జెట్ ఫ్లైట్స్ అద్దెకు తీసుకున్న అంబానీ!అతిథులుగా చంద్రబాబు, పవన్...పెళ్లి ఖర్చు ఎంతంటే...?
ప్రపంచ కుబేరుల్లో ఒకడైన ముకేష్ అంబానీ... చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రేండ్ అవుతున్నాడు. దానికి కారణం ఆయన ఓ ఇంటివాడు కాబోతున్నారు. వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌ను వివాహం చేసుకోబోతున్నారు. దీంతో అనంత్ అంబానీ పెళ్లిపై సోషల్ మీడియాలో సర్వత్రా చర్చ జరుగుతోంది. జనవరి 19, 2023న ముంబైలో జరిగిన గోల్ ధన వేడుకలో ఈ కపుల్ అంగరంగ వైభవంగా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే.Sri Media News
కాగా... జూలై 12 2024న ముంబై బాంద్రాలోని జియో వరల్డ్ సెంటర్‌లో హిందూ సాంప్రదాయం ప్రకారం అనంత్ అంబానీ- వీరెన్ మర్చంట్ వివాహం ఘనంగా జరగనుంది. ఇందుకోసం అంబానీ ఫ్యామిలీ భారీగా పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పెళ్లి వేడుకలు మూడు రోజులు జరగనున్నాయి. జులై 12న పెళ్లి, 13న శుభ్ ఆశీర్వాద్ వేడుకలు, జులై 14వ తేదీన మంగళ ఉత్సవం జరగుతుంది. అదే రోజు పెళ్లి రిసెప్షన్ కూడా..
అయితే పెళ్లి కోసం సామాన్య ప్రజలు సైతం పెద్ద స్థాయిలో ఖర్చు చేస్తారు. అలాంటిది అంబానీ.. ఏ రేంజ్లో ఖర్చు చేస్తారో చెప్పవలసిన పనే లేదు... ఈ పెళ్లి కోసం ఏకంగా 1200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ వేడుక కోసం దాదాపు 800 మంది అతిధులు పాల్గొంటున్నరు. ఈ ఈవెంట్ ఒకే చోట కాకుండా ఇటలీ నుంచి బయల్దేరిన భారీ లగ్జరీ షిప్‌లో వివాహ వేడుక జరగనుందని సమాచారం. 800 మంది అతిధులను ఓడలో అలరించడానికి దాదాపు 600 మంది సిబ్బందిని కేటాయించినట్లు తెలుస్తోంది. మూడు రోజుల పాటు ఈ లగ్జరీ షిప్ 4380 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందట.
ఇక ఈ వేడుకకు హాజరయ్యే అతిథుల విషయం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇందులో భాగంగా ఈ వేడుకకు వివిధ దేశాలకు చెందిన అపర కుబేరులు, పలు దేశాల రాజు, రాణులు, వివిధ కంపెనీల సీఈఓలు, పలు దేశాల రాజకీయ ప్రముఖుల హాజరుకానున్నారని తెలుస్తుంది. దీంతో ఈ విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది.
అనంత్ అంబానీ పెళ్లికి వచ్చే అతిథులకు అదిరిపోయే బహుమతులను అందించనున్నారట. కేవలం వేడుక మాత్రమే కాదు.. అవి భారతీయ సాంప్రదాయ కళలను ప్రోత్సహిస్తూ.. వేడుకలకు విలక్షణమైన అర్థం వచ్చేలా, మహాబలేశ్వర్‌లోని అంధులైన కళాకారులు తయారు చేసిన స్పెషల్ కొవ్వొత్తులను వీరి పెళ్లికి వచ్చే అతిథులకు స్పెషల్ గిఫ్ట్స్‌గా ఇవ్వనున్నారట. సెలబ్రిటీలకు, వీవీఐపీలకు కోట్ల విలువైన వాచీలను... మిగిలిన అతిథులకు కశ్మీర్, రాజ్‌కోట్, బనారస్ లో తయారు చేసిన బహుమతులు ఇస్తారట. వీటితో పాటు బనారసీ ఫ్యాబ్రిక్ బ్యాగ్, నిజమైన జరీతో చేసిన జంగల్ ట్రెండ్ చీర కూడా రిటర్న్ గిఫ్ట్‌లుగా ఇవ్వనున్నారని సమాచారం. అంతేకాదు... మన తెలంగాణలోని కరీంనగర్ కు చెందిన కళాకారులు తయారు చేసిన వెండితో చెక్కిన కళాఖండాలను కూడా అతిథులకు బహుమతులుగా అందజేయనున్నారు. అంతేకాదు.. బంధాని దుపట్టా, చీరల తయారీదారు విమల్ మజిథియాకు 4 నెలల ముందుగానే బహుమతులు సిద్ధం చేయాలని ఆర్డర్ ఇచ్చారు. ప్రతి దుపట్టా బోర్డర్ ఒకదానికొకటి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. విమల్ మొత్తం 876 దుపట్టా, చీరలు సిద్ధం చేసి పంపారు. బనారసీ ఫ్యాబ్రిక్ బ్యాగ్, ఒరిజినల్ జరీతో చేసిన జంగల్ ట్రెండ్ చీర కూడా రిటర్న్ గిఫ్ట్‌లుగా ఇవ్వనున్నారు
ఈ వివాహ వేడుకకు రియాల్టీ షో స్టార్లు కిమ్ కర్దాషియాన్, ఖోలే కర్దాషియాన్, ఫ్యూచరిస్ట్ పీటర్ డైమండిస్, ఆర్టిస్ట్ జెఫ్ కూన్స్, సెల్ఫ్-హెల్ప్ కోచ్ జే శెట్టి అతిథులుగా హాజరుకానున్నారు. అంతేనా.. బ్రిటన్ మాజీ ప్రధానులు బోరిస్ జాన్సన్, టోనీ బ్లెయిర్, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ, స్వీడిష్ మాజీ పీఎం కార్ల్ బిల్ట్, కెనడా మాజీ పీఎం స్టీఫెన్ హార్పర్ కూడా ఈ పెళ్లికి రానున్నారు. కేంద్ర క్యాబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రులు, ఇతర వ్యాపారవేత్తలు ఈ పెళ్లికి హాజరు కానున్నారు. ఈ అతిథుల కోసం ఏకంగా మూడు ఫాల్కన్-2000 జెట్‌లను అద్దెకు తీసుకున్నారంట అంబానీ. అంతేకాదు.. 100కు పైగా ప్రైవేట్ విమానాలను ఉపయోగించబోతున్నారంట.
ఈ పెళ్లికి వచ్చే VVIP అతిథుల కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 60 మంది భద్రతా బృందంలో 10 మంది ఎన్‌ఎస్‌జి కమాండోలు, పోలీసు అధికారులు ఉంటారు. 200 మంది అంతర్జాతీయ భద్రతా సిబ్బందిని నియమించినట్లు తెలుస్తోంది. 300 మంది సెక్యూరిటీ సభ్యులు ఉంటారు. BKCలో 100 మందికి పైగా ట్రాఫిక్ పోలీసులు, ముంబై పోలీసు సిబ్బంది పెళ్లి వేడుక వద్ద మోహరించనున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే... పెళ్లిలో పక్షి కూడా వాలకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు.
అయితే జెడ్ ప్లస్ సెక్యూరిటీతో అంబానీ ఫ్యామిలి పెళ్లికి హాజరుకానున్నారు. ఈవెంట్ సమయంలో ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ ఆపరేషన్ సిస్టమ్ సెటప్ చేయబడుతుంది. ఈవెంట్ భద్రతా ఆపరేషన్ ఈ ISOS కేంద్రం నుంచి పర్యవేక్షించబడుతుందని సమాచారం.
ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారని సమాచారం. అలాగే బెంగాల్ ముఖ్యమంత్రి, మమతా బెనర్జీ, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం హాజరవుతున్నారట. వీరితో పాటు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వంటి వారికి సైతం ఆహ్వానాలు పంపించిందట అంబానీ కుటుంబం...
ఇక ఫుడ్ విషాయానికి వస్తే... వివాహ విందు కోసం 10 మందికి పైగా అంతర్జాతీయ చెఫ్‌లను ఆహ్వానించినట్టు తెలుస్తుంది. ఇండోనేషియాకు చెందిన కోకోనట్ క్యాటరింగ్ కంపెనీ 100కి పైగా కొబ్బరి వంటలను సిద్ధం చేస్తుందట. వారణాసిలో ప్రసిద్ధి చెందిన కాశీ ఛాట్ బండార్... కుల్ఫీ, ఫలూదా, టిక్కీ, టమాటా ఛట్, చనా కచోరీ, దహీ పూరి, పాలక్ ఛాట్, బనారస్ ఛాట్... ఇటాలియన్, యూరోపియన్ స్టైల్ ఫుడ్ కూడా అందించనున్నారు. ఈ వేడుకలో 2500 ఫుడ్ వెరైటీలు ఉండనున్నాయి. కాగా జులై 12న శుభ్ వివాహ్, 12న శుభ్ ఆశీర్వాద్, 14న మంగళ్ ఉత్సవ్ వేడుకలు మూడు రోజులు జరగనున్నాయి. మూడు రోజుల పాటు అతిథులకు స్పెషల్ వంటకాలు రుచి చూపించనుంది అంబానీ ఫ్యామిలీ.
ఇక అంబానీ ఇంట పెళ్లి అంటే ఆ మాత్రం ఆర్భాటం ఉంటుందిలే.. అన్నట్టు మరచిపోయాను. గత మార్చిలో మూడు రోజుల పాటు ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అట్టహాసంగా నిర్వహించారు... ప్రీ-వెడ్డింగ్ చాల అట్టహాసంగా చేసిన అంబానీ పెళ్లి ఇంకేంత ఆర్భాటంగా చేస్తారో కదా... అనుకున్నారు చాలమంది. ఇప్పుడు ఆ సమయం వచ్చింది.
What's Your Reaction?