ఖిలాడీ లేడీ సుద్దపూస..చూస్తే ఎవరికి అనుమానం రాదు!
ఇప్పుడు మనం చెప్పుకునే అమ్మాయి వ్యాపారం చేయడంలో నేర్పరి. సంపాధించిన డబ్బును విలాసకు ఖర్చు చేస్తూ.. దేశంలోని అనేక రాష్ట్రాలకు ట్రిప్స్ వేస్తూ... లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంది. ఎక్కడకు వెళ్లినా పెద్ద పెద్ద హోటల్స్‌లోనే ఉంటుంది చిన్న హోటల్స్ ఈమె కంటికి కనిపించవు.Sri Media News
బిజినెస్‌లో వద్దు అన్న వచ్చి పడే డబ్బుతో లగ్జరీ లైఫ్ లీడ్ చేయడంలో మునిగి తేలేది. అంతా సవ్యంగా జరుగుతున్న సయయంలో ఆ అమ్మాయి జీవితం అనుకోని మలుపు తిరిగింది... కేరళలోని పుయ్యింగడి ఎటక్కల్ ప్రాంతంలోని ఓ అద్దె ఇంట్లో ఉన్న తనను పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. తన వద్ద ఉన్న రెండు కోట్లకు పైగా విలువ చేసే వాటిని చేసుకున్నారు. ఈమెను పట్టుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం.. కుమిలిలో రిమాండ్‌కు తరలించారు.
అసలు ఏం జరిగిందో అర్ధం కావడం లేదా...
బిజినెస్ చేసే అమ్మాయిని ఎందుకు అరెస్ట్ చేశారు? అమ్మాయి చేసిన తప్పు ఏంటి? అసలు ఆ అమ్మాయి చేస్తున్న వ్యాపారం ఏంటి? అనే విషయాలను మనం తెలుసుకుందాం... ఈ అమ్మాయి చేసే వ్యాపారం అలాంటి, ఇలాంటిది కాదు.. పోలీసులు సైతం ఈమెను చూసి ఈ పిల్ల చేస్తుందా అని ఖంగుతిన్నారు. ఎందుకంటే ఈ అమ్మడు చేస్తుంది డ్రగ్స్ సరఫరా బిజినెస్.
మే 19 2024 కేరళ పోలీసులుకు ఓ టిప్ వచ్చింది. షైన్ షాజీ అనే ఓ వ్యక్తి కేరళలోని పుయ్యింగడి ఎటక్కల్ ప్రాంతంలోని ఓ అద్దె ఇంట్లో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నడని... పక్కా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చెరుకొని తనిఖీలు నిర్వహించగా పోలీసులకు అక్కడ రెండు కోట్లకు పైగా విలువైన డ్రగ్స్ దొరికాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు షైన్ షాజీని అరెస్టు చేశారు.... అయితే పోలీసులు వస్తున్నారని తెలిసి ఇద్దరు వ్యక్తులు పోలీసులకు దొరక్కుండా పరారయ్యారు. కాగా కేరళ పోలీస్ ప్రత్యేక దర్యాప్తు బృందం.. పారిపోయిన నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టింది. దీంతో పెరువన్నముళి ప్రాంతానికి చెందిన అల్బిన్ సెబాస్టియన్‌ను అనే మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి కుమిలిలో రిమాండ్‌కు తరలించారు.
ఈ నిందితుల్ని విచారించగా.. విస్తుపోయే విషయాలు చెప్పారు. వీరే కాదూ.. వీటి వెనుక మరో కిలాడీ లేడీ ఉంది. ఈమె వీరందరికి కొరియర్ క్వీన్ ఖిలాడీ లేడీ సుద్దపూస జుమీ. షైన్ షాజీ డ్రగ్స్ కొరియర్ చేసేందుకు జూమీని వినియోగించే వాడు. జూమీ చూడటానికి చాల అందంగా... సంప్రదాయనీ.. సుద్దపూసలా ఉండటంతో బెంగళూరు నుండి టూరిస్టు బస్సుల ద్వారా డ్రగ్స్ చాల సింపుల్‌గా రవాణా చేసేది. అయితే జుమీ గురించి పోలీసులు విచారణలో తెలుసుకున్నదాని ప్రకారం... జుమీ గురించి సర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. చివరికి బెంగళూరులో జుమీ ఉన్నట్టు తెలుసుకున్న కేరళ పోలీసులు బెంగళూరుకు వెళ్లి అరెస్టు చేశారు. ఈ సుద్దపూస జుమీ మద్యానికి బానిసై.. డ్రగ్స్ కొరియర్ చేయడం ద్వారా వచ్చే ఆదాయంతో విలాసవంతమైన జీవనాన్ని గడిపేది. తరచుగా గోవా, బెంగళూరు టాప్ హోటల్లోనే బస చేసేది. కానీ చివరికి పోలీసులకు చిక్కి ఊచలు లెక్క పెడుతుంది.
దేశంలో డ్రగ్స్ సమస్య నాటి నాటికి పెరుగుతు వస్తోంది. ప్రభుత్వాలు డ్రగ్స్ అనే మాటే లేకుండా చేస్తామని చెబుతున్నా కూడా.. కొందరు విచ్చల విడిగా డ్రగ్స్ అమ్ముతు... వినియోగిస్తున్న ఘటనలు సోషల్ మీడియాలో కన్పిస్తున్నాయి. చాపకింద నీరులా డ్రగ్స్ సామ్రాజ్యాం విస్తరిస్తోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో డ్రగ్స్ రాకెట్స్ విచ్చలవిడిగా తమ దందా సాగిస్తున్నాయి. అనేక రాష్ట్రాలలో పలుమార్లు డ్రగ్స్ మాఫియాను పట్టుకున్న.... డ్రగ్స్‌ను దేశంలో కట్టడి చెయ్యడంలో పోలీసులు విఫలం అవుతున్నారు. ఇటీవల స్కూళ్ళు, కాలేజీలు టార్గెట్ చేస్తూ డ్రగ్స్ మాఫియా యువతను పెడదారి పట్టి స్తోందని, డ్రగ్స్ కు యువతను బానిసలుగా చేస్తుందని పలు సంఘటనల ద్వారా వెల్లడైంది. రకరకాల మార్గాలతో రెచ్చిపోతున్న డ్రగ్స్ మాఫియా ఇప్పుడు కొత్త మార్గం ఎంచుకుంది.
స్కూళ్ళు, కళాశాలలలో డ్రగ్స్ రవాణాపై పోలీసులు దృష్టి సారించడంతో... డ్రగ్ పెడలర్స్ వారి వ్యాపారన్ని చిన్న చిన్న కాఫీ షాపుల మీదకు మార్చరు. కాఫీ షాప్ ల ద్వారా, పాన్ షాపుల ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అనేక వార్తలు మనం చూస్తునే ఉన్నాం. మానవాళి మనుగడకు విఘాతం కలిగిస్తున్న ఈ మాదకద్రవ్యాల వినియోగం పై ఎక్సైజ్ అధికారులు, నార్కోటిక్స్ అధికారులు, పోలీసులు డ్రగ్స్ సరఫరాపై ఎప్పటికీ నిఘా పెడుతునే వస్తున్నారు. అయినప్పటికి హెరాయిన్, కొకైన్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలు గుట్టుచప్పుడు కాకుండా సరఫరా అవుతునే ఉన్నాయి.
ఒకప్పుడు రాజధానులకు మాత్రమే పరిమితం అయిన ఈ డ్రగ్స్ కల్చర్ ఇప్పుడు పల్లే ప్రాంతాలకు సైతం విస్తరించింది. రేవ్ పార్టీల పేరుతో కూడా డ్రగ్స్ దందా సాగుతుంది. స్కూళ్ళు, కళాశాలలు, యూనివర్సిటీలు , పబ్బులు మాత్రమే కాదు కాఫీ షాపులపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం వుంది. లేకుంటే దేశ యువత ప్రమాదంలో పడుతుంది.
What's Your Reaction?