ప్రముఖ నటి కి రెండుసార్లు బ్రేకప్-మూడు సార్లు అబార్షన్
సినిమా ఇండస్ట్రీలో అవకాశం దొరికితే చాలు హీరోయిన్లను వాడుకొని వదిలేయడానికి ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు.ఇలా ఎంతోమంది నటీమణులు చాలా తొందరగా మరొకరి చేతిలో మోసపోయి జీవితాన్ని కోల్పోయిన వారు ఉన్నారు.Sri Media News
సినిమా ఇండస్ట్రీలో అవకాశం దొరికితే చాలు హీరోయిన్లను వాడుకొని వదిలేయడానికి ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు.ఇలా ఎంతోమంది నటీమణులు చాలా తొందరగా మరొకరి చేతిలో మోసపోయి జీవితాన్ని కోల్పోయిన వారు ఉన్నారు. అదేవిధంగా సినిమాలలో సంపాదించినది మొత్తం నమ్మకంతో ఇతరుల చేతులలో పెట్టి చివరికి అనాధలుగా మిగిలిపోయిన వారు ఉన్నారు.
ఇలా జీవితంలో తన జీవితాన్ని కోల్పోవడం కాకుండా దారుణంగా మోసపోయిన వారిలో నటి శ్రీ విద్యా ఒకరు. శ్రీవిద్య తెలుగు తమిళ కన్నడ సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు పొందారు. తమిళ హాస్యనటుడు కృష్ణమూర్తి, కర్ణాటక శాస్త్రీయ సంగీత గాయని ఎం.ఎల్.వసంతకుమారిలకు శ్రీవిద్య జన్మించింది. ఆమె పుట్టిన సంవత్సరానికే తండ్రికి పక్షవాతం రావడంతో ఆయన నటనకు స్వస్తి పలికారు. కుటుంబాన్ని పోషించే బాధ్యత తల్లిపైనే పడిరది. కచ్చేరీలు చేయడం ద్వారా వచ్చే డబ్బుతోనే జీవనం సాగించేవారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే శ్రీవిద్య సినిమాల్లోకి ప్రవేశించింది.
14 ఏళ్ళ వయసులో శివాజీ గణేషన్ హీరోగా నటించిన తిరువరుచెల్వర్ అనే తమిళ సినిమా ద్వారా చిత్ర రంగ ప్రవేశం చేశారు శ్రీవిద్య. తెలుగులో ఆమె నటించిన మొదటి సినిమా పేదరాశిపెద్దమ్మ కథ. శ్రీవిద్యను దాసరి నారాయణరావు తన సినిమాల ద్వారా ఎక్కువగా ప్రోత్సహించారు. కె.బాలచందర్ దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన ‘అపూర్వ రాగంగళ్’ చిత్రంలో కమల్‌హాసన్, రజినీకాంత్ నటించారు. ఇదే సినిమాను తెలుగులో దాసరి నారాయణరావు ‘తూర్పు పడమర’ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో ఘనవిజయం సాధించింది. రెండు భాషల్లోనూ శ్రీవిద్య ప్రధాన పాత్ర పోషించారు. తర్వాత మలయాళం, తెలుగు, కన్నడ రంగాల్లోకి అడుగుపెట్టి తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకొన్నది.
ప్రముఖ దర్శకుడు కే బాలచందర్ రూపొందించిన అపూర్వ రాగంగల్ సినిమాలో కమల్, రజనీకాంత్‌తో కలిసి నటించింది. ఆ సమయంలో ఆమె కమల్ హాసన్‌తో ప్రేమలో పడింది. అయితే కమల్‌తో ప్రేమ పెళ్లికి ఆమె తల్లి అభ్యంతరం చెప్పడంతో బ్రేకప్ జరిగిపోయింది. ఆ తర్వాత డైరెక్టర్ భరతన్‌తో ప్రేమలో పడింది. శ్రీవిద్య భరత్‌తో కొన్ని సినిమాలు చేసింది. కాని భరత్ తో కూడా ఆమె ప్రేమ విఫలం అయ్యింది. దాంతో శ్రీవిద్య చాలా డిస్ర్టబ్ అయ్యింది. దర్శకుడు భరతన్ నటి కేపీఏసీ లలితను పెళ్లి చేసుకున్నారు. తరువాత వాణీ గణపతిని వివాహం చేసుకున్నారు కమల్. ఆ తర్వాత మలయాళ దర్శకుడు జార్జ్ థామస్‌తో ప్రేమలో పడి 1978లో అతన్ని వివాహం చేసుకున్నారు శ్రీవిద్య. థామస్ క్రిస్టియన్.
శ్రీవిద్య బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చారు. ఈ పెళ్ళికి శ్రీవిద్య తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అయినా వారిని ఎదిరించి థామస్‌ని పెళ్ళి చేసుకున్నారు. అతని కోరిక మేర పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు శ్రీవిద్య. రెండు సంవత్సరాలు మాత్రమే వారి వైవాహిక జీవితం నడిచింది. థామస్ కెరీర్ సవ్యంగా లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. సినిమాల్లో నటించాలని శ్రీవిద్యకు చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ నటిగా కొనసాగారు. శ్రీవిద్య సంపాదిస్తుంటే.. దాన్ని ఖర్చు చేసే పనిలో ఉండేవాడు థామస్. దానికితోడు వేధింపులు కూడా ఎక్కువ కావడంతో 1980లో అతని నుంచి విడాకులు తీసుకున్నారు శ్రీవిద్య.
వీరి పెళ్లి జరిగిన ఈ రెండేళ్లలో శ్రీవిద్యకు మూడుసార్లు అబార్షన్లు జరిగినట్లు సమాచారం. దాంతో ఆరోగ్య పరంగా కూడా ఆమె ఎన్నో ఇబ్బందులు పడింది. ఇటు నటిస్తూనే.. అటు జీవిత పోరాటం చేసింది శ్రీవిద్య. ఇక ఆమె చెన్నైలో ఉండలేక తిరువనంతపురంలో స్థిరపడింది. అక్కడకు షిప్ట్ అయిన కొంత కాలానికే.. 2003లో శ్రీవిద్య అనారోగ్యానికి గురయ్యారు. అప్పుడు జరిపిన పరీక్షల్లో ఆమెకు రొమ్ము క్యాన్సర్ ఉన్నట్టుగా తేలింది. తను ఎంతో కాలం బ్రతకదని తెలుసుకున్న శ్రీవిద్య తన పేరుపై ఎలాంటి ఆస్తి ఉండకూడదని నిర్ణయించుకున్నారు.
సంగీత, నృత్య కళాశాలలోని విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందడం లేదని తెలుసుకొని మలయాళ నటుడు గణేష్ ఆధ్వర్యంలో ఒక ట్రస్ట్‌ను రిజిష్టర్ చేసారు. దాని ద్వారా అర్హులైనవారికి సహాయం అందేలా ఏర్పాటు చేశారు. ఆరోజుల్లోనే శ్రీవిద్యకు ఉన్న కోట్ల ఆస్తుల్ని ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ట్రస్ట్‌కి కొంత రాసారు. తన తమ్ముడి పిల్లలకు ఐదేసి లక్షలు చొప్పున, తన దగ్గర పనిచేసిన వారికి లక్ష రూపాయల చొప్పున చెందేలా వీలునామా రాయించారు. మూడు సంవత్సరాల పాటు క్యాన్సర్‌కి ట్రీట్‌మెంట్ తీసుకున్న శ్రీవిద్య ఆరోగ్యం క్షీణించడంతో 2006 అక్టోబర్ 19న 53 ఏళ్ళ వయసులో తుదిశ్వాస విడిచారు. తిరువనంతపురంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్న ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం విజయం సాధించలేకపోయింది. రెండుసార్లు లవ్ ఫెయిల్యూర్, భర్త వేధింపులు, చివరికీ క్యాన్సర్‌తో మరణం ఆమె జీవితాన్ని విషాదంగా ముగిసేలా చేశాయి.
కాగా ఈ మధ్య తన ప్రియురాలు శ్రీదివ్యను తలుచుకుని కమల్ హాసన్ ఎమోషనల్ అయిన వీడియో వైరల్ అయ్యింది. ఇక వీరి ప్రేమ కథలో రహస్యాలు ఎన్నో.. ఆమె జీవితంలో కష్టాలు కూడా అన్నే. నరకాన్నిప్రత్యక్ష్యంగా చూసింది శ్రీదివ్య. నటిగా ఇంకా భవిష్యత్తు ఉన్నశ్రీవిద్య కాన్సర్ కారణంగా 2006లో మరణించింది. అయితే ఆమె తన తొలి ప్రేమను పంచుకున్న కమల్ హాసన్‌ని చివరి రోజుల్లో చూడాలనుకుంది. కమల్ కు కబురు పట్టడంతో.. ఆ విషయం తెలుసుకున్నకమల్ హాసన్ ఆమెను చివరి రోజుల్లో కలుసుకుని ప్రేమను పంచాడట. అంతే కాదు ఆ విషయం తలుచుకుని కమల్ ఓసారి ఎమోషనల్ అయ్యాడు కూడా.
సినీ సెలబ్రిటీస్ అంటే లగ్జరీ లైఫ్, చాలా డబ్బు, బాధలు అంటే ఏంటో తెలియవు.. ఇవి సాధారణ సినీ ప్రేక్షకుడు అనుకునే మాటలు.. కానీ నవ్వుతూ కనిపించే సినీ తారల జీవితాల వెనుక కూడా ఎన్నో విషాదాలు ఉంటాయి. ఎన్నో కన్నీళ్లు ఉంటాయి. నటిగా మెప్పించి ఎంతోమంది ప్రేక్షకుల గుండెల్లో గుడికట్టుకున్న శ్రీవిద్య కష్టాలు చూస్తే... చివరి రోజుల్లో శ్రీ విద్య ఎలాంటి కష్టాలు పడ్డారో తెలుస్తుంది.
What's Your Reaction?