డెక్కన్ క్రానికల్ సంస్థపై దాడికి కారణం! షర్మిల, జగన్ ఒక్కటయ్యారా?
ఏపీలో డెక్కన్ క్రానికల్ సంస్థపై చేసిన దాడి రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ దాడిని టీడీపీ నేతలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో నిజం ఉందా?. ఉన్నట్టయితే విజయవాడ డెక్కన్ క్రానికల్ సంస్థపై టీడీపీ నేతలు ఎందుకు దాడి చేశారు? ఈ వివాదంతో షర్మిల జగన్ ఒక్కటి అయ్యారా? అసలు డెక్కన్ క్రానికల్ సంస్థపై చేసిన దాడి ఎందుకు జరిగింది?Sri Media News
డెక్కన్ క్రానికల్ "అలయన్స్ టేక్స్ యూ-టర్న్ ఆన్ వీ.ఎస్.పీ ప్రైవేటైజేషన్" అని వార్తను ప్రచూరించడంతో టీడీపీ శ్రేణులు కోపంతో పత్రికాఫీసుపై దాడి చేశారు. పేపర్ లో ప్రకటించిన వార్తని తొలగించాలంటూ నినాదాలు చేశారు. డెక్కన్ క్రానికల్ కార్యాలయ బోర్డును తెలుగు విద్యార్థి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు దగ్ధం చేశారు. కొందరు డీసీ కార్యాలయంపై రాళ్లు రువ్వి.. భవిష్యత్తులో ఇలాంటి కథనాలు రాస్తే.. బాగోదంటూ హెచ్చరిస్తూ వాళ్లు బహిరంగంగానే నినాదాలు చేశారు. ఈ పరిస్థితులతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ శ్రేణులు డీసీ ఆఫీస్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియోను డీసీ ఎక్స్ లో పోస్ట్ చేసింది.
ఈ విషయం పై ఐటీ మినిష్టర్ నారా లోకేశ్ స్పందించి... ‘‘విశాఖపట్నం స్టీల్ ప్లాంటు విషయంలో కూటమి ప్రభుత్వం ఎటువంటి యూ టర్న్ తీసుకోదు. మేం హామీ ఇచ్చినట్లుగానే నడుచుకుంటాం. మన రాష్ట్రాన్ని నాశనం చేయాలని కోరుకునే బ్లూ మీడియా సృష్టించిన ఈ తప్పుడు వార్తలను నమ్మవద్దు. డీసీ చేసిన తప్పుడు ప్రచారం పైపార్టీ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలి. డెక్కన్ క్రానికల్ వైజాగ్ కార్యాలయంలో డిస్‌ప్లే బోర్డుపై జరిగిన దాడిని టీడీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ బ్లూ మీడియా సంస్థలపై మేం చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఆ వార్తలు అస్సలు సరికానివి. అసంబద్ధమైనవి. వాస్తవాలు కానే కావు’’ అని నారా లోకేశ్ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
ఇదంత ప్రభుత్వంపై వైసీపీ కుట్ర అని... విశాఖ బ్రాండ్ ఇమేజ్ ను నాశనం చేయడానికి బ్లూ మీడియా జగన్ కలిసి రాశారంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో డెక్కన్ క్రానికల్ కథనంపై రాష్ట్ర ప్రజలు ఫోకస్ పెట్టారు. అయితే నారా లోకేశ్ చేసిన ఆరోపణల పైన ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు... ‘‘డెక్కన్ క్రానికల్ పత్రిక కార్యాలయంపై టీడీపీకి చెందిన వ్యక్తులు దారుణంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. మీడియాను అణచివేసేందుకు టీడీపీ గుడ్డిగా చేసిన మరో ప్రయత్నం ఇది. కొత్త పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్య ఉల్లంఘన నిరంతరం జరుగుతోంది. దీనికి సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలి.. అని ట్విట్ చేశారు.
దీనికి సపోర్ట్ చేస్తూన్నట్టుగా... జగన్ బాటలో టీడీపీపై వైఎస్ షర్మిల కూడా కూటమిపై ఎటాక్ చేశారు. ‘‘విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోలేక ఎదురు ఈ చర్యలా?. మేలుకోకపోతే రేపు ప్రజలు మీకు జవాబు చెప్తారు. దమ్ముంటే మోడీని నిలదీయండి, అంతేకానీ నిలదీసే గొంతులపై ఉక్కు పాదం మోపొద్దు. ప్రజాస్వామ్యం కోసం పాటుపడే పార్టీగా కాంగ్రెస్ ఇటువంటి దాడులను కచ్చితంగా వ్యతిరేకిస్తుంది’’ అంటూ షర్మిల ట్విట్ చేశారు. అయితే మొన్నటిదాకా జగన్ నే టార్గెట్ చేసిన షర్మిల ఇప్పుడు జగన్ బాటలో టీడీపీపై విరుచుకు పడ్డారు. ఈ ఘటనతో జగన్ అభిప్రాయంతో ఏకీభవించి వైఎస్ షర్మిల మద్దతిచ్చారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇదిలా ఉంటే.. విశాఖ స్టీల్ ప్లాంట్ పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలన్న కేంద్రం నిర్ణయానికి టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రచారం జరుగుతుంది. దీనిపై ది ఫైనాన్స్ ఎక్స్‌ప్రెస్ ఓ వార్తను రాసింది. టీడీపీ సీనియర్ లీడర్ ఈ విషయాన్ని ధృవీకరించారని స్పష్టం చేసింది. ఈ అంశంపై విశాఖ ఎంపీ, లోకేష్ తోడల్లుడు భరత్ మాట్లాడిన ఓ వీడియో కూడా ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని తాము హామీ ఇచ్చింది నిజమేనని..కానీ బీజేపీతో కూటమిలో ఉండడం వల్ల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఇబ్బందులుంటాయని భరత్ చెప్పుకోచ్చారు.
అయితే ఈ దాడి ఘటనపై విశాఖ డెక్కన్ క్రానికల్ ఉద్యోగులు ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తమ కార్యాలయంపై దాడికి పాల్పడి కార్యాలయ ఆస్తులకు పెట్రోల్ పోసి నిప్పటించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటుకరాళ్లతో కార్యాలయ అద్దాలు, పూలకుండీలను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. ఉద్యోగులతో దురుసుగా ప్రవర్తించడంతో పాటు దుర్భాషలాడినట్టు ఫిర్యాదులో వివరించారు. దాడికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను సైతం పోలీసులకు అందజేశారు.
What's Your Reaction?