హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. గోవా కేంద్రంగా డ్రగ్స్ దందా!
హైదరాబాద్‌లో డ్రగ్స్ వ్యవహారం మరోసారి కలకలం రేపింది. నగరంలోని రాజేంద్రనగర్ సమీపంలో పోలీసులు పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను పట్టుకున్నారు. ఐదుగురు నైజీరియన్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 200 గ్రాముల పైచిలుకు కొకైన్ ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.Sri Media News
ఈ తనిఖీల్లో పట్టుబడిన కొకైన్ విలువ దాదాపు 2 కోట్లు ఉంటుందని సమాచారం. ఈ ఆపరేషన్ లో డ్రగ్స్ తరలిస్తున్న నలుగురు పట్టుబడ్డాగా... వీరిలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ సింగ్ కూడా ఉన్నట్టు సమాచారం. మిగిలిన వారంతా నైజీరియన్లు. గోవా కేంద్రంగా డ్రగ్స్ దందా నడుస్తున్నట్టు నిందితుల నుంచి పోలీసులు తెలుసుకున్నారు. అయితే గతంలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా డ్రగ్స్ వ్యవహారంలో విచారణ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
దీంతో మరోసారి తెలుగు పరిశ్రమలోని వారికి ఈ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిలో సినీ ప్రముఖులకు సంబంధించిన వారితో పాటు పలువురు వ్యాపారవేత్తటు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ విషయంలో క్లారిటీ రావలంటే... రాజేంద్రనగర్ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించాకే డ్రగ్స్ కేసులో నిందితుల వివరాలపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముంబై, గోవా ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు కొకైన్, డ్రగ్స్, మత్తు పదార్థాలు తీసుకొచ్చి నైజీరియన్లు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
టాలీవుడ్‌కి ఈ డ్రగ్స్ కేసులు కొత్త కాదు. 2017లో టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు భారీగా ప్రకంపనలు రేపింది. టాలీవుడ్‌ను డ్రగ్స్‌తో షేక్ చేసిన అలెక్స్‌ను పోలీసులు పట్టుకోవడంతో సినీ తారల పేర్లు ఒక్కోక్కటిగా బయటకొచ్చాయి. ఈ కేసుపై ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సిట్ నియమించి విచారణ చేపట్టారు. సినీ పరిశ్రమకు చెందిన హీరో రవితేజ, ఛార్మీ, రకుల్ ప్రీత్ సింగ్, రానా, పూరి జగన్నాధ్, నవదీప్, తరుణ్, తనీష్, సుబ్బరాజు, ముమైత్ ఖాన్ వంటి వారిలో 12మందిని విచారించారు. వారందరి బ్యాంకు లావాదేవీలు పరిశీలించారు. అలా ఈడీ విచారణ కూడా సుమారు 2 నెలలు కొనసాగింది. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపినా కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లభించలేదని ఈడీ తేల్చేసింది. వారిలో ఎవరూ కూడా డ్రగ్స్ వాడినట్లుగా ఆధారాలు లభ్యం కాలేదని ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చేసింది. దీంతో డ్రగ్స్ కేసును మూసివేసినట్లు అయింది.
కాగా గతంలో ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి.. డ్రగ్స్‌పై తీవ్ర స్థాయిలో మండిపడేవారు.. రాష్ట్రంలో ఎక్కడ డ్రగ్స్ కేసు బయటకు వచ్చినా, తనదైన స్టైల్‌లో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేవారు. అందుకే రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి ఈ డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు. దీనికోసం తెలంగాణ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో ఏర్పాటు చేశారు.
What's Your Reaction?