుంటారు. అది కూడా పెద్దగా ప్రచారం చేయకుండానే. ఇక ప్రచారం చేస్తే పక్కన మోడీ మీటింగ్, రాహుల్ గాంధీ మీటింగ్ ఉన్నా కూడా వాళ్లు ఈగలు కొట్టుకోవాల్సిందే. ఎందుకంటే వారికంటే భోలే బాబా ఫేమస్. ఈయన్ను దర్శించుకున్నా, ఆయన చెప్పే ప్రవచనాలు విన్నా పుణ్యం కలుగుతుందనే ఒక వెర్రి నమ్మకం వారిలో ఏర్పడింది.
ఎక్కడా మీడియాలో కనిపించరు. తన ప్రవచనాలను వీడియో తీయొద్దని చెబుతుంటారు. అయినా కూడా కొంత మంది తీస్తూనే ఉంటారు. కాకపోతే వందల మంది వాలంటీర్లు వీడియోలు తీసే భక్తులను వారిస్తారు. గ్రౌండ్ లెవల్లో తెగ పాతుకు పోయారాయన. ఒక సారి అఖిలేష్ యాదవే ఈయన చెప్పే ప్రవచనాలు కాసేపు విన్నారు. ఆ తర్వాత ఈ బాబా తోపు, ఆయన మానవాళికి మేలు చేస్తున్నాడని నాలుగు డబ్బా డైలాగులు కొట్టి వెళ్లారు. ఇక యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యాక ఈయన హిందు సమాజాన్ని ఉద్దరిస్తున్నట్లుగా ప్రవచనాలు చెబుతుంటారు. ఇక ఈయన ప్రవచనాలంటే అధికారులు కూడా అనుమతిస్తుంటారు. ఎంతలా అంటే కరోనా పీక్స్ లో ఉండగా మనోడు ప్రవచనాలు చెప్పి కరోనా కేసులు పెంచి, మనుషుల ప్రాణాలు తీసిన దేవుడీయన. ఫర్రూకాబాద్ లో సత్సంగ్ ను ఏర్పాటు చేశారు నిర్వాహకులు. కానీ పోలీసులు ఈ భోలే బాబాను వద్దని వారించారు. కానీ రాజకీయ పలుకుబడితో జిల్లా కలెక్టర్ మీద ఒత్తిడి తెప్పించారు. అయినా కూడా 50 మందికే అనుమతించారు కలెక్టర్. కానీ ఏకంగా 50వేల మంది హాజరయ్యారు. అప్పటికే కరోనా పీక్స్ లో ఉంది. కేసులు పెరుగుతున్నాయి. సిటీ మొత్తం జామ్ అయింది. ట్రాఫిక్ కుప్పకూలింది. ఇంకేముంది పోలీసులు నిర్వాహకుల మీద కేసు పెట్టారు. బాబాను వదిలేశారు. ఈ వ్యవహారంపై తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంది యోగీ సర్కారు.
తాజాగా హత్రాస్ జిల్లాలో ఓ ఆధ్యాత్మిక సంస్థ సత్సంగ్ ఏర్పాటు చేసింది. ఫుల్లేరాయ్ గ్రామంలో శివారాధన ఉంటుందని ప్రచారం చేశారు. ఆ తర్వాత భోలే బాబా వస్తున్నారని, ఆయన గొప్ప ప్రవచనాలు ఇస్తారని నిర్వాహకులు ప్రచారం చేశారు. ఆ తర్వాత భజన ఉంటుందని కూడా స్థానికంగా ప్రచారం చేశారు. భక్తులు రావాలని, తాగు నీటి వసతి, భోజన వసతి కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. స్థానిక సబ్ డివిజనల్ ఆఫీసర్ దగ్గర అనుమతి అడిగారు. అంతే కాదు పోలీసు రక్షణ కావాలని కోరారు. మహా అయితే 5వేల మంది వస్తారని మొదట చెప్పారు. దీంతో అనుమతిచ్చారు. పోలీసులు కూడా భద్రతా ఏర్పాట్లు చేశారు. కానీ కట్ చేస్తే 20వేల మంది వచ్చారు. అది కూడా పెద్దగా ప్రచారం చేయకుండానే. భోలే బాబా ను దగ్గర్నుంచి చూసేందుకు అప్పటికే జనం తొక్కుకుంటున్నారు. జనం ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు చాలా సార్లు వారించారు. వాలంటీర్లను అలెర్ట్ చేశారు. అప్పటి వరకు కామ్ గా శివారాధన, భజన జరిగింది. ప్రవచనం ముగిసే సమయానికి ఒక్క సారిగా వెనుక వైపు ఉన్నవారు ముందుకు తోసుకొచ్చారు.
పాపం మహిళలు, చిన్నపిల్లల ఆర్తనాదాలు పెట్టుకుంటూ కింద పడిపోయారు. వారిమీద పడ్డ జనాలు తొక్కుకుంటూ వెళ్లడంతో పాపం ప్రాణాలు కోల్పోయారు. అప్పటి వరకు భక్తితో ఉన్నవారంతా ఆ దేవుడి దగ్గరకే వెళ్లారు. ఓ మూర్ఖుడి సోది వినేందుకు వచ్చి తమ కుటుంబాల్లో విశాదం నిండేలా చేసుకున్నారు. చిన్న పిల్లలు చేతులు విరిగిపోయి, ప్రాణం లేకుండా పడి ఉన్నవారి మ్రుతదేహాలను చూస్తుంటే కన్నీళ్లు రాకమానదు.
అమాయకులైన పేదలు చనిపోయారు. వందల మంది గాయపడ్డారు. మరికొంత మంది తొక్కీసలాటలో స్ప్రుహ కోల్పోయారు. ఈ ఘటన జరగగానే భోలే బాబా మెల్లిగా జారుకున్నాడు. నిర్వాహకులు కూడా పారిపోయారు. అక్కడున్న ప్రజలు సాయం చేశారు. పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్ లను పంపించి వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇప్పటి వరకు వంద మందికి పైగా చనిపోయారు. వందలాది మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మన దేశంలో మృతదేహాలకు, పేదలకు విలువుండదు కదా. వ్యానుల్లో తొక్కుకుని తీసుకెళ్లారు. గౌరవంగా అంబులెన్స్ లను కూడా కావాల్సినన్ని ఏర్పాటు చేయలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం యోగీ ఆదిత్యనాథ్ టైగర్ అని ప్రచారం చేసుకునేవారు ఈ ఏర్పాట్లను, అక్కడి పరిస్థితులను చూసి కంటతడి పెట్టారు. మరీ ముఖ్యంగా చిన్నారుల మరణం వేధిస్తోంది. ఈ పాపానికి బాధ్యులెవరు. పేదల ప్రాణాలకు విలువ ఉంటుందా అంటే ఉండదు.
నాలుగు రోజులైతే అంతా మర్చిపోతారు. జూన్ నాలుగున కూడా ఈ బోలే బాబా మరో కార్యక్రమానికి ఏర్పాట్లు కూడా జరిగాయి. బహుశా పోలీసుల భయానికి దానిని వాయిదా వేసుకుని దాక్కుంటాడనడంలో సందేహం లేదు. మానవ రూపంలో ఉన్నవాడు మనిషే. వాడెవడైనా సరే. వేషం మార్చినంత మాత్రాన, కథలు చెప్పినంత మాత్రాన దేవుడు కాదు, మన కంటే గొప్పవాడు కాదని ఈ జనం ఎప్పుడు అర్ధం చేసుకుంటారో తెలియక తలలు పట్టుకుంటున్నారు మేథావులు. ఇప్పుడు పిచ్చి యువత హీరో లకోసం కొట్టుకుంటున్నారు. హీరో కొడుకులు, మనవళ్లకు కూడా బ్యానర్లు కట్టి ఆరాధిస్తున్నాడు. వాళ్లకు మొహం భాగో లేకున్నా, యాక్టింగ్ రాకున్నా సరే పుట్టుకతోటే పులులై పోతున్నారు. ఈగుడ్డి ఆరాధ్య భావమే వాళ్లను గొప్పవారిని చేస్తుంది. సామాన్యులను వెర్రి పుష్పాలను చేస్తుంది. చివరకు ప్రాణాలు తీస్తుంది. ఈ ఘోరకలికి భాధ్యులెవరో మరి చూడాలి.
What's Your Reaction?