స్టార్ హీరోకు ఎయిడ్స్..?
సెలబ్రిటీలపై నిత్యం ఎన్నో రకాల రూమర్లు వస్తుంటాయి. ఎక్కువగా ఏ సినిమాలో ఏ నటి నటిస్తుంది? అన్న అంశంపై గెస్సింగ్స్ తెరపైకి వస్తుంటాయి. అవి కేవలం ఊహాగానాలు మాత్రమే. అందులో ఏది వాస్తవం ..ఏది అవాస్తవం అన్నది క్లారిటీ ఉండదు. Sri Media News
సెలబ్రిటీలపై నిత్యం ఎన్నో రకాల రూమర్లు వస్తుంటాయి. ఎక్కువగా ఏ సినిమాలో ఏ నటి నటిస్తుంది? అన్న అంశంపై గెస్సింగ్స్ తెరపైకి వస్తుంటాయి. అవి కేవలం ఊహాగానాలు మాత్రమే. అందులో ఏది వాస్తవం ..ఏది అవాస్తవం అన్నది క్లారిటీ ఉండదు. సోర్స్ ని బేస్ చేసుకుని అల్లుకున్న కథలే ఎక్కువగా ఉంటాయి. వీటిని కొందరు చూసీ చూడనట్లు ఉంటారు. కొందరేమో అగ్గి మీద గుగ్గిలమవుతారు. మరికొందరేమో కోపమొచ్చినా, బాధేసినా మనసులోనే దాచుకుంటారు. అలా ఒకప్పటి పాపులర్ హీరో మోహన్ మీద అప్పట్లో పెద్ద తప్పుడు ప్రచారం జరిగింది. అతడికి ఎయిడ్స్ ఉందని ఎవరో వదంతులు సృష్టించారు. ఇంకేముంది.. ఇది నిజమేనని చాలామంది వార్తలు రాసేశారు. దశాబ్దాల తర్వాత ఆ వార్తలపై క్లారీటి వచ్చింది.
హీరో మోహన్ 10 మే 1956న జన్మించారు. తమిళ, తెలుగు , కన్నడ, మలయాళ చిత్రాలలో నటించారు. మోహన్ తొలి చిత్రం కోకిల 1977 వచ్చింది. అప్పటి నుండి "కోకిల మోహన్" అని కూడా పిలుస్తారు. 1982లో పయనంగల్ ముదివత్తిల్లైలో అనే సినిమాలో తన నటనకు ఉత్తమ తమిళ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నాడు. కోకిల సినిమా తర్వాత మోహన్ 1978లో మదాలస అనే మలయాళ సినిమాలో నటించారు . ఈ సినిమా విజయం సాధించిన వెంటనే, 1979లో దర్శక ధీరుడు బాపు తీసిన తూర్పు వెల్లే రైలు అనే తెలుగు చిత్రానికి సంతకం చేశారు , ఇది తమిళ చిత్రం కిజక్కే పోగుమ్ రైల్ అనే సినిమాకి రీమేక్ . తర్వాత... 1980లో మూడు పని అనే ఈ సినిమా తమిళ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది.
దీంతో ఆయన సినిమాలు ఏడాదిపాటు సక్సెస్‌ఫుల్‌గా ఆడటం సర్వసాధారణం కావడంతో తనను సిల్వర్ జూబ్లీ హీరో అని పిలిచేవారు. 1986లో మణిరత్నం దర్శకత్వం వహించిన తమిళ రొమాంటిక్ డ్రామా చిత్రం మౌన రాగంలోఉత్తమ నటనను ప్రదర్శించాడు అంతేకాదు...1999లో అన్బుల్లా కధలుక్కు అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా నిర్మాణం, దర్శకత్వం చేశాడు. కానీ... దురదృష్టవశాత్తు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజస్టర్ అయ్యింది.
దీంతో టెలివిజన్ సీరియల్స్ నిర్మిస్తూ బిజీగా ఉండేవారు మోహన్. అచ్చం మేడమ్ నానం , సెల్వంగల్ , హాసియారామాయణం , బృందావనం వంటి సిరిమల్స్ తీశారు కూడా... ఆ తరువాత సినిమా అవకాశాలు వచ్చాయి...2006లో జయం రవి నటించిన ఉనక్కుమ్ ఎనక్కుమ్ లో జయం రవి తండ్రి పాత్రను చేయడానికి అఫర్ వచ్చింది కానీ నిరాకరించాడు. 2008లో విడుదలైన సుట్టా పజంలో 9 సంవత్సరాల విరామం తర్వాత మోహన్ మళ్లీ హీరోగా నటించారు.
ఇక తాజాగా... హీరో మోహన్ మీద అప్పట్లో ఆయనకు ఎయిడ్స్ వచ్చిందని పెద్ద తప్పుడు ప్రచారం జరిగింది. ఇంకేముంది.. ఇది నిజమేనని చాలామంది వార్తలు రాసేశారు. దశాబ్దాల తర్వాత ఆ తప్పుడు వార్తలపై స్పందించాడు.... ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘'90'స్‌లో సినిమాలకు దూరంగా ఉన్నప్పుడు నాకు ఎయిడ్స్ అని ప్రచారం చేశారు. ఇది విని నా అభిమానులు ఆందోళన చెందారు. కుటుంబం సైతం ఇబ్బందిపడింది. కానీ ఆ సమయంలో నాకు ఎంతో అండగా నిలిచింది.
నాకు ఎయిడ్స్ లేదని మీడియాకు క్లారిటీ ఇవ్వమని ఓ జర్నలిస్టు సలహా ఇచ్చాడు. నేనందుకు ఒప్పుకోలేదు. ఈ పుకారును సృష్టించేదే మీడియా.. కాబట్టి వాళ్లంతట వాళ్లే ఇది తప్పని చెప్పాలని మొండిగా వ్యవహరించాను. ఏ సంబంధమూ లేని నన్ను బలి చేసినప్పుడు పనికి మాలిన పుకారు గురించి స్పందించాల్సిన అవసరం నాకేంటని సైలెంట్‌గా ఉన్నాను. అప్పుడు నా భార్య, కుటుంబం నాకెంతో అండగా నిలబడింది’’ అని చెప్పుకొచ్చాడు. అయితే చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన జూన్ 7న విడుదలైన హర (తమిళ) చిత్రంతో ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చాడు. దీంతో ప్రస్తుతం ఈయన సోషల్ మీడియాలో ట్రేండ్ అవుతున్నారు.
What's Your Reaction?