కర్ణుడి గురించి సినిమాల్లో దాచిన నిజం!కర్ణుడు మహాభారతంలో హీరో... విలన్?
ప్రభాస్ నటించిన‘కల్కి 2898 AD’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ వద్దు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మైథలాజికల్ స్టోరీకి సైన్స్ ఫిక్షన్ జోడించి విజువల్ వండర్స్ క్రియేట్ చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్.Sri Media News
అయితే ఈ సినిమాఈ రేంజ్ రెస్పాన్స్ రావడానికి మహాభారతం సీక్వెన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా విడుదలైన రోజు నుంచి అందరు కర్ణుడు గురించి తెలుసుకోవాలని గుగూల్‌లో తెగా సర్చ్ చేస్తున్నారు. అయితే మహాభారతంలో కర్ణుడు చేసిన తప్పేమిటి..? కర్ణుడు మహాభారతంలో హీరోనా విలన్ఆ అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం...
కర్ణుడు దాన గుణం కలవాడు. వీరగుణం కలవాడు.. శూరుడిగా ప్రకాశించినవాడు... అందుకనే దాన వీర శూర కర్ణుడిగా పేరు పొందాడు. అదుంకనే “కర్ణుడి లేని భారతమా?” అని నానుడీ వచ్చింది.. కూడా. స్నేహానికి చిరునామా కర్ణుడు. తనను నమ్మిన దుర్యోధనుడి వెంట మరణం వరకు ఉన్నాడు. దుర్యోధనుడితో స్నేహం కోసం ధర్మాన్ని ఎదరించి, తన ప్రాణాలను వదిలాడు అని ఇప్పటి వరకు అనేక సినిమాల్లో చూపిస్తే చూశాం. కానీ నిజానికి కర్ణుడు ఎన్నో తప్పులు చేశారు. కానీ వాటిని సినిమాల్లో చూపించడం లేదు అందుకే ఇప్పటికి మయసభలో ద్రౌపది దుర్యోధనుడిని చూసి నవ్వింది అందుకే పగతీర్చుకోవడం కోసం ద్రౌపదీ వస్త్రాపహరణం జరిగిందని అనుకుంటారు చాల మంది... సినిమాల్లో కూడా ఇలానే చూపిస్తారు... కానీ ఇది..వాస్తవం కాదు... నిజం సినిమల్లో మీరు చూసేది ఓ కట్టు కథ... ఈ సినిమాల్లో చాలా సన్నివేశాలు...ప్రేక్షకులను మెప్పించేందుకు రాసినవే కానీ వాస్తవంగా మహాభారతంలో ఇవేమీ లేవు.
మరి అసలు విషయం ఏంటి? అనుకుంటున్నారా..? అదే చెప్తున్న వినండి... ద్రౌపదీ వస్త్రాపహరణం జరగడానికి కారణం కర్ణుడు. మయసభకు వెళ్లిన దుర్యోధనుడు పాండవుల సంపద, వైభవం చూసి భరించలేకపోతాడు. పాండవులను రాజ్యం నుంచి తరిమేయాలని పన్నగం పన్నుతాడు. అదిసాధ్యం కాదు అని దుర్యోధనుడికి తెలుసు? అందుకే మాయాజూదంతో అయితే పాండవులను ఓడించి రాజ్యం నుంచి పంపించవచ్చు అని భావించి....ధృతరాష్ట్రుడి దగ్గరకు వచ్చి తన ప్లాన్ చెబుతాడు... కానీ దానికి ధృతరాష్ట్రుడు ఒప్పుకోడు... దుర్యోధనుడు ప్రాణం తీసుకుంటానని బెదిరించి ఒప్పిస్తాడు. అలా మాయాజూదం ప్రారంభమైంది. ఇక్కడే సినిమల్లో ఓ పెద్ద కల్పిత కథను చేర్చి చూపించారు... పాచికలు వేసే సీన్‌లో పందాలు ధర్మరాజు వేసినట్టు చూపిస్తారు..కానీ మహాభారతంలో అస్సలు ధర్మరాజు పాచికలు ముట్టుకోలేదు..ఇది నమ్మకం కలగడం లేదు కాదా కానీ ఇదే నిజం... నిజానికి ఇరువైపులా పందాలు వేసింది శకుని మాత్రమే. మొత్తం 20 పందాలు వేస్తాడు. అందులో ఆఖరిగా వేసే 20వ పందెంను ద్రౌపదిమీద వేస్తాడు. పందేంలో పాండవులు ఓడిపోతారు. దీంతో దుర్యోధనుడు తన సేవకుడు ప్రేతగామిని పిలిచి.... ప్రేతగామి.. పోయి ద్రౌపదిని రమ్మని చెప్పు అని అంటాడు.....
అప్పుడు కర్ణుడు ఇలా అంటాడు... ఐదుగురు భర్తలున్న స్త్రీ వేశ్యతో సమానం..ఏకవస్త్రం అంటే నెలసరిలో ఉన్నా ఉన్నా పట్టించుకోవద్దు...ద్రౌపది చీరలు నిండుసభలో తీయ్యడంలో తప్పులేదు అంటాడు... కానీ సినిమాల్లో ఈ సీన్ చూపించారు.... ఈ మాటలు విన్న ప్రేతగామి వెళ్లి ద్రౌపదిని రమ్మని పిలుస్తాడు.... దానికి బదులుగా ప్రేతగామిని ద్రౌపది ఓ ప్రశ్న అడుగుతుంది... నా భర్త తన్నోడి నన్నోడెనా...నన్నోడి తన్నోడెనా అని అడుగుతుంది. అది అర్థంకాక ప్రేతగామి సభకు వెళ్లి చెబుతాడు. ఇది విన్న వెంటనే దుర్యోధనుడు కోపంతో ఇలా అంటాడు... ఈ నా సేవకుడు సూతపుత్రుడికి బుద్ధిలేదు... దశ్శాసనా నువ్వెళ్లి తీసుకురా ద్రౌపదిని అని అంటాడు. దుశ్శాసనుడు వెళ్లి ద్రౌపదని జుట్టుపట్టుకుని ఈడ్చుకుని వచ్చి సభలో పడేస్తాడు. ఆ సమయంలో పాండవులు కూడా మౌనంగా ఉండి పోతారు కానీ.... అయితే కర్ణుడు అన్న మాటలను దుర్యోధనుడి తమ్ముడు వికర్ణుడు తప్పు పడతాడు. నా రెండు ప్రశ్నలకు నువ్వు సమాధానం చేప్పు కర్ణ అని గట్టిగా అడుగుతాడు వికర్ణుడు.... నీ సందేహం ఏమిటో అడుగు వికర్ణ అని అంటాడు కర్ణుడు...
వెంటనే వికర్ణుడు... ద్రౌపది ధర్మరాజుకి మాత్రమే కాదు మిగిలిన నలుగురికి కూడా భార్య.. వాళ్లు కూడా ఒప్పుకుంటేనే ద్రౌపదిని మనం పందెంలో గెలిచినట్టు కాదా నువ్వు ద్రౌపదిని ఇలా చెయ్యడం సరికాదు అంటాడు.... దానికి కర్ణుడు ఇలా అంటాడు... వాళ్లు ఐదుగురు మనకు దాసులు అయినప్పుడు...వాళ్ల సొత్తు అయిన ద్రౌపది కూడా దాసీనే కాదా అంటాడు... దానికి బదులుగా... వికర్ణుడు నువ్వు చెప్పిందే నిజం అయితే... ఎవరైనా మనకు దాసులైతే...అయ్యాక వాళ్లు సంపాదించేది మనసొంతం ...కానీ అంతకుముందు వారు సంపాదించినది మన సొత్తు ఎలా అవుతుంది... అని అడుగుతాడు వికర్ణుడు... ఈ ప్రశ్నకు కర్ణుడి నుంచి సమాధానం రాదు... కానీ కర్ణుడు ద్రౌపదిని అవమానిస్తాడు...
నువ్వు ఎలాగూ ఐదుగురు భర్తలకు భార్యవి..నువ్వు మాలో ఒకర్ని భర్తగా స్వీకరించు అని అంటాడు దానికి బదులుగా దుర్యోధనుడు కట్టుకున్న పంచెని పైకెత్తి కూర్చుని...రా వచ్చి కూర్చో అని తొడభాగం చూపించి అవమానిస్తాడు. అప్పుడే భీముడు...నీ తొడలు బద్దలకొట్టి నిన్ను చంపుతా అని ఆ ప్రతిజ్ఞ చేస్తాడు. ద్రౌపదీ వస్త్రాపహరణం జరుగుతున్న సమయంలో సభలో పెద్దలంతా కళ్లుమూసుకుంటే..కృష్ణుడు వచ్చి ద్రౌపదిని కాపాడాతాడు... కురుక్షేత్ర యుద్ధం వస్తుంది. యుద్ధంలో వికర్ణుడు చనిపోతాడు... అప్పుడు భీముడు చాల బాధపడ్డాడు, నన్ను క్షమించు వికర్ణ కౌరవుల తరఫున యుద్ధానికి వచ్చావు అందుకే చంపక తప్పలేదని ఏడుస్తూ బాధపడతాడు. ఇలా కర్ణుడి గురించి అసలు నిజలను దాచి సినిమాల్లో హీరోగా చూపిస్తున్నారని కోందరు పండితులు అంటున్నారు.
What's Your Reaction?