స్టార్ హీరోని ఇంటి గేటు బయటే నిలబెట్టిన సుమన్-ఆ అమ్మాయి వల్లే జైలు కి వెళ్లాడా!

ఒకప్పటి అమ్మాయిలకు కలల రాకుమారుడు సుమన్. అప్పట్లో మెగాస్టార్‌‌‌కి పోటి ఎవరంటే వినిపించే పేరు సుమన్.. అలా కెరీర్‌ పీక్‌లో ఉన్న టైమ్‌‌‌లో.. బ్లూ ఫిల్మ్స్‌ కేసు సుమన్ జీవితాన్ని నాశనం చేసింది. ఈ కేసు వల్ల సుమన్... నెలలు తలబడి డార్క్‌ సెల్‌లో నరకం చూశారు.Sri Media News

Jul 16, 2024 - 14:00
Jul 16, 2024 - 14:00
 0  19
స్టార్ హీరోని ఇంటి గేటు బయటే నిలబెట్టిన సుమన్-ఆ అమ్మాయి వల్లే జైలు కి వెళ్లాడా!

ఆ టైంలో సుమన్ ఎన్నో సుపర్ హీట్ సినిమా ఆఫర్స్ కోల్పోయారు. ఆ సమయంలో  ఇండ‌స్ట్రీలో ఎవ‌రూ ప‌ట్టిచుకోలేద‌ు.. కానీ ఓ హీరోయిన్ ఆయనకు సపోర్టుగా నిలిచింది ఆ హీరోయిన్ ఎవరు?. అదే  టైంలో ఓ హీరో కూడా తన కోసం వచ్చి సపోర్ట్ ఇచ్చారట. ఆ హీరో ఎవరు?.  బ్లూ ఫిల్మ్స్‌ కేసులో  సుమన్‌ని ఎందుకు అరెస్టు చేశారు? సుమన్‌కు అండగా కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు వెళ్లారా? ఇటువంటి ఇట్రెస్టింగ్‌ విషయాలను సుమన్ ఓ ఇంటర్వూలో చెప్పుకోచ్చారు. ఆ విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సుమన్ ... మూడు దశాబ్దాల క్రితం తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరో. ఆయన డేట్స్ కోసం దర్శక నిర్మాతలు ఇంటి ముందు క్యూలు కట్టేవారు. అందగాడు, పైగా కరాటే ఫైటర్ కావడంతో ఆయనతో కుటుంబ కథలు, యాక్షన్ సినిమాలు తెరకెక్కించేందుకు పోటీ పడేశారు. సుమన్ సినిమా అంటే బాక్సాఫీసు గళగళ మోగిపోయేది. హీరోగా పీక్స్‌ దశలో ఉన్న సమయంలో ఆయన జీవితం ఒక్కసారిగా తలక్రిందులైపోయింది. ఓ రోజు రాత్రి హీరో సుమన్ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.

1985, మే 19వ తేదీ శుక్రవారం సుమన్ జీవితాన్ని మార్చేసిన రోజు...  ఓ షూటింగులో పాల్గొని ఇంటికొచ్చిన సుమన్ రాత్రివేళ గాఢనిద్రలో ఉన్నారు. ఆ సమయంలో ఎవరో కాలింగ్ బెల్ కొట్టడంతో సుమన్ లేచి తలుపు తీశారు. ఇంటి బయట చాలామంది పోలీసులు ఉండటంతో షాకైన ఆయన ఏం జరిగిందని అడిగారు.. మీ ఇంట్లో బాంబు ఉందని మాకు సమాచారం వచ్చిందంటూ ఇంటి లోపలికి వచ్చేశారు. ఆ అలజడికి గాఢ నిద్రలో ఉన్న సుమన్ తల్లి కూడా నిద్రలేచి హాల్లోకి వచ్చారు. ఇంట్లో బాంబు దొరక్కపోయినా సుమన్‌ని స్టేషన్‌కు రావాలన్నారు. నేనెందుకు స్టేషన్‌కి రావాలని సుమన్‌ నిలదీయగా.. మీపై చాలా కేసులున్నాయి.. వాటికి సంబంధించి విచారించాలని చెప్పారు. దీంతో సుమన్ వారితో వాగ్వాదానికి దిగగా.. పోలీసులకు సహకరించడం మన బాధ్యత అని తల్లి నచ్చజెప్పి, పోలీసులతో పంపించారు. అలా పంపించటమే.. సుమన్‌ కెరీర్‌లో బాగా లాస్‌ అయ్యారనే చెప్పాలి.. కేవలం విచారించి పంపించేస్తామన్న పోలీసులు… ఉదయం అయినా ఇంటింకి పంపించలేదు.

తెల్లవారిన తర్వాత సుమన్ మేనేజర్ సారథితో పాటు కొంత మంది దర్శక నిర్మాతలు ఆయన్ని కలిసేందుకు వచ్చినా పోలీసులు అనుమతించలేదు. ఆ రోజు సాయంత్రం సమయంలో సుమన్‌ని పోలీసులు సైదాపేట కోర్టులో హాజరుపరిచారు. ఆయన చాలామంది అమ్మాయిలను లైగింకంగా వేధించేవారని, బెదిరించి బ్లూ ఫిలిమ్స్ తీశాడని అభియోగాలు మోపారు. దీంతో న్యాయమూర్తి ఆధారాలు కోరగా.. విచారణ పూర్తయిన తర్వాత సమర్పిస్తామని చెప్పారు. అయితే సుమన్‌పై ఆరోపించిన అభియోగాల్లో పోలీసులు పేర్కొన్న చేసిన సమయానికి సుమన్ బెంగళూరులో ఓ సినిమా షూటింగులో ఉన్నారని ఆయన తరపు న్యాయవాది ఆధారాలు కోర్టుకు సమర్పించారు. అయితే పోలీసులు ఆయనపై యాంటీ గూండా యాక్ట్‌ కింద కేసు నమోదు చేయడం వల్ల కోర్టు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది.

ఆ త‌ర్వాత సుమన్‌ని మ‌ద్రాస్ జైలుకి తరలించారు… పైగా సాధార‌ణ ఖైదులు ఉండే గ‌దులు కాకుండా అత్యంత ప్రమాద‌క‌ర టెర్రరిస్టులు ఉండే గ‌దుల్లో ఆయనను ఉంచారు. నెలలు గడుస్తున్నా డార్క్‌ సెల్‌ నుంచి ఆయనను సాధారణ సెల్‌కు మాత్రం మార్చలేదు.. దీంతో సుమన్‌ మానసికంగా కృంగిపోయేవారు.. అయినప్పటికీ తనకు తానే.. ధైర్యం చెప్పుకొనేవారు.. సుమన్‌ జైలులో ఉన్నప్పుడే.. ఓసారి క‌రుణానిధి గారు వ‌చ్చి.. ఆయన పరిస్థితి చూసి చలించిపోయారు. జైలు అధికారుల‌ను హెచ్చరించి.. సుమన్‌ని వేరే గ‌దికి మార్పించారు.

అయితే ఈ కేసు త‌న‌పై జ‌రిగిన ఓ పొలిటిక‌ల్ కుట్ర అని సుమ‌న్ అంటారు. తమిళనాడులో ఒక పోలీస్ అధికారి కుమార్తె తన వెంట పడడం వల్ల ఇదంతా జరిగిందని చెబుతారు సుమన్... అయితే ఈ విషయంలో  చిరంజీవి ప్రమేయం లేదని..  ఆయన పై  ప్రచారం లో ఉన్నవి  రూమర్స్ అంటారు సుమన్. ఆ పోలీస్ అధికారి అప్పటి సీఎం ఎంజీఆర్ కి ఫిర్యాదు చేయడంతో ఇదంతా జరిగింది. ఆ అమ్మాయే తన వెంట పడుతోందని, తన తప్పు ఏమి లేదని చెప్పినా ఎంజీఆర్ వినిపించుకోలేదట.  తనపై కక్ష కట్టి లేనిపోని కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెట్టాట సుమన్‌‌ని.

అయితే జైలు నుంచి వచ్చాక చాలా మంది సుమన్ ని ఫోన్ చేసి పరామర్శించారట. కానీ  నేరుగా వెళ్లి కలసి పరామర్శించడానికి ఎవరూ సాహసం చేయలేదుట. ఆ సమయంలో హీరోయిన్ సుమలత ఒక్కరే ఇంటికి వెళ్లి పరామర్శించాట.అయితే  హీరోల్లో ఆ సాహసం చేసిన వ్యక్తి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మాత్రమే నట. ఒక రోజు మోహన్ బాబు ఉదయాన్నే వెళ్లి సుమన్ ఇంటి గేటు వద్ద నిలబడి ఉన్నారట. అప్పుడే జైలు నుంచి రావడంతో ఎవరిని కలసి మాట్లాడటానికి ఇష్టపడేవారు కాదట.

ఓ రోజు వాచ్ మెన్ వచ్చి మీ కోసం మోహన్ బాబు వచ్చారు. గెటు ముందు ఉన్నారు అని చెప్పాడట. వెంటనే సుమన్.. నాకు ఎవరితోనూ మాట్లాడాలని లేదు.. పంపించేయండి అని అన్నారట. వెంటనే సుమన్ వాళ్ళ అమ్మ వచ్చి.. వచ్చింది మోహన్ బాబు గారు.. నువ్వు తప్పకుండా మాట్లాడాలి అని చెప్పారు. అమ్మ మాట కాదు అనలేక మోహన్ బాబు గారిని లోపలికి ఆహ్వానించారట సుమన్. అందుకే నాకు మోహన్ బాబు అంటే అభిమానం. చాల మంది మోహన్ బాబుగారు ముక్కోపి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు అని  అంటారు. కానీ నేను అవన్నీ పట్టించుకోను. నా కోసం ఆయన వచ్చి గేటు దగ్గర నిలబడ్డారు. ఆయనకి రావాల్సిన అవసరం లేదు. కానీ వచ్చి పలకరించారు. కాబట్టి మోహన్ బాబు గారిని నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటా అని సుమన్ చెప్పుకోచ్చారు.

అయితే సుమన్ జైలు జీవితం వెనుక అనేక రూమర్స్ ఉన్నాయి. ఒక పెద్ద స్టార్.. మరో చెన్నై పోలీస్ కమీషనర్ దీని వెనుక ఉండి నడిపించారు అని అంటారు. దీనికి సుమన్ ఇలా అన్నారు...  ఇదంతా అవతల వాళ్లపై బురద చల్లే ప్రయత్నం మాత్రమే..  నేను జైలుకి వెళ్లడానికి చిరంజీవి కారణం అంటే నేను ఒప్పుకోను. ఈ కేసులలో అమ్మ చాల కష్టపడింది. నా కోసం పట్టు విడవకుండా న్యాయ ‌పోరాటం చేసింది. అప్పుడు జరిగిన మ్యాటర్ వేరు.. ప్రచారం వేరు అని తేల్చి చెప్పేశారు సుమన్‌ గారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow