కిమ్ దుర్మార్గపు ఐడియా....టాయిలెట్ వార్ ప్రకటన

కిమ్ జాంగ్ ఉన్.. చూసేందుకు పొట్టిగా ఉన్నా అగ్రరాజ్యాలకు నిద్ర లేకుండా చేసేంత గట్టివాడు. దేశం ఒక చిన్న దీవికే పరిమితమైనా.. మాకేం తక్కువ.. తగ్గేదేలే అనే కాన్ఫిడెన్స్ అతనిలో ఎప్పుడూ కనిపిస్తుంది. ఇక కిమ్ జాంగ్ ఉన్ ఏం చేసినా ఓ సంచలనం. Sri Media News

Jun 7, 2024 - 13:59
Jun 8, 2024 - 10:38
 0  9
కిమ్ దుర్మార్గపు  ఐడియా....టాయిలెట్ వార్ ప్రకటన

కిమ్ జాంగ్ ఉన్.. చూసేందుకు పొట్టిగా ఉన్నా అగ్రరాజ్యాలకు నిద్ర లేకుండా చేసేంత గట్టివాడు. దేశం ఒక చిన్న దీవికే పరిమితమైనా.. మాకేం తక్కువ.. తగ్గేదేలే అనే కాన్ఫిడెన్స్ అతనిలో ఎప్పుడూ కనిపిస్తుంది. ఇక కిమ్ జాంగ్ ఉన్ ఏం చేసినా ఓ సంచలనం. అరాచకానికి నిలువెత్తు నిదర్శనం. ఐదడుగులు  ఉండే ఈ మనిషి ఇప్పుడు ప్రపంచ దేశాలను  గడగడలాడిస్తున్నాడు. నియంతలను మించిన నియంతగా ఎదిగాడు. రాచరిక పాలనలో తండ్రి నుంచి వారసత్వాన్ని అందుకున్న కిమ్.. ఉత్తరకొరియా అధ్యక్షుడిగా ఆ దేశాన్ని ఓ 'మిస్టరీ' దేశంగా మార్చేశాడు. దేశంలో ఆయన విధించే ఆంక్షలు ఎప్పుడు సంచలనమే..  

చాలా ఏళ్లుగా ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాల మధ్య తీవ్ర స్థాయిలో శత్రుత్వం ఉంది. రెండు దేశాల మధ్య రాకపోకలు కూడా బాగా తక్కువ. సరిహద్దుల వెంట కంచె ఉంటుంది. అయితే ఈ రెండు దేశాల ప్రజలను కలిపేవి బెలూన్స్. తీవ్ర పేదరికంతో అల్లాడే ఉత్తర కొరియాకు దక్షిణ కొరియా ప్రజల నుంచి బెలూన్ల ద్వారానే సాయం కూడా అందుతుంటుంది. ఉత్తర కొరియా నుంచి ఏదైనా సమాచారం అందించేవారు ఇలా బెలూన్ల ద్వారానే ఇస్తుంటారు. అయితే ఇంతకు ముందు దక్షిణ కొరియా కొంతకాలం ఈ విధానాన్ని నిషేధించింది. కానీ అక్కడి గొప్ప అపెక్స్ కోర్టు ఠాట్.... అంటే దక్షిణ కొరియా అత్యున్నత న్యాయస్థానం అలా ఎలా ఆపుతారు.. అని ప్రభుత్వన్ని ప్రశ్నించింది. బెలూన్స్ ఎగురవేయడం అనేది... వారి అది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, అడ్డుకోవడం తప్పు అని చెప్పింది… ఈ బెలూన్లు తన దేశం వైపు రాకుండా ఉండేందుకు కీమ్ దుర్మర్గపు ఐడియా వేశాడు... దక్షిణ కొరియాపై టాయిలెట్ వార్ ప్రకటించాడు.

 వందల బెలూన్లు ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియా సరిహద్దుల్లోకి వదలమని సైనికులను ఆదేశించాడు… అయితే వారికి ఓ కండిషన్ కూడా పెట్టాడు కిమ్... ఆ బెలూన్స్‌‌కి... బ్యాగులను జత చేసి వాటిపై ‘విసర్జన’ అని రాసి వదలమని చెప్పాడు… విసర్జన అని రాస్తే... దక్షిణ కొరియాకి వచ్చే నష్టం ఏముంది అని.... అందుకే కిమ్ తన  చెత్త బుర్రకు పదును పెట్టి...  ఆ బ్యాగుల్లో తడి చెత్త, మలం, డ్రైనేజీ సరుకును నింపి వదుల మన్నాడు.. అయితే ఈ చెత్త, మలం బెలూన్స్ చూసి దక్షిణ కొరియా వణికి పోతుంది... ఆ బెలూన్స్‌‌లో  చెత్త మాత్రమే ఉందా..? ఇంకేమైనా రేడియో యాక్టివ్ పదార్థాలు, ప్రమాదకర రసాయనాల్ని పంపిస్తున్నారా..? ఆ రోగ్ కంట్రీ చేసినా చేస్తుంది  అనే అనుమానంతో దక్షిణ కొరియా మిలిటరీ బృందాలతో ఆ బెలూన్స్‌‌ను పరీక్షిస్తోంది…

 అంతేకాదు... సరిహద్దు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసింది, జాగ్రత్తగా ఉండాలని ప్రకటనలు చేస్తోంది… అయితే గతంలో సరిహద్దుల వెంట దక్షిణ కొరియా వైపు నుంచి వచ్చిన బెలూన్లు, ఇతర వస్తువుల కారణంగానే తమ దేశంలోకి కరోనా వైరస్ ప్రవేశించిందని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోపించారు కూడా. అయితే ఈ యుద్ధం గురించి తెలుసుకున్న ప్రపంచ దేశాలు నవ్వుకుంటున్నాయి... పర్లేదు లెండి, మరీ డ్రైనేజీ యుద్ధంలాగే ఉంది గానీ, ఎవరికీ ఏ ప్రమాదమూ లేదు కదా అని అంటున్నారట రెండు దేశాల్లోని రాజకీయ పరిశీలకులు…  బెలూన్స్‌‌లో టాయిలెట్ వ్యర్థలు నింపి దక్షిణ కొరియా పై చల్లుతున్న కిమ్ దుర్మర్గపు ఐడియా.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow