పవన్ భార్య అన్నా లెజినోవా ఎవరు?
పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజెనోవా చాల మందికి తెలుసు. కానీ ఆమె గురించిన విషయాలు చాలా తక్కువ మందికి మత్రమే తెలిసి ఉంటుంది. లెజెనోవా ఎవరితోను ఎక్కువగా ఇంటరాక్ట్ కారు. ఆమె కేవలం తన బంధుమిత్రులతోనే మాట్లాడతారు.Sri Media News
కానీ అన్నా లెజినోవా.. అదేనండీ.. పవన్ కల్యాణ్ గారి మూడో భార్య.. విషయంలో అలా జరగలేదు.. ఓ సైడ్ డ్యాన్సర్‌గా పాటలో కనిపించి.. ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ని పెళ్లాడారు. అన్నా లెజినోవా పవన్‌కు ఎలా పరిచయం అయ్యిందనే డౌట్ చాలా మందికి ఉంటుంది. అసలు ఈ అన్నా లెజినోవా ఎవరు? ఎక్కడ పుట్టింది? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అనే విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా?
అన్నా లెజినోవా 1980 ఆగస్ట్ 3న రష్యాలోని మాస్కోలో ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలో పుట్టింది. అయితే ఆమె చిన్నప్పుడే.. తల్లిదండ్రులు విడాకులు తీసుకొని విడిపోయారు.
లెజినోవాకు ఇద్దరు చెల్లెల్లు, ఒక తమ్ముడు ఉన్నారు. తండ్రి లేకపోవటం, తల్లి సంపాదన కుటుంబ పోషణకు సరిపోయేది కాదు. దీంతో.. హైస్కూల్ తరువాత చదువు ఆపేసి.. మోడల్‌గా మారింది లెజినోవా. మోడలింగ్ చేస్తే.. నాలుగు రాళ్లు సంపాదిస్తే.. తల్లి సంపాదనకు తన సంపాదన తోడవుతుందనీ, కుటుంబం హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంది.
ఇలా మోడలింగ్ చేస్తుండగా యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్ రావటంతో.. యాక్టింగ్‌లో ఆరు నెలల పాటు ట్రైనింగ్ తీసుకుంది. ఆ తరువాత మాస్కోలోని థియేటర్ ప్లేలో చిన్న చిన్న పాత్రలు చేసేది. ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశం నుంచి షూటింగ్స్ కోసం మాస్కోకు వెళ్లినా.. థియేటర్ ప్లేలో యాక్టింగ్ చేసే వాళ్లే.. ఆ సినిమాల్లో సైడ్ యాక్టర్స్‌గా, డ్యాన్సర్స్‌గా కనిపించేవారు. మీరు ఎప్పుడైనా సినిమాల్లో గమనిస్తే.. సినిమా స్టోరీ లైన్ గాని ఫారిన్‌లో ఉంటే.. అప్పుడు ఫారన్ యాక్టర్స్ కనిపిస్తారు కదా.. వారంతా ఇలా థియేటర్ ప్లేలో మెంబర్‌షిప్ ఉన్నవాళ్లే యాక్ట్ చేస్తారు.
ఇలా మన ఇండియా నుంచి షూటింగ్‌కు వెళ్లినా.. వారే యాక్ట్ చేస్తారు.. అలా చాలా బాలీవుడ్ సినిమాల్లో అక్కడకక్కడ కనిపించింది లెజినోవా. ఇదిలా ఉండగా.. తీన్మార్ మూవీలో కొంత పార్ట్‌ని రష్యాలో షూటింగ్ చేశారు. ఆ సినిమాలోని ఓ పాటను అక్కడే ఉన్న ఓ పబ్‌లో షూట్ చేశారు. ఆ పాటకు ఫారిన్ మోడల్స్, జూనియర్ ఆర్టిస్టులు కావాల్సి వచ్చింది. అలా అక్కడ థియేటర్ ఆర్టిస్టులను 200 మందిని తీసుకున్నారు. అందులో వచ్చిన వారిలో అన్నా లెజినోవా కూడా ఒక్కరు. ఇక తీన్మార్ సినిమాలో ఉన్న బార్బీ సాంగ్‌లో 3 నిమిషాల 45 సెకండ్స్ వద్ద వైట్ ఫ్రాక్ వేసుకొని కేవలం రెండు సెకన్లు మాత్రమే కనిపిస్తుంది లెజినోవా. అలా ఆ సాంగ్ ద్వారా పరిచయం అయిన అన్నా లెజినోవా.. పవన్‌కు దగ్గర అయ్యింది. కానీ మీడియా మాత్రం ఆ సాంగ్‌లో మెయిన్ డ్యాన్స్‌రగా చేసిన డెయినా మార్క్స్‌తో పవన్ క్లోజ్‌గా ఉంటున్నారని వార్తలు వచ్చాయి.
లెజినోవా ఆర్థిక కష్టాలు తెలుసుకున్న పవన్.. సాయం చేయాలని అనుకున్నారు. దీంతో లెజినోవాను.. హైదారాబాద్‌కు తీసుకువచ్చి.. ఓ ఇంటిని అద్దెకు తీసుకొని, ఆమెను అందులో ఉంచారు. అప్పటికే మెుదటి భార్యతో విడాకులు తీసుకొని.. రేణూ దేశాయ్‌ని పెళ్లి చేసుకున్నాడు పవన్. పెళ్లికి ముందే సహజీవనం చేసిన పవన్-రేణూలకు అకీరా పుట్టాడు.. ఆ తరువాత పెళ్లి చేసుకున్న పవన్-రేణూలకు ఆద్య పుట్టింది. ఇదిలా ఉండగా.. తీన్మార్ సినిమాలో రెండో హీరోయిన్‌గా సెలక్ట్ అయిన పూనమ్ కౌర్‌తో పవన్‌కు ఎఫైర్ ఉందనీ.. ఆ సంబంధం ఉన్న కారణంగానే ఆ సినిమాలో హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యిందన్న వార్తలు వచ్చాయి. అంతేగాకుండా.. ఈ సినిమాకు డైరెక్టర్ త్రివిక్రమ్ కాకపోయినా.. అన్నీ దగ్గరుండి చూసుకుంది మాత్రం త్రివిక్రమే.. పవన్-పూనమ్ కౌర్ మధ్య వ్యవహారం నడిపించింది త్రివిక్రమ్ అనీ.. పవన్ గురించి త్రివిక్రమ్‌తో పూనమ్ మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ సైతం బయటకు వచ్చాయి. ఇవన్నీ రేణూ దేశాయికి తెలియటంతో.. పవన్ నుంచి విడిపోవాలని అనుకొని దూరంగా ఉండటం స్టార్ట్ చేసింది. పవన్‌కు దూరం అయితే అయ్యింది కానీ పిల్లల గురించి ఆలోచించి విడాకులు తీసుకోలేదు.. కానీ.. పవన్ మాత్రం.. అన్నా లెజినోవాకి ఈ టైమ్‌లోనే దగ్గరయ్యాడు. అలా వీరికి ఓ పాప కూడా జన్మించింది. ఈ విషయం తెలియటంతో.. రేణూ పవన్‌కు విడాకులు ఇచ్చేశారు.
అయితే ఇప్పుడు అన్నా లెజినోవాతో కూడా మనస్పర్థలు వచ్చాయని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ టైమ్‌లోనే బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ షోలో మూడు పెళ్లిల్ల విషయంపై ఓపెన్ అయ్యారు పవన్. తన మెుదటి పెళ్లి ఫ్యామిలీ ఇష్టప్రకారం జరిగిందనీ, అసలు ఆ టైమ్‌కి పెళ్లి అంటే ఏంటో కూడా తెలియలేదని అన్నారు. ఆ తర్వాత మొదటి భార్యతో మనస్పర్థలు వచ్చాయని విడిపోయామని చెప్పుకొచ్చారు. ఇక రెండో పెళ్లి విషయానికొస్తే రేణూతో భేదాభిప్రాయాలు రావడం కారణంగా విడాకులు తీసుకున్నామని చెప్పుకొచ్చారు. ఇక అసలు మరో పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు అనీ.. ఒక యోగిలా మారిపోవాలని అనుకున్నట్లు చెప్పుకొచ్చారు పవన్. అందుకు పూర్తిగా సన్నద్ధమవుతున్న సమయంలో అనుకోకుండా తన మూడో పెళ్లి జరిగింది అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
ఇదంతా పక్కన పెడితే.. అన్నా లేజీనావో ఆస్తుల గురించి కూడా ఓ హాట్ డిస్కషన్ ఉంది. ఆమె పేరుటే ఏకంగా రూ. 1600 కోట్ల పైచిలుకు ఆస్తులు ఉన్నాయట. ఆమె పేరిట ఎన్ని కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయన్న సందేహాలు చాలా ఉన్నాయి. అయితే 2011 నుంచి పవన్ కొన్ని ఆస్తులను ఆమె పేరుతో కొంటూ వచ్చారట. అయితే రష్యాలో ఆమె మోడల్ కమ్ నటిగా ఉన్నప్పుడు కొన్ని ఆస్తులను సంపాదించుకున్నారు. పవన్ మాత్రం ఆమె పేరుట సింగపూర్‌లో కోట్లాది రూపాయల ఆస్తులు కొని రిజిస్టర్ చేయించారట. 11-12 ఏళ్ల కాలంలో ప్రతి ఏటా పవన్ కొన్ని ఆస్తులను లెజినావో పేరిట కొంటూ రావడంతో వాటిని విలువ విపరీతంగా పెరిగిపోయిందట. సింగపూర్‌లో ఉన్న ఆస్తుల విలువే కోట్లలో ఉంటుందని చెబుతున్నారు. కానీ అన్నా లెజినోవా ఆస్తులపై వస్తున్న ఈ రూమర్స్ ఎంత వరకు నిజమో కూడా తెలియదు.. నిజంగా అంత ఆస్తి ఉందో లేదో కూడా ఎవరికీ తెలియదు.. ఈ విషయాలపై పవన్ కూడా ఎప్పుడూ స్పందించలేదు.
పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజెనోవా చాల మందికి తెలుసు. కానీ ఆమె గురించిన విషయాలు చాలా తక్కువ మందికి మత్రమే తెలిసి ఉంటుంది. లెజెనోవా ఎవరితోను ఎక్కువగా ఇంటరాక్ట్ కారు. ఆమె కేవలం తన బంధుమిత్రులతోనే మాట్లాడతారు.
2011 సంవత్సరంలో తీన్మార్ సినిమా చిత్రీకరణ సమయంలో లెజెనోవాని పవర్ స్టార్ మొదటిసారిగా కలిశారు. ఆ సమయంలోనే పవన్, అన్నా లెజెనోవా మధ్య ప్రేమ చిగురించింది. వీళ్ళిద్దరూ కొన్నేళ్ల పాటు డేటింగ్ కూడా చేసారు. ఆ బంధాన్ని వివాహబంధంగా మార్చాలనుకున్నారు. వెంటనే పవన్ తన 2వ భార్య రేణుదేశాయ్‌కి విడాకులు ఇచ్చి 2013 సెప్టెంబర్ 30న హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో లెజెనోవాను పెళ్లాడాడు పవర్ స్టార్. వీరిది మతాంతర వివాహం. పవన్ కళ్యాణ్ హిందువు కాగా అన్నా లెజినోవా క్రిస్టియన్. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వారి వివాహం జరిగింది. అప్పటి నుంచి అన్నా లెజినోవా రష్యా సంప్రదాయాన్ని పూర్తిగా వీడి భారతీయ మహిళగా మారిపోయింది. కాటన్ వస్త్రాలను ధరిస్తూ సాదాసీదా జీవితాన్ని గడుపుతూ అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే పెళ్లయిన కొత్తలో లెజెనోవా పవన్‌తో కలిసి డిన్నర్‌కు వెళ్లేది కానీ.. ఎప్పుడూ కూడా పబ్లిక్‌గా ఏ ఈవెంట్‌కు వెళ్లిన సందర్భాలు లేవు. అంతే కాదు లెజెనోవా ఎక్కువగా ఎవరితోను కలవలేరు. సోషల్ మీడియాలో ఆమె ఎక్కడా ఫోటోలు అప్‌లోడ్ చేసిన దాఖలాలు కూడా లేవు. అయితే మొదటి సారి చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లిలో అన్నా లెజినోవా సాంప్రదాయమైన భారతీయ వస్త్రధారణలో కనిపించి అందరినీ సర్‌ప్రైజ్ చేసింది.
అన్నా లెజినోవాకు భారతీయ సంప్రదాయాల పట్ల పెద్దగా అవగాహన లేనప్పటికీ హిందు సాంప్రదాయాలు తెలుసుకొని, పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత పవన్‌కి హారతి పడుతూ, వీర తిలకం దిద్దుతూ అందరిని ఆశ్చర్యపరిచారు. అంతేకాదు ఎప్పుడైన ఈవెంట్స్ వస్తే భారతీయ సాంప్రదాయం ఉట్టి పడేలా చీరతో కనిపిస్తారు.
ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలవడం, జన సేన వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించడంతో పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా, అకిరా నందన్‌లు చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఇక చిరంజీవి కనిపించగానే.. పవన్ కళ్యాణ్ చెప్పుల్ని వదిలేసి మెగాస్టార్ కాళ్ల మీద పడిపోయాడు. అన్న దగ్గర్నుంచి ఆశీర్వదాన్ని తీసుకున్నాడు. అన్నా లెజినోవా సైతం చిరంజీవికి పాదాభివందనం చేశారు. పవన్ కళ్యాణ్ తన అమ్మకి, వదినమ్మకి పాదాభివందనం చేసే సమయంలో చెప్పులు వదిలేశాడు. ఆ చెప్పుల్ని అన్నా లెజినోవా చేతుల్తో పట్టుకుని అలా వెనకలా నిల్చుండిపోయారు. ఆ సన్నివేశం చూసిన ప్రతి ఒక్కరు వదినలాంటి భర్య ఉంటే ఏ భర్త ఓడిపోడు అని అంటున్నారు. అంతేకాదు... అభిమానులు అన్నా లెజినోవాను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
ప్రతి క్రిస్టమస్‌కు లెజెనోవా పుట్టింటికి వెళతారని తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ మూడో భార్య లెజెనోవాకు కూడా విడాకులు ఇవ్వబోతున్నాడు అనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చాల్ చేశాయి. లెజెనోవా తన పిల్లలతో కలిసి సింగపూర్‌లో ఉంటుందనీ.. అలాగే మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఎలాంటి ఈవెంట్లో కూడా అన్నా లెజ్నోవా పాల్గొనక పోవడంతో నిజంగానే పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవాని దూరం పెట్టాడు అంటూ వార్తలు గట్టిగా వినిపించాయి... అంతేకాదు... పిఠపురంలో పవన్ కట్టుకున్న ఇంటికి లెజెనోవా ఎందుకు రాలేదు.. అని పోతినే మహేశ్ వైసీపీ శ్రేణులు చేసిన ఆరోపణాలకు అన్న లెజినోవా భర్త గెలుపుతో బయటకు వచ్చి సమాధనం ఇచ్చారు. దీంతో రాజకీయంగా పవన్ ఇమేజ్ పెరిగింది. ట్రోలర్స్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ఈ సన్నివేశంతో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న దుష్ప్రచారానికి ముగింపు పడింది.
పవన్ విడాకుల వార్తలు రావడానికి మరొక కారణం.అన్నా లెజ్నోవా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన రాజకీయ వ్యవహారాల్లో ఎక్కడికి వెళ్లినా కూడా ఆమె దిష్టి తీసి బొట్టు పెట్టి పంపించేది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ రాజకీయాల పనిమీద ఎక్కడికైనా వెళ్లినప్పుడు అన్నా ఎదురుగా వచ్చి ఆయనకు దిష్టి తీసి మరి పంపించేది. అలాంటిది ఇప్పుడు ఆయన వారాహి యాత్ర చేస్తున్నప్పుడు కూడా అన్న లేజ్నోవా పాల్గొనలేదు. అందేకాదు...గత కొద్ది రోజులుగా అసలు ఇండియాలోనే అన్న లేజ్నోవా కనిపించక పోవడంతో వేణు స్వామి చెప్పినట్లు పవన్ కళ్యాణ్ మూడో భార్యకు కూడా విడాకులు ఇచ్చి నాలుగో పెళ్లి చేసుకోబోతున్నాడు కావచ్చు అంటూ వార్తలు జోరుగా వినిపించాయి.
What's Your Reaction?