ఇద్దరు భార్యలు కలిసి భర్తకి మూడో పెళ్ళి....
తన భర్త మరో మహిళతో కాస్త చనువుగా ఉంటేనే.. ఏ భార్యా తట్టుకోలేదు. వెంటనే అగ్గిమీద గుగ్గిలమైపోయి, గొడవకు దిగుతుంది. ఇంకోసారి కలిసినా, కన్నెత్తి చూసినా.. బడితపూజ తప్పదంటూ భర్తతో సహా అవతలి మహిళకు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. అలాంటిది మరో పెళ్లి చేసుకునేందుకు అంగీకరిస్తుందా? Sri Media News
కానీ, ఇక్కడ సీన్ రివర్స్. ఇద్దరు భార్యలు. పెళ్లి శుభలేఖలు కొట్టించి అధికారికంగా బాజా బజంత్రీల నడుమా భర్తకు దగ్గరుండి మూడో పెళ్లి చేశారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ మూడో పెళ్లి వివరాలు చూద్దామా..
ఆంధ్ర ప్రదేశ్‌లోని అల్లూరి జిల్లాలో విచిత్ర సంఘటన జరిగింది. పెదబరియలు మండలంలోని కించూరు గ్రామానికి చెందిన సాగేని పండన్నకు 2000 సంవత్సరంలో పార్వతమ్మ అనే మహిళతో వివాహం జరిగింది. కానీ, ఆమెకు సంతానం లేదు. దీంతో 2005లో అప్పలమ్మను పండన్న రెండో వివాహం చేసుకున్నాడు. 2007లో వీరికి ఓ బాబు పుట్టాడు. ఆ తర్వాత ఆమెకు సంతానం లేదు. అయితే, ఒక్క సంతానంతో సంతృప్తి చెందని పండన్న తమ ఇద్దరు భార్యల అనుమతితో మూడో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. లక్ష్మీ అనే మహిళపై పండన్న మనసు పారేసుకున్నట్టు భార్యలకు చెప్పాడు వారిని ఒప్పించాడు....
ఇంకేముంది.. పెళ్లి చేసుకునేందుకు భార్యలు ఇద్దరు కూడా సిద్ధమయ్యారు. పండన్నకు అమ్మానాన్న ఎవరూ లేకపోవడంతో భార్యలే పెళ్లి పెద్దలుగా మారారు. లక్ష్మీ ఇంట్లో పెద్దవాళ్ళని పండన్న భార్యలే ఒప్పించి...ఈ పెళ్ళికి పెద్దలుగా ఆ ఇద్దరు భార్యలు దగ్గరుండి జూన్ 25 2024 న పెళ్లి పత్రికలు ముద్రించి, బ్యానర్లు వేయించి, ఈ వివాహాన్ని ఘనంగా జరిపించారు. ఈ పెళ్లి కార్డు ఇప్పుడు బయటకు రావడంతో నెటిజన్స్.. ఎంత లక్కీ మావ నువ్వు.. ఇలాంటి భార్యలు ఉంటే నిత్యపెళ్లికొడుకులా ఉండచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై పండన్న స్పందిస్తూ, తమ కుటుంబ సంతానం వృద్ధి కోసం తమ ఇద్దరు భార్యలు పెద్ద మనసుతో త్యాగం చేసి తనకు మూడో వివాహం చేశారంటూ తెలిపాడు. ఇంట్లో ఒక భార్యతో వేగడమే కష్టం అటువంటిది పండన్న మూడో పెళ్లి చేసుకున్నాడు. దేశంలో పెళ్లికాని ప్రసాద్‌లు ఎంతో మంది అమ్మాయిలు లేక పెళ్లి కాకా... తలలు పట్టుకుంటుంటే... పండన్న మూడు పెళ్లిళ్లు చేసుకుని పెళ్లికాని ప్రసాద్‌లకు షాక్ ఇచ్చాడు.
గతంలో భర్తకు పెళ్లి చేసిన భార్యలు ఎంతో మంది ఉన్నారు వారి గురించి కూడా తెలుసుకుందాం... పవిత్ర సింగ్ బేడీ అనే 45 ఏళ్ల వ్యక్తి ఛత్తీస్‌గఢ్ లోని బిల్హా విద్యాశాఖ కార్యాలయంలో బీఈవోగా పనిచేస్తున్నాడు. అతడికి 20 ఏళ్ల క్రితం సుధా కౌర్ అనే మహిళతో వివాహం జరిగింది. పవ్రిత సింగ్ ఉద్యోగంలో భాగంగా బిల్హాకు వెళ్లాడు. అక్కడ ఓ మైనర్ బాలికతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఏడేళ్లుగా ఆమెతో శారీరక సౌఖ్యాలు అనుభవిస్తున్నాడు. ఇటీవల ఆమె గర్భం దాల్చింది. 7 నెలల తర్వాత ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పవిత్ర సింగ్‌పై అత్యాచారం కేస్ పెట్టింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా వాడుకున్నాడని ఫిర్యాదు చేసింది.
దీంతో పోలీసులు పవిత్ర సింగ్‌ను స్టేషన్‌కు పిలిపించారు. బాధిత యువతిని పెళ్లి చేసుకోవాలని సూచించారు. అప్పటికే వివాహితుడైన పవిత్ర సింగ్ రెండో పెళ్లి గురించి తన మొదటి భార్యతో మాట్లాడాడు. పెళ్లి చేసుకోకపోతే భర్త జైలుకెళ్లాల్సి ఉంటుందని తెలియడంతో సుధాకౌర్ తన భర్త రెండో పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది. దీంతో మొదటి భార్య సమక్షంలోనే పవిత్ర సింగ్ రెండో పెళ్లి చేసుకున్నాడు.
అంతేకాదు... ఏపీలో కూడా ఇటువంటి ఘటన ఒకటి జరిగింది.... తిరుపతి జిల్లా డక్కిలి అంబేద్కర్ నగర్‌కు చెందిన కల్యాణ్ టిక్ టాక్ లో కడపకు చెందిన విమలతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలసి షార్ట్ వీడియోలు చేస్తూ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు. కొన్నాళ్ళు బాగానే ఉన్న... కొన్ని రోజులకు కళ్యాణ్ మూడీగా ఉండటం గమనించింది భార్య విమల. కారణం ఏంటి అని పలుమార్లు కళ్యాణ్ ను అడుగుతూ ఉండేది విమల. కానీ కళ్యాణ్ భార్యకు ఏం చెప్పలేదు... ఒక రోజు రాత్రి కళ్యాణ్. ఓ రోజు ఓ యువతి ఇంటి కళ్యాణ్ ఇంటికి వచ్చి షాక్ ఇచ్చింది. టిక్ టాక్ ద్వారా కల్యాణ్ కు నిత్య శ్రీల మధ్య సాగిన ప్రేమ వ్యవహారాన్ని విమలకు చెప్పింది నిత్యశ్రీ.
అప్పట్లో టిక్ టాక్ తోనే వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందని చెప్పంది. కొంతకాలం బాగానే సాగిన ప్రేమ వ్యవహారం కొన్ని కారణాల వల్ల బ్రేక్ పడిందని. దీంతో కళ్యాణ్ ఫోన్ కాంటాక్ట్ కూడా తన దగ్గర లేదని.. జరిగిన మేటర్ నేరుగా విమలతోనే చెప్పింది. ప్రియుడిని వదిలి ఉండలేనని ఏడ్చేసింది. ఎలాగైనా తామిద్దర్ని ఒకటి చేయాలని వేడుకుంది. ఈ సీస్ లో విమల రియాక్షన్ మాత్రం ఎవరు ఊహించలేరు... ఏ భార్య చేయని సాహసం విమల చేసేదుకు సిద్దం అయింది. తన భర్త కల్యాణ్ కి ఆయన ప్రేయసి నిత్యశ్రీని ఇచ్చి పెళ్లి చేసేందుకు విమల రెడీ అయింది. అయితే తాను కూడా వారితోనే కలసి ఉంటానంది. ఈ ప్రపోజల్ నిత్యశ్రీకి నచ్చింది. మొదటి పెళ్లాం చేతుల మీదుగా రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ముగ్గురూ కలిసి హ్యాపీగా ఉంటామంటున్నారు.
భారతీయ సాంప్రదాయంలో పెళ్లికి చాలా ప్రాముఖ్యత ఉంది. మూడు ముళ్ల బంధంతో ఒక్కటై నూరేళ్లు కలిసి జీవించాలని కోరుకుంటారు. దాంపత్య జీవితంలో మూడో వ్యక్తి ప్రమేయం భార్య, భర్తలు సహించరు. వివాహేతర సంబంధాలతో ఇటీవల బంధలు విడిపోతున్నాయి. ఇటువంటి సమయంలో భర్తలకు భార్యలే దగ్గరుండి పెళ్లి చేయడం పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
What's Your Reaction?